Silk production
-
ఇక అమెజాన్‌లో సిల్క్ మార్క్ చీరలు
ప్యూర్ సిల్క్ ప్రొడక్టులను వినియోగదారులకు అందించేందుకు వీలుగా దేశీ సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్(SMOI)తో అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా పేర్కొంది. తద్వారా సిల్క్ మార్క్ లేబుళ్లతో కూడిన ప్రొడక్టుల విక్రయానికి ప్రత్యేకించిన సిల్క్ మార్క్ స్టోర్ ను ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. సిల్క్ ఆర్గనైజేషన్‌లో నమోదైన వివిధ చేనేత, తదితర కళాకారులకు చెందిన పలు ప్రొడక్టులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది. దేశవ్యాప్తంగా సిల్క్ మార్క్ ను వినియోగించేందుకు 4,200 మది కళాకారులు అర్హత కలిగి ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. తొలి దశలో ఎంవోయూలో భాగంగా తొలి దశలో 100 శాతం ప్యూర్ సిల్క్ తో తయారైన చీరలు, డ్రెస్ మెటీరియల్స్, సల్వార్ కమీజ్ సెట్స్, జాకెట్లు, షర్టులు తదితర 3,000 ప్రొడక్టులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అమెజాన్ తెలియజేసింది. ఒప్పందంలో భాగంగా అమెజాన్ కారిగర్, అమెజాన్ ఇండియా బజార్ స్టోర్ల ద్వారా ప్యూర్ సిల్క్ ఉత్పత్తులను అమెజాన్ విక్రయించనున్నట్లు కేంద్ర సిల్క్ బోర్డ్ సీఈవో రంజన్ ఖాండియర్ పేర్కొన్నారు. తద్వారా దేశవ్యాప్తంగా ప్యూర్ సిల్క్ లేబుళ్లుగల ప్రొడక్టులను ప్రజలకు అందించే వీలున్నదని తెలియజేశారు. డిజిటల్ ఇండియాలో భాగంగా అమెజాన్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలియజేశారు. కేంద్ర సిల్క్ బోర్డు ద్వారా జారీ అయ్యే సిల్క్ మార్క్ సర్టిఫికేషన్‌లో భాగంగా హాలోగ్రామ్, ప్రత్యేక నంబరుతో ఈ ప్రొడక్టులు లభిస్తాయని తెలియజేశారు. కాగా.. SMOI ద్వారా ఉత్పత్తులను విక్రయించేవారికి మార్కెటింగ్, సేల్స్ సపోర్ట్, సాంకేతిక శిక్షణ తదితర అంశాలలో మద్దతు లభిస్తుందని అమెజాన్ వివరించింది. -
తెలంగాణకు జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యంత నాణ్యమైన పట్టు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ఈ ఏడాది దేశంలో అత్యధికంగా బైవోల్టిన్ (అత్యంత నాణ్యమైన) పట్టు గుడ్లను ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా గుర్తించిన కేంద్ర జౌళిశాఖ తెలంగాణకు జాతీయ స్థాయి అవార్డు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ పట్టుపరిశ్రమ శాఖకు కేంద్ర జౌళిశాఖ సోమవారం లేఖ రాసింది. ఈనెల 9న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డును రాష్ట్ర వ్యవసాయ, పట్టు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి, డైరెక్టర్ ఎల్.వెంకట్రామిరెడ్డి అందుకోనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో 3,176 ఎకరాలుగా ఉన్న మల్బరీసాగు గత నాలుగేళ్లలో 10,645 ఎకరాలకు విస్తరించింది. ఉమ్మడి రాష్ట్రంలో 40 ఏళ్లలో సాధించలేని ప్రగతిని తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్లలో సాధించడం పట్ల పట్టుపరిశ్రమ శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ ఘనత... నాలుగేళ్ల కాలంలో అధిక దిగుబడినిచ్చే ‘బైవోల్టిన్’పట్టుగూళ్లను తెలంగాణ 100 శాతం ఉత్పత్తి చేసింది. మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పట్టుని పూర్తిస్థాయిలో స్థానికంగా వినియోగించుకునే స్థాయికి రాష్ట్ర పట్టుపరిశ్రమ శాఖ ఎదిగింది. గద్వాల, పోచంపల్లి, నారాయణపేట, కొత్తపేటలో పనిచేస్తున్న పట్టు మగ్గం నేత పనివాళ్లకు ఈ నాణ్యమైన పట్టు అందచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఉత్పత్తిదారులకు కిలోకి రూ.75 అదనపు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. -
పట్టు ఉత్పత్తిలో చైనాతో పోటీపడదాం
సాక్షి, హైదరాబాద్: పట్టు ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమలో చైనాతో పోటీపడాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో పట్టు రైతుల అవగాహన సదస్సు జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరంలో పట్టు ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంటే, భారత్ వెనకబడి రెండోస్థానంలో నిలిచిందన్నారు. అమెరికా, ఇటలీ, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లండ్‌లతో పాటు భారత్ కూడా పట్టును దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. పట్టు ఉత్పత్తులకు మనదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉందన్నారు. ఐదో స్థానంలో తెలంగాణ.. సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం ఇచ్చే మల్బరీ సాగు వైపు కూడా రైతులు దృష్టిని సారించాలని జూపల్లి సూచించారు. భారత్‌లో 45 వేల మెట్రిక్ టన్నుల పట్టుకు డిమాండ్ ఉంటే 31వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోందన్నారు. గతేడాది లెక్కల ప్రకారం దాదాపు 10 వేల మెట్రిక్ టన్నుల పట్టును చైనా నుండి దిగుమతి చేసుకున్నామన్నారు. మనదేశంలో 9,571 మెట్రిక్ టన్నుల పట్టు ఉత్పత్తితో కర్ణాటక మొదటి స్థానంలో ఉంటే 119 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణలో మల్బరీ సాగు, పట్టు గూళ్ల ఉత్పత్తితో రైతులకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎకరం సాగుతో ఏడాదికి రూ.4 లక్షలు ఒక ఎకరం మల్బరీ సాగు చేయడం వల్ల ఐదుగురికి ఏడాదంతా ఉపాధి కల్పించవచ్చునని, ఏడాదిలో 8 నుండి 10 పంటలు సాగు చేయవచ్చునని జూపల్లి చెప్పారు. ఎకరానికి దాదాపుగా రూ.4 లక్షల ఆదాయాన్ని ఏడాదిలో ఆర్జించే అవకాశముందని వివరించారు. వాతావరణ పరిస్థితులు, ఇతర సమస్యలు కూడా తక్కువగా ఉంటాయన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 70 శాతం రాయితీ ఇస్తూ మల్బరీ షెడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ఉద్యానవన శాఖ కూడా మిగిలిన 30 శాతాన్ని రాయితీగా ఇస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా పట్టు దారం–రైతు జీవనాధారం బుక్లెట్, సీడీని జూపల్లి ఆవిష్కరించారు. -
పట్టు ఉత్పత్తికి తెలంగాణ అనుకూలం
పట్టు ఉత్పత్తికి తెలంగాణ ప్రాంత వాతావరణం, నేలలు అనుకూలమని, పట్టు పరిశ్రమతో ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని కేంద్ర పట్టు మండలి చైర్మన్ ఎన్ఎస్.బిస్సే గౌడ అన్నారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో కేంద్ర పట్టు మండలి, తెలంగాణ పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నాలుగు జిల్లాల పట్టు రైతుల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. పట్టు పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహించేందుకు రారుుతీలు ఇస్తున్నాయన్నారు. హన్మకొండ : పట్టు ఉత్పత్తికి తెలంగాణ ప్రాంత వాతావరణం, నేలలు అనుకూలమని, పట్టు పరిశ్రమతో ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని కేంద్ర పట్టు మండలి చైర్మన్ ఎన్.ఎస్.బిస్సే గౌడ అన్నారు. ఆదివారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో కేంద్ర పట్టు మండలి, తెలంగాణ పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో పట్టు రైతుల సమ్మెళనం-2015 నిర్వహించారు. ఇందులో వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ జిల్లాల పట్టు రైతులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్ఎస్ బిస్సే గౌడ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. పట్టు పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించేందుకు రారుుతీలు ఇస్తున్నాయని చెప్పా రు. మల్బరీ సాగు చేసే రైతులకు పట్టు పరిశ్రమ శాఖ, ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం సహకారం అంది స్తున్నాయని తెలిపారు. పంట త్వరగా వచ్చేందుకు చాకీ పురుగుల పెంపకాన్ని చేపట్టామని, మల్బరీ సాగు అధికంగా ఉన్న ప్రాంతంలో చాకీ పురుగుల పెంపకం కేం ద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గుడ్ల ద్వారా పట్టు పురుగులను పెంచవచ్చని, నాణ్యమైన గుడ్లను ఎక్కడికైనా నేరుగా సరఫరా చేస్తామన్నారు. ప్రస్తుతం రైతులు పత్తి పంటపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారని, పట్టు ఉత్పత్తి ద్వారా పత్తి కంటే అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. ముఖ్యంగా శాస్త్రీయ విజ్ఞానాన్ని వినియోగించుకోవడంతో పాటు శాస్త్రవేత్తలు, అధికారు ల సలహాలు తీసుకోవాలని సూచించారు. దేశంలో ఉన్న డిమాండ్ కంటే అధికంగా పట్టును ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రైతులకు ఉపయోగపడే బ్రోచర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో బిస్సే గౌడతోపాటు రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌ను రైతు లు సన్మానించారు. ఈ సమ్మేళనంలో పట్టు పరిశ్రమ శాఖ వరంగల్ జాయింట్ డెరైక్టర్ సుధాకర్, అధికారు లు వింధ్య, సతీష్. సంజీవరావు, శివారెడ్డి, డి.దత్తాత్రే య, బాలు, వెంకటసుబ్బయ్య, వేదకుమార్, మల్లికార్జు న్, దేవేందర్‌రావు, దాసరి మురళీధర్‌రెడ్డి, ఇతర అధికారులు, ఉద్యోగులు, రైతులు పాల్గొన్నారు.