Silk garments
-
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
-
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాలక్ష్మి అలకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సాయంత్రం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తొలిసారిగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం వైఎస్ జగన్ వెంట దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. అంతకుమందు ప్రకాశం బ్యారేజ్ మీదుగా దుర్గగుడికి చేరకున్న సీఎం వైఎస్ జగన్‌ను.. అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతంతో ఆలయంలోకి ఆహ్వానించారు. సీఎం వైఎస్ జగన్ అమ్మవారిని దర్శించుకునే సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణ, రూ. 100 టికెట్ క్యూలైన్లలోని భక్తులు యథావిధిగా అమ్మవారిని దర్శించుకునే సౌకర్యం కల్పించారు. వీఐపీ క్యూలైన్లను మాత్రం కొద్దిసేపు నిలిపివేశారు. కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ : (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
స్కందమాతగా జోగుళాంబ
జోగుళాంబ శక్తిపీఠం : అలంపూర్ జోగుళాంబ ఆలయంలో గురువారం 5వ రోజు అమ్మవారు స్కందమాత దేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి ముందు నవావరణ అర్చనలతో పాటుగా కుమారి, సువాసిని పూజలు చేశారు. దేవస్థానం తరఫున ఈఓ ప్రేమ్‌కుమార్ ముత్తయిదువులకు చీరలు అందజేశారు. ఏపీ నుంచి పట్టువస్త్రాలు కాగా, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జోగుళాంబ అమ్మవారికి ఏపీ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు పంపించనున్నారు. ఈ నెల 4వ తేదీన కర్నూలు కలెక్టర్ వీరపాండ్యన్, కర్నూలు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నాయుడు ఆలయానికి చేరుకుని పట్టువస్త్రాలు అందజేస్తారు. -
శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీవారి ఆలయం ముందున్న బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి తలపై స్వామివారి శేషవస్త్రంతో పరివట్టం కట్టుకుని మేళతాళాల మధ్య శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్లారు. ఆలయ మహాద్వారం ద్వారా ఆలయంలో ప్రవేశించిన సీఎం వైఎస్ జగన్.. గర్భాలయంలో మూలవిరాట్టు ముందు అర్చకులకి, అధికారులకు పట్టువస్త్రాలు అందించారు. అనంతరం సీఎం జగన్‌కు ఆశీర్వచనాలు ఇచ్చి.. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమలలో శ్రీవారికి పట్టువస్త్రాల సమర్ఫణకు వెళ్తున్న సీఎం శ్రీ వైయస్.జగన్, పరివట్టం చుడుతున్న అర్చకులు ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ పెద్ద శేషవాహన సేవలో పాల్గొని ఉత్సవమూర్తిని దర్శించుకోనున్నారు. అంతకు ముందు ధ్వజారోహణం కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. సీఎం వైఎస్ జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడంతో.. టీటీడీ చరిత్రలో వైఎస్సార్ కుటుంబానికి అరుదైన గౌరవం దక్కినట్టయింది. ఒకే కుటుంబంలో తండ్రి, తనయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఘనత వైఎస్ కుటుంబానికి దక్కింది. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక పర్యాయాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలేశునికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ ఏడాది అదే ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. -
సేంద్రియ మల్బరీతో లాభాల పట్టు!
ఎదుగూ బొదుగూ లేని కాంట్రాక్టు ఉద్యోగం కన్నా.. లోతైన అవగాహనతో సేంద్రియ సేద్యం చేయటమే ఉత్తమమం. అందులోనూ సాధారణ పంటల కన్నా నెల నెలా ఆదాయాన్నిచ్చే సేంద్రియ మల్బరీ సాగే మేలని ఓ యువ రైతు రుజువు చేశారు. అంతేకాదు, ఉత్తమ రైతుగా పురస్కారాన్ని అందుకోవటం విశేషం. ఆదర్శ రైతు స్ఫూర్తిదాయక గాథ ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం. మామిడి సైదులు తనకున్న నాలుగు ఎకరాల భూమిలో సేంద్రియ మల్బరీ సాగు చేసుకుంటూ గ్రామీణ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం లింగాలకు చెందిన సైదులు.. గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో సెరికల్చర్ విభాగంలో ఫీల్డ్ ఆఫీసర్(కాంట్రాక్టు ఉద్యోగి)గా ఆరేళ్లు పనిచేశాడు. ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం లేదనే ఉద్దేశంతో 2006లో ఉద్యోగం మానేసి మల్బరీ రైతుగా మారారు. నల్లగొండ పట్టు పరిశ్రమ శాఖ, గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సహకారం, సలహాలతో సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. డ్రిప్ ద్వారా తక్కువ నీటితో నాలుగు ఎకరాల మల్బరీ తోట సాగు చేస్తున్నారు. ఆకు నాణ్యత కోసం వర్మీ కంపోస్టు, పశువుల ఎరువు, జీవన ఎరువులు వాడుతున్నారు. సంవత్సరానికి కనీసం 7 పంటలు తీస్తున్నారు. 300 గుడ్లు చాకీ చేసి 45 రోజుల్లో ఒక పంట తీస్తున్నారు. పంటకు అన్ని ఖర్చులూ పోను రూ.75 వేల చొప్పున సంవత్సరానికి రూ.5 లక్షలకు పైగా నికరాదాయం పొందుతున్నారు. వీలైనంత వరకు పనులన్నీ భార్య భర్త ఇద్దరే చేసుకుంటారు. పంట చివరి 7 రోజుల్లో మాత్రం నలుగురు కూలీల సహాయం తీసుకుంటారు. జిల్లా స్థాయిలో ఉత్తమ పట్టు రైతుగా పురస్కారాన్ని అందుకున్నారు. ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటున్నారు. ఇతన్ని ఆదర్శంగా తీసుకొని మండలంలో పలువురు రైతులు పట్టు శాఖ అధికారుల తోడ్పాటుతో సేంద్రియ పద్ధతుల్లో మల్బరీ సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. పట్టు గూళ్ల ఉత్పత్తే లక్ష్యంగా.. గతంలో జిల్లాలో మల్బరీ రైతులు పట్టు పురుగులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పట్టు గుడ్లను ఉత్పత్తి చేసేవారు. దీనివలన రైతుకు లాభాలు తక్కువగా వస్తున్నాయి. సైదులు పట్టు పురుగుల ఉత్పత్తి కోసం తన ఇంటి ఆవరణలో ఒక షెడ్ ఏర్పాటు చేసుకున్నారు. విజయవాడలోని టెక్నికల్ సర్వీస్ సెంటర్ సరఫరా చేస్తున్న పట్టు గుడ్లను తీసుకొచ్చి ట్రేలలో గుడ్లను పెట్టి, నల్లటి గుడ్డ కప్పి, గుడ్లు పగిలే దశలో వాటిని బయటకు తీస్తారు. మల్బరీ ఆకును చాకింగ్ మిషన్ ద్వారా కట్ చేసి శైశవ దశలో పురుగులకు మేతగా వేసి పట్టు పురుగులను ఉత్పత్తి చేస్తున్నారు. పలు ప్రాంతాల రైతులకు విక్రయించడం ద్వారా సైదులు అధిక లాభాలు గడిస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో మల్బరీ సాగు ద్వారా తక్కువ సమయంలో, తక్కువ నీటితో అధిక లాభాలు సాధించవచ్చని ఉద్యాన అధికారి కృష్ణవేణి తెలిపారు. మల్బరీ రైతులకు షెడ్ నిర్మాణానికి, డ్రిప్‌కు సబ్సిడీ అందిస్తుందన్నారు. ఆసక్తి గల రైతులు మండల అధికారులను సంప్రదించవచ్చన్నారు. – చవగాని నాగరాజుగౌడ్, సాక్షి, పెన్‌పహాడ్, సూర్యాపేట జిల్లా పట్టు పురుగుల విక్రయంతో అధిక లాభాలు గత కొన్నేళ్లుగా సేంద్రియ పద్ధతుల్లో లాభసాటిగా మల్బరీ సాగు చేస్తున్నాను. గుడ్లను తీసుకొచ్చి ఇంటి దగ్గరే పట్టు పురుగులు పెంచుతున్నాను. ఇతర ప్రాంతాల రైతులకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నాను. – మామిడి సైదులు (99599 33842), మల్బరీ రైతు, లింగాల, సూర్యాపేట జిల్లా -
నేడే పైడితల్లి సిరిమానోత్సవం
-
భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం
పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ దంపతులు తిలకించి, పులకించిన భక్తజనం భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామివారి పట్టాభిషేక మహోత్సవం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభితమైన కల్యాణమండపంలో వైభవోపేతంగా జరిగిన ఈ వేడుకను కనులారా వీక్షించిన భక్తజనం తన్మయత్వం చెందారు. తొలుత ఉదయం యాగశాలలో చుతాస్థానార్చన హోమం నిర్వహించి, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఉత్సవ మూర్తులతో గిరిప్రదక్షిణ చేశారు. మంగళవాయిద్యాలు, సన్నాయి మేళాలు,భక్తుల జయజయధ్వానాలు, మహిళల కోలాటాలతో కల్యాణమండపం వరకు స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆలయం నుంచి మాడవీధుల మీదుగా ఈ ఊరేగింపు కల్యాణ మండపానికి చే రుకుంది. గవర్నర్ దంపతులు పట్టువస్త్రాలతో పల్లకి ముందు నడిచారు. పట్టాభిషేకం జరిగిందిలా... వేడుకలో భాగంగా స్వామివారికి ముందుగా ఆరాధన జరిపారు. సకల విఘ్నాలు తొలిగేందుకు విష్వక్సేన పూజ నిర్వహించారు. పట్టాభిషేకంలో వినియోగించే ద్రవ్యాలకు పుణ్యహవచనం గావించారు. ఆ తరువాత కలశాలలో ఉన్న చతుస్సముద్రాలు, పంచ నదుల తీర్థజలాలకు ప్రోక్షణ చేశారు. ప్రాంగణానికి అన్ని దిక్కులు, భక్తులపై పుణ్యజలాలను చిలకరించారు. అభిషేకానికి వీలుగా కలశ స్థాపన చేశారు. రామదాసు కాలం నాటి ఆభరణాలు, బంగారు పాదుకలు, రాజదండం, రాజముద్రిక, ఛత్రం సమర్పించి కిరీటధారణ గావించారు. ప్రధాన కలశంతో ప్రోక్షణ అనంతరం స్వామివారిని పట్టాభిషిక్తుడను చేశారు. అభిషేకంతో పట్టాభిషేక తంతు ముగిసింది. రామయ్య పాలన ఆదర్శం అనంతరం ఆలయ స్థానాచార్యులు కేఈ స్థలశాయి పట్టాభిషేకాన్ని నిర్వహించే వేదపారాయణులు, అష్టదిక్పాలకులను పరిచయం చేశారు. పట్టాభిషేకంలో వారి పాత్రను వివరించారు. భద్రాచలంలో మహా పట్టాభిషేకం విశిష్టతను ఆలయ వేదపండితులు గుదిమెళ్ల మురళీ కృష్ణమాచార్యులు వివరించారు. శ్రీరాముడు లోక కల్యాణం కోసం చేసిన త్యాగం గురించి వర్ణించారు. శ్రీరాముడి పాలన నేటి తరాలకు ఆదర్శం కావాలని చెప్పారు. పట్టాభిషేకం పూర్తయ్యాక పుణ్యజలాలను భక్తులపై చల్లారు. రెండు రాష్ట్రాలూ సుభిక్షంగా ఉండాలి: గవర్నర్ నరసింహన్ ఆకాంక్ష భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో ఆదివారం నిర్వహించిన మహాపట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా హాజరయ్యూరు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు ఆయన రామాలయూన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీతాయారు అమ్మవారు, భద్రమహర్షి ఆలయాలను కూడా దర్శించుకున్నారు. పట్టాభిషేకం పూర్తి అయిన తరువాత కూడా ఆయన సతీసమేతంగా ఆలయానికి వెళ్లి మరోమారు స్వామివారిని దర్శించుకున్నారు. ‘రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భద్రాద్రి రామయ్యను కోరుకున్నాను’ అని గవర్నర్ నర్సింహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఇలంబరితి, జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీవో దివ్య, ఆర్డీవో అంజయ్య, దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి ఉన్నారు. -
పైడితల్లమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన అశోక్ గజపతి రాజు
విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పైడితల్లి ఉత్సవంలో ఆలయ అనువంశక ధర్మకర్త, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పైడితల్లమ్మ సిరిమానోత్సవం అత్యంత వైభవంగా రేపు నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి కూడా జనం భారీగా తరలి వస్తారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. **