slain soldiers
-
చైనా కంపెనీలు, ఉత్పత్తులను నిషేధించాలి
న్యూఢిల్లీ: లడఖ్ గాల్వన్ లోయలో భారత్ - చైనా ఆర్మీ మధ్య జరిగిన దాడుల్లో భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడంపై ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరన్ మంచ్ (ఎస్జేఎమ్) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరణించిన సైనికులకు నివాళిగా ప్రభుత్వం చేపట్టే టెండర్లలో చైనా కంపెనీలు పాల్గొనకుండా నిషేధం విధించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అదేవిధంగా దేశంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించే దిశగా అడుగులు వేయాలని సూచించింది. బుధవారం ఎస్జేఎమ్ కో కన్వీనర్ అశ్వని మహాజన్ మాట్లాడుతూ.. నటీనటులు, క్రికెటర్లు, ఇతర సెలబ్రిటీలు సైతం చైనా ఉత్పత్తులను ప్రోత్సహించవద్దని కోరారు. (సరిహద్దు వివాదం : డ్రాగన్ కుయుక్తి) కాగా మే 5వ తేదీ నుంచి చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై రెండు దేశాల మధ్య చర్చలు మేనేజర్ జనరల్ స్థాయి చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు దేశాలు తమ సైన్యాలను వెనక్కు తరలించడం ప్రారంభించాయి. ఇదే సమయంలో సోమవారం రాత్రి లడఖ్‌లో భారత్-చైనా ఆర్మీ మధ్య తీవ్రస్థాయిలో హింసాత్మక ఘర్షణలు తలెత్తాయి. ముఖాముఖీ పోరాటంలో రాళ్లు, ఇనుప రాడ్లతో చైనా సైనికులు దాడి చేశారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. చైనాకు కూడా భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం. ( విషం చిమ్మిన చైనా ) -
సైనికుల కోసం.. గళం విప్పుతున్న సూపర్ స్టార్
అమితాబ్ బచ్చన్ చెప్పారంటే.. దేశమంతా వింటుంది. ఆయన ఏమైనా చేస్తే.. అందరూ అదే చేస్తారు. పోలియోను దేశం నుంచి తరిమికొట్టాలన్నా.. స్వచ్ఛభారత్ అభియాన్‌ను ముందుకు తీసుకెళ్లాలన్నా.. అన్నింటికీ ఆయన సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుంది. ఇప్పుడు ఆ పెద్దాయన మరోసారి తెరమీదకు వస్తున్నారు. ఈసారి భారత సైన్యం కోసం తన గళం విప్పుతున్నారు. ఉడీ ఉగ్రదాడిలో అసులువు బాసిన వీరసైనికులకు ఆ పాటను అంకితం ఇస్తున్నారు. బీజేపీ నాయకుడు తరుణ్ విజయ్ ఇటీవల సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ను కలిసి.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల కోసం ఒక పాట పాడాలని కోరారు. అమితాబ్‌ది చాలా విలక్షణమైన గొంతు. పాత కాలంలోనే ఆయన పాడిన 'మేరే అంగనేమే తుమ్హారా క్యా కామ్ హై' లాంటి పాటలు సూపర్ హిట్ అయ్యాయి. తరుణ్ విజయ్ అడిగిన వెంటనే అమితాబ్ సరేనన్నారు. అమరుల కోసం పాట పాడటం అంటే అంతకన్నా అదృష్టం ఏముంటుందని చెప్పారు. ఇంతకుముందు టి-20 ప్రపంచకప్‌లో భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు అమితాబ్ ముందుగా జాతీయగీతం పాడారు. కోట్లాది మంది ఆ మ్యాచ్‌తో పాటు అమితాబ్ పాటను కూడా లైవ్‌లో చూశారు. ఇప్పుడు ఆయన సైనికుల కోసం ప్రత్యేకంగా పాట పాడటం అంటే.. మరోసారి తన మ్యాజిక్ చూపిస్తారనే అభిమానులు ఆశిస్తున్నారు.