పక్కా ప్రణాళికతోనే హత్య
► రెండు రోజుల్లో రాజేష్ కేసును ఛేదిస్తాం : ఏసీపీ మల్లారెడ్డి
► నాలుగు బృందాలతో గాలింపు
►శ్యాంసుందర్రెడ్డిపైనే అనుమానం
ఇబ్రహీంపట్నంరూరల్: గుంటిరాజేష్ హత్య కేసు ఛేదించి రెండురోజుల్లో నిందుతులను పట్టుకుంటామని ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి అన్నారు. ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్బీనగర్కు చెందిన గుంటి రాజేష్ హత్యపై అన్ని కోణాల్లో విచారిస్తున్నామన్నారు. పాత కక్ష్యలే కారణం అని అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే హత్యకు పన్నాగం పన్నారని తెలిపారు. గతంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన విషయంలో అనుషారెడ్డి తల్లిదండ్రులే హత్య చేసి ఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు ఏసీపీ తెలిపారు. కొతూ్తర్ గ్రామానికి చెందిన శ్యాం సుందర్‌రెడ్డితో వివాదమే రాజేష్ హత్యకు కారణమయి ఉండొచ్చని అనుమానించారు.
మూడు బృందాలతో నిందుతుల కోసం గాలి ంపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హత్య జరిగిన సంఘటన స్థలం వద్ద రాజేష్‌తో పాటు వచ్చిన యుగేందర్ హత్య ఉదంతం, హత్యచేసిన పరిస్థితిని చూసి ముగు్గరులేదా నలుగురు వ్యకు్తలు హత్యలో పాలుపుంచుకున్నట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. రాజేష్‌పై హయత్‌నగర్‌లో 10చీటింగ్ కేసులు, సరూర్‌నగర్ పీఎస్‌లో రెండో భార్య కేసు వీటిన్నంటి పూర్వపరాల ప్రకారం కేసు విచారిస్తున్నామన్నారు.
హత్య జరిగిన అరగంటలోపే శ్యాం సుందర్‌రెడ్డి కుటుంబ సభ్యులు పరారీలో ఉండడం, వారి సెల్‌ఫోన్ లొకేషన్లు వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు చూపించడం బట్టి శ్యాంసుందర్రెడ్డే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు. హత్య చేసిన తీరును బట్టి పది పదిహేను రోజులుగా రెక్కీ నిర్వహించి మాటుగాసి హత్య చేసినట్లు అంచనా అన్నారు. ఈ హత్యకు ఎవరెవరు సహకరించారు. దీనితో యుగేంధర్ పాత్ర ఏంటి అనే కోణంలో విచారణ సాగుతుంది. ఇప్పటికే దర్యాప్తు పూర్తయిందని రెండురోజుల్లో నిందుతులను అదుపులోకి తీసుకుని కోరు్టలో హాజరుపరుస్తామన్నారు.