Simbudevan
-
శింబుదేవన్ దర్శకత్వంలో అందాల భామలు
శింబుదేవన్ దర్శకత్వంలో ముగ్గురు అందాలభామలు నటించడానికి రెడీ అవుతున్నారు. శింబుదేవన్ అనగానే ఇంసైఅరసన్ 23ఆమ్ పులికేసి చిత్రమే టక్కున గుర్తుకు వస్తుంది. ఆ తరువాత కూడా ఆయన అరై ఎన్ 305 కడవుల్, ఇరుంబు కోట్టైటయిల్ మురట్టుసింగం, ఒరు కన్నియుమ్ 3 కలవాణిగళుమ్, పులి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తనకు మంచి పేరు తెచ్చి పెట్టిన ఇంసై అరసన్ 23ఆమ్ పులికేసి చిత్రానికి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేసి షూటింగ్‌ను కూడా ప్రారంభించారు. దర్శకుడు శంకర్ నిర్మించ తలపెట్టిన ఈ చిత్రానికి నటుడు వడివేలు, చిత్ర యూనిట్‌కు మధ్య విభేదాల కారణంగా షూటింగ్ ఆగిపోయింది. దీనికి సంబంధించిన పంచాయతీ చాలా కాలంగా జరుగుతూనే ఉంది. దీంతో దర్శకుడు శింబుదేవన్ మరో చిత్రానికి రెడీ అయిపోయారు. దీనికి కసడ తపర అనే పేరును నిర్ణయించారు. ఇందులో నటుడు సందీప్‌కిషన్, హరీశ్‌కల్యాణ్, శాంతను హీరోలుగా నటించనున్నారు. వారికి జంటగా నటి రెజీనా, ప్రియభవానీశంకర్, విజయలక్ష్మి నటించనున్నారు. ఇలా కుట్టి మల్టీస్టారర్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకట్‌ప్రభు, ట్రైడెంట్ ఆర్ట్స్ రవీంద్రన్ కలిసి నిర్మించనున్నారు. ఈ చిత్ర కథను దర్శకుడు ఆరు భాగాలుగా స్క్రీన్ ప్లేను రచించారట. దీంతో ఆరుగురు ఛాయాగ్రాహకులు, ఆరుగురు సంగీతదర్శకులు దీనికి పనిచేయనున్నారట. చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిసింది. చిన్న గ్యాప్ తరువాత నటి రెజీనా కోలీవుడ్‌లో నటిస్తున్న చిత్రం ఇది. -
పులి దర్శకుడిపై అతిలోకసుందరి ఫైర్
పులి చిత్ర దర్శకుడిపై అతిలోక సుందరి ఫైర్ అయ్యారన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. ఎవర్గ్రీన్ హీరోయిన్ శ్రీదేవి నటనకు విరామం ఇచ్చి పెళ్లి, పిల్లలు అంటూ సంసార జీవితంలో గడిపి సుమారు 25 ఏళ్ల తరువాత మళ్లీ నటన వైపు మొగ్గ చూపిన విషయం తెలిసిందే. ఆమె హిందీలో నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం దక్షిణాదిలోనూ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత చిన్న విరామం తీసుకుని ఈ సారి తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న భారీ సోషియోఫాంటసీ కథా చిత్రం పులిలో ప్రధాన పాత్ర పోషించారు. పీటీ.సెల్వకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శింబుదేవన్ దర్శకుడు. హన్నిక,శ్రుతీహాసన్ కథానాయికలుగా నటించారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న పులి ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.అక్టోబర్ ఒకటవ తేదీన విడుదలకు నిర్మాత లు సన్నాహాలు చేస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రంలో తన పాత్రకు శ్రీదేవి మూడు భాషల్లోనూ తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. తమిళంలో దాదాపు మూడు దశాబ్దాల తరువాత నటిస్తున్న చిత్రం కావడంతో శ్రీదేవి పులి చిత్రంపై ప్రత్కేక దృష్టి సారిస్తున్నారు. తన గెటప్, మేకప్ విషయాల్లోనూ చాలా కేర్ తీసుకున్నారు. రాణి గెటప్ కోసం చాలా సమయం తీసుకుని తయారయ్యేవారట. చిత్రానికి కాల్షీట్స్ కూడా ఎక్కువే కేటాయించినట్లు తెలిసింది. ఇక చిత్రానికి డబ్బింగ్ చెప్పడానికి అదనంగా పారితోషిం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ విషయంలో చిత్ర నిర్మాత ఆమెతో చర్చించినట్లు తెలిసింది. చిత్రానికి డబ్బింగ్ చెప్పిన శ్రీదేవి తాను నటించిన కొన్ని సన్నివేశాలు లేకపోవడంతో అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు చిత్ర దర్శకుడి నిలదీశారట. చిత్ర నిడివి ఎక్కువ అవ్వడంతో కొన్ని సన్నివేశాలను తొలగించినట్లు దర్శకుడు శింబు దేవన్ వివరించడంతో అతిలోక సుందరి ఆయనపై ఫైర్ అయినట్లు కోలావుడ్ వర్గాల టాక్. -
ఒక్కరు చాలరు
ఇంతకు ముందు హీరోలు ఎక్కువగా సింగిల్ హీరోయిన్‌తోనే సయ్యాటలాడేవారు. ఇప్పుడు ఒకటికి మించి ముద్దుగుమ్మలతో యువళగీతాలు పాడటానికి ఆసక్తి చూపుతున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్, తాజా చిత్రం లింగాలో బెంగళూరు భామ అనుష్క, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాలతో రొమాన్స్ చేస్తుండగా విశ్వనాయకుడు కమలహాసన్ ఉత్తమ విలన్ చిత్రంలో పూజాకుమార్, ఆండ్రియా, పార్వతి అంటూ ఏకంగా ముగ్గురిపై ముద్దుల వర్షం కురిపించేస్తున్నారు. మరోస్టార్ నటుడు అజిత్, గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో అనుష్క, త్రిష సందడి చేస్తున్నారు. ఇళయదళపతి విజయ్ ఇద్దరు భామల నడుమ అని పాడటానికి సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం ఎ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో కత్తి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో వున్న విజయ్ తదుపరి శింబుదేవన్ దర్శకత్వంలో ఫాంటసీ సన్నివేశాలతో కూడిన భారీ చిత్రంలో నటించనున్నారు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, శ్రుతిహాసన్, హన్సికలు జతకట్టనున్నారన్నది తాజా సమాచారం. హన్సిక ఇప్పటికే వేలాయుధం చిత్రంలో విజయ్‌తో డ్యూయెట్లు పాడారు. ఈ చిత్రంలో రెండవసారి విజయ్‌తో నటించడానికి రెడీ అవుతున్నారన్నమాట. ఇక శ్రుతిహాసన్ విజయ్‌తో తొలిసారిగా జతకట్టనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలైన ఈ చిత్రానికి తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన మగధీరలా బ్రహ్మాండంగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారని తెలిసింది.