ఒక్కరు చాలరు | Vijay to be paired with Shruti Haasan and Hansika | Sakshi
Sakshi News home page

ఒక్కరు చాలరు

Published Tue, Jul 8 2014 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

ఒక్కరు చాలరు

ఒక్కరు చాలరు

ఇంతకు ముందు హీరోలు ఎక్కువగా సింగిల్ హీరోయిన్‌తోనే సయ్యాటలాడేవారు. ఇప్పుడు ఒకటికి మించి ముద్దుగుమ్మలతో యువళగీతాలు పాడటానికి ఆసక్తి చూపుతున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్, తాజా చిత్రం లింగాలో బెంగళూరు భామ అనుష్క, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాలతో రొమాన్స్ చేస్తుండగా విశ్వనాయకుడు కమలహాసన్ ఉత్తమ విలన్ చిత్రంలో పూజాకుమార్, ఆండ్రియా, పార్వతి అంటూ ఏకంగా ముగ్గురిపై ముద్దుల వర్షం కురిపించేస్తున్నారు. మరోస్టార్ నటుడు అజిత్, గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో అనుష్క, త్రిష సందడి చేస్తున్నారు.
 
 ఇళయదళపతి విజయ్ ఇద్దరు భామల నడుమ అని పాడటానికి సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం ఎ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో కత్తి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో వున్న విజయ్ తదుపరి శింబుదేవన్ దర్శకత్వంలో ఫాంటసీ సన్నివేశాలతో కూడిన భారీ చిత్రంలో నటించనున్నారు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, శ్రుతిహాసన్, హన్సికలు జతకట్టనున్నారన్నది తాజా సమాచారం. హన్సిక ఇప్పటికే వేలాయుధం చిత్రంలో విజయ్‌తో డ్యూయెట్లు పాడారు.
 
 ఈ చిత్రంలో రెండవసారి విజయ్‌తో నటించడానికి రెడీ అవుతున్నారన్నమాట. ఇక శ్రుతిహాసన్ విజయ్‌తో తొలిసారిగా జతకట్టనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలైన ఈ చిత్రానికి తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన మగధీరలా బ్రహ్మాండంగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారని తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement