యువతిపై బీజేపీ ఎమ్మెల్సీ లైంగిక వేధింపులు!
హజిపూర్ (బిహార్): రైల్లో ప్రయాణిస్తున్న యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో బీజేపీ ఎమ్మెల్సీ టున్నా పాండే అరెస్టయ్యారు. సివాన్‌కు చెందిన ఆయనను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గోరఖ్‌పూర్ వెళుతున్న రైల్లోని ఏసీ కోచ్‌లో ఎమ్మెల్సీ టున్నా పాండే తనపట్ల అనుచితంగా ప్రవర్తించాడని, తనను లైంగికంగా వేధించాడని బాధిత యువతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రైల్వే పోలీసులు హజిపూర్‌లో ఎమ్మెల్సీని అరెస్టు చేశారు.