Social equity
-
అవసరమైన సామాజిక కూర్పు
ఇటీవలి ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించిన మూడు రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులే వచ్చారు. ఇదొక కొత్త రాజకీయ సంప్రదాయం కాబట్టి చర్చ కూడా పెద్ద ఎత్తునే జరుగుతోంది. అది రాజకీయ పార్టీలు మంచి చేసినప్పుడు జరగవలసిన చర్చేనా? ఇది ప్రశ్నార్థకమే. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం అంటే, అది ఏ పార్టీ మనస్ఫూర్తిగా, నిజాయితీగా చేసినా స్వాగతించాలి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ విషయంలో పట్టింపుగా ఉన్నారు. ఈ ప్రస్తావన ఎందుకంటే, సోషల్ ఇంజినీరింగ్ కోసం ఏ పార్టీ అయినా ప్రయత్నిస్తుంటే ఆ విషయం చెప్పడానికి సందేహించనక్కర లేదు. మనం ఒక పార్టీని అభిమానించడం, ఆ పార్టీ చేపట్టే సోషల్ ఇంజినీరింగ్‌ను సానుకూలంగా గమనించడం, ఈ రెండూ అవసరమే. ఇటీవల గెలిచిన మూడు రాష్ట్రాల్లోనూ మాజీ లను కాదని, కొత్తవారిని ముఖ్యమంత్రి స్థానాల్లో కూర్చోబెట్టింది బీజేపీ. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ స్థానంలో మోహన్ యాదవ్‌కూ, రాజస్థాన్‌లో వసుంధరా రాజేను కాదని మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన భజన్‌లాల్ శర్మకూ, ఛత్తీస్‌గడ్‌లో మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు స్పీకర్ స్థానం ఇచ్చి విష్ణుదేవ్ సాయ్కీ బీజేపీ అధిష్ఠానం ముఖ్యమంత్రి స్థానాలను అప్ప గించింది. ఇలాంటి నిర్ణయం రాజకీయాలకు కొత్త. ఒకే దెబ్బతో నిర్ణయించడం కూడా కొత్తే. 2018 ఎన్నికల తరువాత రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ గతంలో ముఖ్యమంత్రులుగా చేసినవారినే తిరిగి ప్రతిష్టించారు. అది సర్వసాధారణ సంప్రదాయమనే అంతా సర్దుకు పోయారు. ఆ మూస ధోరణితో ఇద్దరు యువనేతలకు అవకాశం లేకుండా పోయిందన్న వాస్తవం మరుగున పడింది. కొత్తవారికి అవ కాశాల సంగతి ఆ పార్టీలో ప్రశ్నార్థకమైందన్న వాదన కూడా వీగి పోయింది. కానీ ఇప్పుడు ఓడిపోతుందని అంతా అనుకున్న మధ్య ప్రదేశ్‌లో ఘన విజయం సాధించి పెట్టిన శివరాజ్ సింగ్ చౌహాన్‌ను వదిలిపెట్టి వేరొకరికి బీజేపీ అధికారం కట్టబెట్టడం అనూహ్యంగానే కనిపిస్తుంది. వసుంధరా రాజే వంటి దిగ్గజాన్ని ముఖ్యమంత్రి పదవికి దూరంగా ఉంచగలగడం కూడా అలాంటిదే. భజన్‌లాల్ శర్మకు ముఖ్యమంత్రిగా అవకాశం రావడం మరీ ఊహకు అందనిదే. ఈ ముగ్గురికీ ప్రత్యేకతలు ఉన్నాయి. బీజేపీతో, లేదా మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్తో వీరికి విశేషమైన సాన్నిహిత్యం ఉంది. ఎవరూ ఇతర పార్టీల నుంచి దిగుమతి అయినవారు కాదు. అయోధ్య ఉద్య మంతో మమేకమైనవారు భజన్‌లాల్ శర్మ. ఇవన్నీ సాధారణ ప్రజా నీకం దృష్టిలో పడని అభ్యర్థుల అర్హతలే అవుతాయి. వీరి పాలనా నుభవం, ప్రజాహిత కార్యక్రమాలు, ప్రజల మధ్యన ఉండే తత్త్వం ఇవన్నీ పార్టీ పరిగణనలోకి తీసుకునే అంశాలు అవుతాయి. ఒక నాయ కుడిని మూడు లేదా నాలుగు పర్యాయాలు పదవిలో కొనసాగించడం వల్ల, తద్వారా ఎదురయ్యే ప్రభుత్వ వ్యతిరేకత పార్టీ భవిష్యత్తుకు సంబంధించినది. కొత్త నాయకత్వాన్ని నిర్మించే ప్రక్రియ కూడా పార్టీ తాజా నిర్ణయంలో కనిపిస్తోంది. మొత్తంగా పార్టీ ప్రయోజనాల రక్షణ, అభ్యర్థి సామర్థ్యం, గుణగణాలు ఇవన్నీ పార్టీ మనుగడకు పరోక్షంగా దోహదం చేస్తాయి. దీనితో పాటే పట్టించుకోవలసిన మరొక లోతైన అంశం, పార్టీ అనుసరించిన సోషల్ ఇంజినీరింగ్. దురదృష్టవశాత్తు బీజేపీ అమలు చేయదలిచిన సోషల్ ఇంజినీరింగ్‌కు మీడియా చర్చలు, పత్రికల కాల వ్ులు తగిన స్థానం ఇస్తున్నాయా? ఇవ్వడం లేదన్నదే సమాధానం. సమాజంలోని అన్ని వర్గాలకు సామాజిక, రాజకీయ ప్రాధాన్యం కల్పించాలి. స్త్రీపురుష సమానత్వం కూడా అందులో భాగం. వీటిని ఇప్పటికైనా పార్టీలో, ప్రభుత్వంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నందుకు బీజేపీని మనసారా అభినందించవలసి ఉంటుంది. ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించకుండా ఏళ్ల తరబడి ప్రభుత్వం నడిపిన ముఖ్యమంత్రులు మన కళ్లెదుటే ఉన్నారు. కొన్ని వర్గాలవారు అసలు శాసనసభ ముఖం చూడలేదన్నది ఒక చేదునిజం. వీటిని అధిగమించి తీరాలి. లేకుంటే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. అదే సమయంలో అప్పటిదాకా రాజకీయాలలో, పాలనలో తగినన్ని అవ కాశాలను పొందిన వారికీ, ఇప్పుడు పొందవలసి ఉన్నవారికీ మధ్య సమతూకం పాటిస్తేనే ఏ పార్టీ అయినా మనుగడ సాగించగలుగుతుందన్నది ఒక వాస్తవం. మొత్తం వ్యవస్థను పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా, ఓటు ద్వారా మార్చదలిచిన ఏ పార్టీ అయినా ఈ సూత్రానికి దగ్గరగా పనిచేస్తుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల ఎంపికలో బీజేపీ చేసిన కసరత్తు ఇందుకు సంబంధించినదే! అయితే, ఏ అడుగు వేసినా అందులో ఎన్నికల కోణాన్ని మాత్రమే చూడడం ఇటీవలి చర్చలు, విశ్లేషణలలో కనిపించే ఒక అవాంఛనీయ పరిణామం. ఇప్పుడు బీజేపీ ఎంపికను కూడా విశ్లేషకులు మూస ధోరణిలో ఎన్నికల వ్యూహాన్నే చూస్తున్నారు. మీడియా ఏం చర్చించాలో పాఠాలు చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. అయితే అభ్యర్థుల ఎంపిక గురించి పార్టీలు తీసుకున్న నిర్ణయాలు, ఎంపికలు తమ ఊహాగానాలకు, సర్వేలకు అనుకూలంగా లేవేమిటని వారు ఆశ్చర్యం పోవడం కూడా వింతే అనిపిస్తుంది. తాము ఎంతో ఖర్చు చేసి చేయించిన సర్వేల కంటే బీజేపీకి ఎక్కువ స్థానాలు రావడమేమిటన్న ఒక అసంబద్ధ వైఖరి కూడా కొందరు మీడియా వారు పరోక్షంగా అయినా వ్యక్తం చేయడం నిజం. ఇలాంటివారు మొదట చేయవలసిన పని ఆ తీర్పు ప్రజలు ఇచ్చినదని గౌరవించడం. అలాగే ఊహాగానాలకు అతీతంగా ముఖ్యమంత్రి అభ్యర్థుల పేర్లు వచ్చినా బుగ్గలు నొక్కుకోవడం ఎందుకు? పార్టీ కొత్తవారికి అవకాశం ఇవ్వదలిచింది. గతం కంటే మెరుగ్గా సోషల్ ఇంజినీరింగ్‌కు స్థానం కల్పించాలని అనుకున్నది. దాని ఫలితమే ఇలాంటి ఎంపిక. తెలంగాణలో బీసీ వర్గానికి చెందిన వారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తా నని చెప్పిన తరువాత ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక జరిగింది. అందులో తెలంగాణకు ఇచ్చిన హామీ జాడలు కనిపిస్తున్నాయి కూడా. దీనిని గుర్తించడం అవసరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యాభయ్ శాతం ఉన్న ఓబీసీలకు ఆ అవకాశం దాదాపు రాలేదు. దానిని గుర్తించి, ఆ తప్పిదాన్ని సవరించే ప్రయత్నం బీజేపీ చేసింది. ఈ అంశం గురించి సరైన దారిలో చర్చ జరిపితే అది అన్ని పార్టీలకు ఉపయోగపడుతుంది. బీజేపీ చేసింది కాబట్టి మేము అనుసరించ బోమని మిగిలిన పార్టీలు అంటే అది వేరే విషయం. అలాంటి అభిప్రా యానికి మీడియా కూడా రాకూడదన్నదే ఇక్కడ చెప్పదలుచుకున్నది. ఎప్పుడు ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడుతున్నా విశ్లేషణలు వస్తు న్నాయి. ఏ సంవత్సరం ఎన్ని ఓట్లు వచ్చాయి, శాతం, ప్రాంతాల వారీగా అభ్యర్థులు, గెలుపోటములు విశ్లేషిస్తున్నారు. ఇవన్నీ స్వాగతించవలసినవే. వాటితో పాటు సోషల్ ఇంజినీరింగ్ విషయంలో పార్టీలలో వస్తున్న పురోగతి గురించి, అలాంటి ఆహ్వానించదగిన పరి ణామం గురించి పార్టీలు పెడుతున్న శ్రద్ధలో వచ్చిన గ్రాఫ్ గురించి కూడా చర్చ జరిగితే రాజకీయాల గతినైనా మార్చవచ్చు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో ముమ్మాటికి పట్టింపుగా ఉన్నారు. సోషల్ ఇంజి నీరింగ్‌కు, స్త్రీపురుష సమానత్వానికి ఆయన తగిన ప్రాధాన్యం కల్పి స్తున్నారు. ఈ ప్రస్తావన ఎందుకు అంటే, సోషల్ ఇంజినీరింగ్‌ను పాటించడానికి ఏ పార్టీ అయినా ప్రయత్నం చేస్తుంటే ఆ విషయం చెప్పడానికి సందేహించనక్కర లేదు. మనం ఒక పార్టీని అభిమానించడం, ఆ పార్టీ చేపట్టే సోషల్ ఇంజినీరింగ్‌ను సానుకూలంగా గమనించడం, ఈ రెండూ అవసరమే. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం అంటే, అది ఏ పార్టీ మనస్ఫూర్తిగా, నిజాయితీగా చేసినా స్వాగతించాలి. అదే బాధ్యతాయుతమైన పౌరుల లక్షణం కూడా. అనేక కారణాలతో, వందల సంవత్సరాల విదేశీ పాలన ఫలితంగా ఇక్కడ అలాంటి సమ తూకం, క్రమం దెబ్బతిన్నాయి. దానిని సరిదిద్దే బాధ్యతను అన్ని రాజ కీయ పార్టీలు స్వీకరించాలి. బడుగు బలహీన వర్గాల గురించి, మైనా రిటీల గురించి ఇంతగా మాట్లాడే వామపక్ష, ఉదారవాద పార్టీలు కూడా ఆ విషయంలో పెద్దగా సాధించినది ఏమీలేదు. అంతమాత్రాన బీజేపీ ఆ ప్రయత్నంలో ఉంటే అందులో రాజకీయాలు, ఎన్నికల వ్యూహాలు చూడడం మంచిది కాదు. అందుకు సంబంధించిన కీర్తి బీజేపీదే అయితే దానికే దక్కనివ్వాలి! వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ Email:pvg@ekalavya.net -
సమానతా భారత్ సాకారమయ్యేనా?
స్వాతంత్య్రం ప్రతి ఒక్కరికీ అవకాశాలిస్తుంది. ఉదాహరణకు, ఒక మతానికి కట్టుబడి ఉండటం, నచ్చిన విధంగా జీవించడం, దేశ సంపద సృష్టిలో పాలుపంచుకోవడం వంటివి. అయితే ప్రస్తుతం మతపరమైన వివక్ష, జనాభాలో 10 శాతం మంది చేతుల్లోనే సంపద కేంద్రీకృతం కావడం వంటివి కనిపిస్తున్నాయి. దీనికి కారణం అందరికీ సమాన అవకాశాలు, సామాజిక న్యాయం అనే చోదక శక్తుల లేమి. దేశాభివృద్ధి ప్రయాణంలో లోటుపాట్లను ఎత్తి చూపే భావవ్యక్తీకరణ స్వాతంత్య్రం ఉన్నప్పుడే అన్ని రంగాల్లో నిజమైన అభివృద్ధి సాధ్యం. కానీ విమర్శకులు ఈరోజు జైలుపాలవుతున్నారు. నూరు సంవత్సరాల భారత్... అంటే అది నాకు సంబంధించినంత వరకు శక్తిమంత మైన ఆలోచన. బంగాళాఖాతాన్ని నేను చూస్తున్నప్పుడు, సముద్రం దాని ధ్రువాన్ని లేదా అంచును తాకడానికి సాగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ తీరం నుంచే నా కోరికల జాబితా ఆకాశాన్ని తాకుతుంటుంది. సహజంగానే ఇక్కడ అనేక ప్రశ్నలున్నాయి. వృద్ధి అనేది ఎంత సమ్మిశ్రితంగా ఉంటుంది? మన సమాజంలో మార్పు సామాజిక న్యాయ పంథాలో సాగుతోందా? సమానత్వం అనేది సమాజ చలనసూత్రానికి కేంద్ర బిందువుగా ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నలను ఆధారంగా చేసుకుని, మన సమాజ వృద్ధి, పురోగమన చలనం అనే ఒక సంక్లిష్ట వ్యవహారంగా మారు తున్నాయి. జాతీయ పురోగతికి నారీ శక్తిని అనుసంధానించడం ద్వారా మూలాలు అత్యున్నత శిఖరాలను చేరుకున్నట్లుంది. ప్రధాని ఈ ఆకాంక్షను చక్కగా పసిగట్టారు కదా! స్వాతంత్య్రం సిద్ధించి నూరేళ్లు పూర్తయ్యే సమయానికి అనేక ప్రభావిత రంగాల్లో భారత్ అత్యంత చోదక శక్తుల్లో ఒకటిగా ఉంటుందనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. కొన్ని అంతర్జాతీయ సంభాషణల్లో భారత్ ఒక తప్పనిసరిగా వినాల్సిన స్వరంగా ఉంటోంది. కానీ 2047 నాటికి ఇదే స్వరం మరి కొన్ని వందల డెసిబెల్స్ స్థాయిలో మార్మోగుతుందని నేను భావిస్తున్నాను. వాతావరణ మార్పు, పెరుగుతున్న అసమానతా స్థాయులు, భౌగోళిక రాజకీయ మండలాల్లో ఎగుడుదిగుడులు వంటి అంతర్జాతీయ సవాళ్లను చూసినట్లయితే... భారత యూనియన్ లోపల ఇప్పుడు అవసరమైన స్నేహభావాన్ని సులభమైన పదాల్లో వివరించలేం. ఈ ప్రయాణం కోసం ఇండియా ప్రాజెక్టు మూల్యం చెల్లించవలసి ఉంటుంది. అది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశ సంపద సృష్టిలో 33 శాతం వాటా కలిగిన... ఒక్క శాతం మంది దీని సంగతి చూసుకుంటారని కొందరనవచ్చు గాక. కానీ అనేక ఏళ్లుగా ప్రజా జీవితంలో గడిపిన నేను ఇది చాలదని అనుకుంటున్నాను. ప్రతి వ్యక్తీ భారత్ చెల్లించవలసిన మూల్యంలో భాగస్వామి అయినప్పుడే ఈ చెల్లింపు సాధ్యమవుతుంది. ఏ దేశమైనా సరే, అభివృద్ధి సాధించాలంటే అందరికీ సమాన అవకాశాలు, సామాజిక న్యాయం అనే రెండు ప్రధాన పాత్ర పోషి స్తాయి. మందబలం ఉన్న వారి భుజబల ప్రదర్శనకు వ్యతిరేకంగా వైఖరి తీసుకోవడంలో సమాజ ఇంగిత జ్ఞానానికి సంబంధించినంత వరకు చరిత్రలో ఈ క్షణం ఒక శంఖారావం లాంటిది. నిరంకుశ చట్టాలతో స్వారీ చేయడం, సమాజం ముక్కలుగా చీల్చివేయడాన్ని తారస్థాయికి తీసుకెళుతున్నారు. జనాభాలో 10 శాతం మంది దేశ సంపదలో 64.6 శాతం సంపదను సృష్టిస్తున్నారు. అదే దిగువ భాగంలో ఉంటున్న 50 శాతం మంది ప్రజలు కేవలం 5.9 శాతం సంపదను మాత్రమే సృష్టిస్తున్నారు. ఆర్థిక వృద్ధి ఇంకా సమ్మిశ్రితం కాలేదు. అంటే అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం దీంట్లో ఇంకా సాకారం కాలేదు. ఫలితంగా అసమానతలను ఇది ఇంకా విస్తృతం చేస్తుందన్నమాట. కాబట్టే ఇండియా ప్రాజెక్టును ఇంకా విభిన్న స్థాయికి తీసుకెళ్లడంలో ఇది మార్గదర్శకంగా పనిచేస్తుంది. దేశం శాఖో పశాఖలుగా చీలిపోతే చరిత్రలో అంధకార యుగాలతోనే పోల్చి చూడగలం. ఆర్ఎస్ఎస్ స్వాతంత్య్రానికి పెద్దగా దోహదం చేయ లేదని డి. రాజా చెప్పారు. కానీ ఇప్పుడు అదే ఆరెస్సెస్ స్వాతంత్య్ర సమర వారసత్వాన్నే ప్రమాదంలో పడవేస్తోంది కదా? సామాజిక న్యాయం గురించి ఇంకా విస్తృత స్థాయిలో సంభాషిం చడానికి ఇది తిరిగి మేల్కొల్పవలసిన సమయం. ఇంత పెద్ద రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో దార్శనిక పత్రంలో సామాజిక న్యాయానికి ఎలాంటి ప్రత్యామ్నాయమూ లేదు. రాజ్యాంగ ప్రవేశిక తొలి భాగమే ఏం చెబుతోందంటే ‘‘...పౌరులందరికీ న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులను పదిలపర్చడం...’’ సామా జిక న్యాయం సమానత్వానికి హామీ ఇస్తుంది. తదుపరి 25 సంవత్స రాలు ఆ తర్వాత ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ సమాజంలో సానుకూల మార్పుకు ఉత్ప్రేరకం ఏమిటంటే, సమగ్రవృద్ధికి హామీ పడటమేనని ఇది భారత పౌరులకు తెలుపుతుంది. సామాజిక న్యాయంలో మూలాలు కలిగిన అభివృద్ధికి విజయవంతంగా పునాది వేయడం వల్లనే తమిళనాడులో కొన్ని దశాబ్దాలుగా సాధించిన వృద్ధి సాధ్యమైంది. పెరియార్‌తో సహా, కామరాజర్, సీఎన్ అన్నాదురై, కలైజ్ఞర్ ఎం. కరుణానిధి వంటి నేతలు ప్రజా స్వామ్య సమ్మిశ్రిత స్వభావానికి ప్రతినిధులుగా ఉంటూ వచ్చారు. ఉదాహరణకు, తమిళనాడులో ప్రభుత్వ వైద్య కళాశాలలను స్థాపించ డానికి కరుణానిధి తీసుకున్న చొరవ ఆనాటికి వెనుకబడివున్న ప్రతి ఒక్కరికీ అవకాశాలను కల్పించింది. తక్కువ ఫీజులతో వైద్య విద్య చదవాలనుకున్న ప్రతి ఒక్క పిల్లాడికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈరోజు ‘నీట్’ ఆ వ్యవస్థను విధ్వంసం చేయడానికి ప్రవేశించింది. మన చరిత్ర శకలం పితృస్వామిక రంగుతో రూపొందింది. దీనివల్లే మార్పులు చోటు చేసుకోవడం కష్టమవుతోంది. ఈ దేశంలో 18 శాతం మంది మహిళలు మాత్రమే నేటికీ వేతన రూపంలోని ఆదాయాలను ఆర్జిస్తున్నారు. ఉద్యోగాల లేమి, నైపుణ్య స్థాయుల విషయంలో... వ్యవస్థ దురభిమానాలు, వేతనం చెల్లించని కుటుంబ విధుల వంటివి మహిళలకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నాయి. 2047 నాటికి మార్పు వస్తుందని నేను భావిస్తున్నాను. 33 శాతం రిజర్వేషన్ అనేది వాస్తవమవుతుందని భావిస్తున్నా. అప్పుడు 50 శాతం వాటా కోసం బలంగా కృషి చేయాలి. ప్రాథమిక స్థాయిలో శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం వల్ల ఉత్పత్తిలో గణనీయంగా పెరుగుదల నమోదు అవుతోంది. కానీ మీరు లోతుకు వెళ్లే కొద్దీ మరింత ఉత్తమంగా ఉంటుందని మీరు అర్థం చేసుకుంటారు. ఈ ప్రభావం ఆర్థికవ్యవస్థపై గణనీయంగా ఉంటుందని ఆర్థికవేత్తలంటుంటారు. దీని ప్రతిఫలనం ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలిగిస్తుంది. స్వాతంత్య్రం దాని స్వభావ రీత్యానే ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఇస్తుంది. ఉదాహరణకు, ఒక మతానికి కట్టుబడి ఉండే అవకాశం. తమకు నచ్చిన మతాన్ని ఆచరించేందుకు వ్యక్తులు ఎంపిక చేసుకో వచ్చు. వ్యక్తి స్థాయిలో స్వాతంత్య్రానికి చెందిన నిజమైన అర్థం ఏమి టంటే, అస్తిత్వాలకు అతీతంగా ప్రత్యేకించి మైనారిటీ అస్తిత్వాలకు అతీతంగా హక్కులు, సౌకర్యాలను పంపిణీ చేయడం. 2047 నాటికి, ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీ... అంటే సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాలలో ఒకటి ఎలాంటి తిరోగమన నిబంధనల ద్వారా సవాలు చేయబడకుండానే సామాజిక, రాజకీయ పరిధిలో జీవితాన్ని సాగిస్తుంది. వ్యవస్థలో సహానుభూతి లేకపోవడం వల్ల, మైనారిటీ లను వారికి అర్హమైన గౌరవంతో వ్యవస్థ వ్యవహరించదు. సమా నత్వం, సామాజిక న్యాయం ఉన్న చోటే వారి స్వరాలు వినిపిస్తాయి, వారి సమస్యలు ప్రతిధ్వనిస్తాయి. మన పంథాలో దిద్దుబాటు అవసరం. అప్పుడే మన భవిష్యత్ తరాలు స్వేచ్ఛాయుతమైన, సంపద్వంతమైన సమాజాన్ని చూడగలు గుతాయి. మన రిపబ్లిక్ పౌరులందరినీ కాపాడేలా, శాస్త్రీయ ధృతితో ఈ ప్రయాణంలో తనిఖీకేంద్రాలను అప్రోచ్ అయ్యేలా మనం జాగ్రత్త వహించాలి. చరిత్రను విజేతలే రాస్తారనే ప్రసిద్ధ సూక్తిని నేను గుర్తు చేసుకుంటాను. ఆశావహుల ద్వారా భవిష్యత్తు లిఖితమవుతుందని నా భావన. ఆశావహులకు భావవ్యక్తీకరణ స్వాతంత్య్రం ఉన్నప్పుడే వారు ఆ పని చేస్తారు. భావవ్యక్తీకరణ స్వాతంత్య్రం లేకుండా పోయిన అనేకమంది ఆశావహులు ఈరోజు జైల్లో ఉంటున్నారు. నిరంకుశ రాజ్యవ్యవస్థలో ఈ నిరాకరణకు మూలాలు ఉన్నాయి. కానీ సాహస పదాలను రాయడాన్ని, గట్టిగా మాట్లాడటాన్ని, 2047 వరకు మాట్లాడుతుండటాన్ని మనం కొనసాగిస్తుంటాం. దీనికోసం తమిళ కవి సుబ్రహ్మణ్య భారతీయార్ మాటలను మనసులో ఉంచుకోవాలి. దారిద్య్రంలో లేదా బానిసత్వంలో ఏ ఒక్కరూ ఉండకూడదు. కులం పేరుతో దేశంలో ఎవరూ అణిచివేతకు గురికాకూడదు. విద్యా సంపదను ప్రశంసించుదాం. సంతోషంలో మునిగి తేలుదాం. మనం అందరం ఒకటే అనే విధంగా సమానత్వంలో జీవిద్దాం. కనిమొళి కరుణానిధి, డీఎంకే పార్లమెంట్ సభ్యురాలు -
మన జాతీయాలు
కల్లలాడైనా సరే కాపురం నిలపాలి... సత్యం పలకడం అనేది సామాజిక ధర్మం. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం అబద్ధం ఆడడం తప్పేమీ కాదు. దీనికి సంబంధించి మన పురాణాల్లో కొన్ని పిట్టకథలు కనిపిస్తాయి. పూర్వం ఒక సత్యవంతుడు దారిన పోతుంటే అతని ముందునుంచి ఎవరో ఒక వ్యక్తి పరుగెత్తుతూ ఒక సందులో దూరాడట. కొద్దిసేపటికి ఒక దొంగ అటుగా వచ్చి వచ్చి... ‘‘ ఇటు వైపు ఎవరైనా వచ్చారా?’’ అని అడిగాడట. ఎప్పుడూ అబద్ధం ఆడని సత్యవంతుడు అప్పుడు కూడా అబద్ధం ఆడలేదు. ‘‘అదిగో...ఆ సందులో దూరాడు’’ అని నిజం చెప్పాడు. చనిపోయాక సత్యవంతుడు నరకానికి వెళ్లాడట. ‘‘ఇదేమిటి? నా జీవితంలో నేను ఒక్క అబద్ధమైనా ఆడలేదు. నన్ను నరకానికి తీసుకురావడం అన్యాయం. అసలు నేను చేసిన పాపం ఏమిటి?’’ అని అడిగాడట. అప్పుడు యమధర్మరాజు... ‘‘ఆరోజు నువ్వు చెప్పిన నిజం వల్ల ఒక అమాయకుడు దొంగ చేతిలో చనిపోయాడు. ఇది పాపం కాదా!’’ అన్నాడట. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటేనే సంసారం సజావుగా సాగుతుంది. ఆ అన్యోన్యతకు అబద్ధమైనా సరే ఉపయోగపడితే అంతకంటే కావాల్సిందేముంది! ఆ విషయం చెప్పే సందర్భంలోనే కల్లలాడైనా సరే కాపురం నిలపాలి అన్న జాతీయాన్ని ఉపయోగిస్తారు. సింగినాదం జీలకర్ర! ఏంటి విశేషాలు అని అడిగితే కొందరు ‘ఆ ఏముంది! సింగినాదం జీలకర్ర’ అంటుంటారు. అంటే పెద్ద విషయమేమీ లేదని. పూర్వం జీలకర్ర వర్తకులు పడవల్లో జీలకర్ర వేసుకుని వెళ్లే వారు. ఏదైనా ఊరు సమీపించగానే ఒక కొమ్ము బూరతో శబ్దం చేసేవారు. ఆ బూరశబ్దాన్ని ‘శృంగనాదం’ అంటారు. శృంగం అంటే కొమ్ము. నాదం అంటే ధ్వని. అయితే అది నోరు తిరక్క వాడుకలో సింగినాదం అయ్యింది. దాంతో బూర శబ్దం వినగానే కొందరు ‘సింగినాదం - జీలకర్ర’ అని అరిచేవారు. అవసరం లేనివాళ్లు మాత్రం ‘ఆ ఏముంది.. సింగినాదం జీలకర్ర’ అని కొట్టి పారేసేవారు. కాలక్రమేణా ముఖ్యం కాని విషయాల గురించి మాట్లాడేటప్పుడు ‘సింగినాదం - జీలకర్ర’ అనడం అలవాటుగా మారింది. వనం విడిచిన కోతి! వెనకటికి అడవిలో ఉండే ఒక కోతికి అడవి మీద ఆసక్తి పోయి, ఊళ్ల వెంట తిరగడం మొదలుపెట్టింది. ప్రతి ఊళ్లో దానికి ఇబ్బందులు, కష్టాలే. అడవిలో ఉన్నంత స్చేచ్ఛ, సుఖం, తన బంధుగణం లేక అల్లాడింది. అలాగే జీవనోపాధి కోసం సౌకర్యాలను, ఆత్మీయులను వదిలి దూర దేశాలకు పోయి కష్టపడేవాళ్ల గురించి చెప్పేటప్పుడు ‘వనం విడిచిన కోతి బతుకైంది తనది’ అంటుంటారు. అంబాజీపేట ఆముదం! ఒకప్పుడు దొంగలు ఒంటినిండా ఆముదం పూసుకొనిగాని డ్యూటీలోకి దిగేవారు కాదట. ఆముదం అంటుకుంటే ఓ పట్టాన వదలదు. కొన్ని గంటల వరకూ అలాగే ఉంటుంది. పొరపాటున ఎవరికైనా దొరికినా... వాళ్లు పట్టుకోబోతే జర్రున జారిపోతుంది. అందుకే ఆ ప్లాన్. కొందరు మనుషులు కూడా అంతే. ఆముదంలాగా ఓ పట్టాన వదలరు. వాళ్లకి మనతో ఏదైనా పని ఉందంటే అది చేసి పెట్టేదాకా ఓ పట్టాన వదలరు. ‘ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా’ అంటూ వెంటపడి వేధిస్తూ ఉంటారు. ఇలాంటి వారి విషయంలో ‘‘అమ్మో అతనా? అంబాజీపేట అముదం. పట్టుకుంటే వదలడు’’ అంటుంటారు.