small earthquake
-
శ్రీకాకుళంలో స్వల్ప భూ ప్రకంపనలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. జిల్లా కేంద్రంతో పాటు పొందూరు, టెక్కలి మండలాల్లోని పలు గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు. -
గుంటూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు
హైదరాబాద్: గుంటూరు జిల్లాలో సోమవారం రాత్రి స్వల్ప భూకంపం వచ్చింది. పిడుగురాళ్ల, మాచవరంలలో భూమి రెండు సెకన్ల పాటు కంపించింది. దీంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.