ఆకతాయికి రెండేళ్ల సత్ ప్రవర్తన విధింపు
ఆకివీడు : అమ్మాయిల్ని వేధిస్తున్నాడనే ఆరోపణపై స్థానిక కోసూరు వారి వీధికి చెందిన ఎండీ ఫరూక్‌కు రెండేళ్ల సత్ ప్రవర్తన, రూ.10 వేల విలువైన హామీతో కూడిన జామీను ఇవ్వాలని భీమవరం ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి.దీనబాబు శుక్రవారం తీర్పు చెప్పారు. ఈ ఏడాది జనవరి 3వ తేదీన ఆ ప్రాంతానికి చెందిన యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి కేవీఎస్వి ప్రసాద్ కేసు నమోదు చేసి ఫరూక్‌ను రిమాండ్‌కు పంపారని ఎస్సై ఆకుల రవి చెప్పారు. వాదోపవాదాలు అనంతరం తీర్పు చెప్పారని, రెండేళ్లలో సత్ ప్రవర్తన కలిగి ఉండకపోతే శిక్ష వేస్తారన్నారు. ప్రాసిక్యూష¯ŒS తరపున ఏపీపీ బి.మోహనరావు వాదించారని చెప్పారు.