వీళ్లని ఫాలో అయితే విజ్ఞానం, వినోదం!
కూడు, గూడు, గుడ్డ... ఒకప్పటి మనిషి ప్రాథమ్యాలు. ఇపుడు ఆ అత్యవసర జాబితా చాలా విస్తరించింది. ఏది మిస్సయినా వెనకబడిపోతాం. అప్డేటెడ్గా ఉండాలి. వృత్తిలోనే కాదు, సమాజం గురించి కూడా నిత్యం అవగాహన కలిగి ఉండాలి. నిరంతరం టీవీ చూసో, పేపర్ చదివో ప్రాధాన్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవడం అంటే కాస్త కష్టమైన వ్యవహారమే. నలుగురిలో తిరిగితే నాలుగు విషయాలు తెలుస్తాయి... మరి అది కూడా సాధ్యం కాదే. అందుకే ఇదిగో ప్రపంచంలో అన్ని విషయాలపై ట్వీట్స్ ఇస్తుండే ఈ ఇండియన్ విమెన్ని ఫాలో అయిపోండి. ఎలాగూ చేతిలో స్మార్ట్ ఫోనో, ఇంట్లో కంప్యూటరో ఉంటుందిగా, రోజూ ఏదో ఒక సమయంలో వీళ్లిచ్చే అప్డేట్స్ తెలుసుకోండి.
@writeonj: జుహి చతుర్వేది, విక్కీ డోనర్ రచయిత.
@khushsundar: వివాదాలే కాదూ ఖుష్బూని ఫాలో అయితే నాలుగు విషయాలు కూడా తెలుస్తాయి.
@kiranmanral: రిలక్టెంట్ డిటెక్టివ్ రచయిత. స్త్రీల హక్కుల గురించి బాగా ప్రచారం చేస్తుంటారు.
@kiranshaw: కిరణ్ మజుందార్ షా. బయోకాన్ ఎండీ. అద్భుతంగా ట్వీట్స్ చేస్తారని ప్రతీతి. స్ఫూర్తిదాయకమైన వ్యాపారి.
@MissMalini: సెలబ్రిటీ బ్లాగర్. ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ట్వీట్స్ ఇస్తుంటారు. ఫాలో అయితే ఫన్.
@namitabhandare: జర్నలిస్ట్. సోషల్ థింకర్. అనేక అంశాలపై అవగాహన ఉన్న వ్యక్తి.
@saffrontrail: నందితా అయ్యర్ ఈమె. ఫుడ్ అండ్ హెల్త్ రైటర్. పోషకాషార నిపుణురాలు. ఆహారం, సంగీతంపై మంచి ట్వీట్స్ ఇస్త్తుంటారు.
@nilanjanaroy: నీలాంజన రాయ్. అన్నీ ఫాలో అవుతూ మిమ్మల్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. ప్రతి విషయంపై ట్వీట్స్ ఇస్తారు.
@Padmasree: సిస్కో ఉన్నతాధికారి. టెక్నాలజీ రంగంలో ఉన్న మహిళల కోసం ఈమె బోలెడు ట్వీట్లు ఇస్తారు.
@Rajyasree: రెస్టారెంట్ యజమాని, ఫుడీ, కాలమిస్ట్, జర్నలిస్టులు కావాలనుకునే వారికి మంచి స్ఫూర్తి.
@RupaSubramanya: ఇండియానామిక్స్ సహ రచయిత. విసృ్తతమైన అంశాలపై స్పందిస్తుంటారు.
@shailichopra: తెహల్కా కాలమిస్ట్. బిజినెస్ న్యూస్‌పై ట్వీట్స్‌తో అప్డేట్ చేస్తూ ఉంటారు.
@suchetadalal: మనీలైఫ్ మేనేజింగ్ ఎడిటర్. వ్యక్తిగత, సామాజిక ఆర్థిక వ్యవహారాలపై సాధికారిక వ్యాఖ్యలు చేస్తారు.
@calamur: హరిణి క్లామర్. బ్లాగర్, కాలమిస్ట్, టీచర్. రోజూ ప్రధాన వార్తల గురించి నర్మగర్భంగా కామెంట్స్ చేస్తుంటారు.
@ShomaChaudhury: తెహల్కా మేనేజింగ్ ఎడిటర్. ప్రతి ట్వీట్‌కు ఒక విలువ, తూకం ఉంటాయి.