Sitarama kalyanotsavam
-
భద్రాద్రి రాములోరి కల్యాణానికి చీరాల గోటి తలంబ్రాలు
చీరాల: భద్రాద్రి సీతారాముల కల్యాణం అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు ఎనలేని భక్తిభావం. అవకాశం ఉన్నవాళ్లు భద్రాద్రి వెళ్లి ఆ కల్యాణాన్ని కనులారా వీక్షించి పులకించిపోతారు. వెళ్లలేని వాళ్లు టీవీల్లో వీక్షిస్తూనే భక్తిభావంతో ఉప్పొంగిపోతారు. సీతారాముల కల్యాణ క్రతువులో వినియోగించే తలంబ్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. తలంబ్రాలలో వినియోగించే బియ్యాన్ని గోటితో ఒలిచి స్వామివారికి సమర్పించే అవకాశం క్షీరపురిగా పిలిచే చీరాల వాసులకు వరుసగా తొమ్మిదోసారి దక్కింది. సీతారాముల కల్యాణానికి వడ్లను గోటితో ఒలిచి ఇక్కడి నుంచి పంపించడం ఈ ప్రాంత ప్రజలు తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. ఈ మహాసంకల్పానికి చీరాలకు చెందిన సిద్ధాంతి పి.బాలకేశవులు, మరికొందరు పూనుకుని నియమనిష్టలతో నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. చీరాలలో శ్రీ రఘురామ భక్తసేవా సమితి 2011లో 11మందితో ఏర్పాటైంది. వీరికి భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవానికి తలంబ్రాలు అందించే అవకాశం పూర్వజన్మ సుకృతంలా వచ్చింది. తలంబ్రాల కొరకు వడ్లను ఎంతో శ్రమంచి ఒలిచి, పసుపు, ఇతర సుగంధ ద్రవ్యాలతో కలిపి.. నియమనిష్టలతో, శాస్త్రోక్తంగా తలంబ్రాలు చేస్తారు. విజయదశమి నుంచి ప్రారంభించి ఉగాది వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 2015 అక్టోబర్ 23న చేపట్టిన ఈ మహా కార్యక్రమంలో.. ఏటా వందలాది భక్తులు పాల్గొంటున్నారు. విదేశాల్లోని వారికీ భాగస్వామ్యం రాములోరి కల్యాణానికి అవసరమైన తలంబ్రాలను తయారు చేసే క్రతువులో స్థానికంగానే గాక దేశ, విదేశాల్లోని తెలుగు వారిని కూడా భాగస్వాములు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ రాష్ట్రాలతో పాటు అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా దేశాల్లోని 10 వేల మంది భక్తులు ఇందులో భాగస్వాములయ్యారు. కమిటీ ప్రతినిధులు సీతారామ కల్యాణ వైభోగం, భద్రాద్రి సీతారామ కల్యాణం పేర్లుతో వాట్సాప్ గ్రూపులు ప్రారంభించారు. ఆసక్తి ఉన్న భక్తులను గ్రూపుల్లో చేర్చుకుని ఆయా ప్రాంతాలలో పర్యవేక్షకులుగా ఉన్న వారి ద్వారా భక్తులకు వడ్లు ఇచ్చారు. మరికొందరికి కొరియర్ ద్వారా పంపారు. అమెరికా నుంచి నాలుగేళ్లుగా వక్కలగడ్డ వెంకటేశ్వరరావు, పద్మజ దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. అలానే దక్షిణాఫ్రికాలో 400 మంది భక్తులు మూడు సంవత్సరాలుగా వడ్లు ఒలిచి పంపిస్తున్నారు. ఇక్కడ ఆత్మకూరి శ్రీనివాసరావు, అప్పాజోస్యుల వీరవెంకటశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈనెల 25న భద్రాద్రికి తలంబ్రాలు, పసుపు, కుంకుమ, భద్రాద్రికి తీసుకెళ్తారు. పూర్వజన్మ సుకృతంలా భావిస్తున్నాం భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణానికి ఉపయోగించే తలంబ్రాలను అందించే అవకాశం మాకు కలగడం పూర్వజన్మ సుకృతమే. ప్రతి సంవత్సరం మేమంతా కలిసి తలంబ్రాలు తయారు చేస్తున్న విధానంపై దేవస్థానం అధికారులు, ధర్మకర్తలు సంతృప్తి చెందుతున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములే. – పొత్తూరి బాలకేశవులు, చీరాల -
‘నవమి’ ముహూర్తం ఖరారు
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 10న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు శ్రీసీతారాముల తిరుకల్యాణోత్సవం (శ్రీరామనవమి) నిర్వహించనున్నారు. ఈ మేరకు వైదిక కమిటీ రూపొందించిన బ్రహ్మోత్సవాల షెడ్యూల్ను ఆలయ ఈఓ బి.శివాజీ సోమవారం విడుదల చేశారు. ఏప్రిల్ 2 నుంచి 16 వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 2న శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణం, తిరువీధి సేవలు ప్రారంభమవుతాయని, 6న ఉత్సవమూర్తులకు విశేష స్నపనం, ఉత్సవ అంకురార్పణ, 7న గరుడ ధ్వజపట భద్రక మండల లేఖనం, గరుడాధివాసం, 8న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, చతుఃస్థానార్చన, భేరీ పూజ, దేవతాహ్వానం, బలిహరణం, హనుమద్వాహన సేవ, 9న ఎదుర్కోలు ఉత్సవం, గరుడ వాహన సేవలను నిర్వహించనున్నట్లు షెడ్యూల్లో వివరించారు. 10న శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం, శ్రీరామ పునర్వసు దీక్షా ప్రారంభం, చంద్రప్రభ వాహన సేవ, 11న మహాపట్టాభిషేకం, రథోత్సవం జరుగుతాయని పేర్కొన్నారు. 12 నుంచి 16 వరకు వివిధ పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. కాగా, కోవిడ్ ఆంక్షలను ప్రభుత్వం సడలించిన నేపథ్యంలో భక్తులకు ఈ ఏడాది మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వీక్షించే అవకాశం ఉంటుందని సమాచారం. అయితే ఈ విషయంలో ఆలయ అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
రాములోరి కల్యాణం
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తులను మేళతాళాలతో వేదికపైకి తీసుకువచ్చారు. వేదమూర్తుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం మూడు గంటలపాటు వైభవంగా జరిపించారు. ప్రభుత్వం పక్షాన ఆలయ ఈవో దూస రాజేశ్వర్ దంపతులు పట్టువస్త్రాలను అందించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన శివపార్వతులు ఆనవారుుతీ ప్రకారం నెత్తిన జీలకర్ర, చేతిలో త్రిశూలం పట్టుకుని అంక్షింతలు చల్లుకుంటూ రాజన్నను వివాహమాడారు. ఓవైపు సీతారాముల కల్యాణం జరుగుతున్న సమయంలో మరోవైపు హిజ్రాలు నెత్తిన అక్షింతలు చల్లుకుంటూ పెళ్లిచేసుకున్నారు. మహాశివరాత్రి జాతరను తలపించే విధంగా దాదా పు మూడు లక్షల మంది భక్తులు హాజరయ్యారు. గురువారం రాత్రంతా స్వామి వారి దర్శనానికి అనుమతించినా ఐదు నుంచి ఆరు గంటలకు పైగా పట్టింది. సాయంత్రం యువకులు, హిజ్రాల నృత్యాలు, శివపార్వతుల పూనకాల మధ్య రథోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. కాగా.. తెలంగాణ వచ్చినా తమకు కనీస ప్రాధాన్యం కల్పించలేదని, ఇలాగైతే వచ్చే ఏడాది ఉత్సవాలకు తాము వేములవాడకు రాబోమని జోగిని శ్యామల అధికారుల తీరుపై మండిపడ్డారు. యాదాద్రిలో కల్యాణం కమనీయం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయసన్నిధిలో శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్నంటాయి. సీతారాములను పట్టువస్త్రాలు, నగల తో అలంకరించి ముత్యాల పల్లకిపై కల్యాణవేదిక వద్దకు చేర్చారు. మధ్యాహ్నం అర్చకుల వేద మంత్రాల మధ్య సీతారాముల కల్యాణం కమనీయంగా సాగింది. దేవస్థాన ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సిం హమూర్తి దంపతులతోపాటు భక్తులు పాల్గొన్నారు. - యాదగిరికొండ ఒక్కటైన ఫ్యాక్షన్ గ్రామం ఐదు దశాబ్దాలుగా పగ, ప్రతీకారాలతో అట్టుడుకుతున్న ఆ గ్రామం సీతారాముల కల్యాణంలో ఒక్కటైంది. పోలీసుల కృషి ఫలితంగా ఫ్యాక్షన్ గొడవలకు బ్రేక్ పడింది. నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం యాతవాకిళ్లలో యాభై ఏళ్లుగా తరచూ ఫ్యాక్షన్ గొడవలు జరుగుతున్నాయి. గ్రామంలో సీపీఎం, సీపీఐ పార్టీలదే ఆధిపత్య పోరు. శ్రీరామ నవమి కల్యాణోత్సవాలకు నిర్వహించినవారు మాత్రమే హాజరయ్యేవారు. - మఠంపల్లి