ఎంపీ సీతారాంనాయక్‌కు వైరల్ ఫీవర్
వరంగల్ : మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. రెండు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నా.. ఆదివారం రాత్రి జ్వరం మరింత పెరగడంతో కుటుంబ సభ్యులు హన్మకొండలోని మాక్స్‌కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో పరీక్షించిన వైద్యులు ఆయనకు వైరల్ ఫీవర్ సోకిందని నిర్ధారించారు.
ఈ మేరకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సోమవారం ఆస్పత్రిలో ఎంపీని పరామర్శించారు. ఇంకా గ్రేటర్ మేయర్ నన్నపునేని నరేందర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు కూడా సీతారాంనాయక్‌ను పరామర్శించారు.