జాయింట్ కమిటీ ముందుకు దివాలా బిల్లు
న్యూఢిల్లీ: ఖాయిలా సంస్థల మూసివేత ప్రక్రియను సరళతరం, వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన దివాలా బిల్లు (ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ కోడ్ 2015)ను పార్లమెంటు సంయుక్త కమిటీ మరింత లోతుగా అధ్యయనం చేస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. 30 మంది సభ్యులు ఉండే ఈ కమిటీ.. బడ్జెట్ సెషన్ తొలి వారం చివరి రోజున నివేదిక సమర్పిస్తుందని బుధవారం లోక్సభలో ఆయన చెప్పారు. కంపెనీలు, వ్యక్తుల దివాలా పిటిషన్లను నిర్ధిష్ట కాల వ్యవధిలో పరిష్కరించడమే బిల్లు ప్రధానోద్దేశం.