స్వాతంత్య్రం ప్రతి ఒక్కరికీ అవకాశాలిస్తుంది. ఉదాహరణకు, ఒక మతానికి కట్టుబడి ఉండటం, నచ్చిన విధంగా జీవించడం, దేశ సంపద సృష్టిలో పాలుపంచుకోవడం వంటివి. అయితే ప్రస్తుతం మతపరమైన వివక్ష, జనాభాలో 10 శాతం మంది చేతుల్లోనే సంపద కేంద్రీకృతం కావడం వంటివి కనిపిస్తున్నాయి. దీనికి కారణం అందరికీ సమాన అవకాశాలు, సామాజిక న్యాయం అనే చోదక శక్తుల లేమి. దేశాభివృద్ధి ప్రయాణంలో లోటుపాట్లను ఎత్తి చూపే భావవ్యక్తీకరణ స్వాతంత్య్రం ఉన్నప్పుడే అన్ని రంగాల్లో నిజమైన అభివృద్ధి సాధ్యం. కానీ విమర్శకులు ఈరోజు జైలుపాలవుతున్నారు.
నూరు సంవత్సరాల భారత్... అంటే అది నాకు సంబంధించినంత వరకు శక్తిమంత మైన ఆలోచన. బంగాళాఖాతాన్ని నేను చూస్తున్నప్పుడు, సముద్రం దాని ధ్రువాన్ని లేదా అంచును తాకడానికి సాగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ తీరం నుంచే నా కోరికల జాబితా ఆకాశాన్ని తాకుతుంటుంది. సహజంగానే ఇక్కడ అనేక ప్రశ్నలున్నాయి. వృద్ధి అనేది ఎంత సమ్మిశ్రితంగా ఉంటుంది? మన సమాజంలో మార్పు సామాజిక న్యాయ పంథాలో సాగుతోందా? సమానత్వం అనేది సమాజ చలనసూత్రానికి కేంద్ర బిందువుగా ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నలను ఆధారంగా చేసుకుని, మన సమాజ వృద్ధి, పురోగమన చలనం అనే ఒక సంక్లిష్ట వ్యవహారంగా మారు తున్నాయి. జాతీయ పురోగతికి నారీ శక్తిని అనుసంధానించడం ద్వారా మూలాలు అత్యున్నత శిఖరాలను చేరుకున్నట్లుంది.
ప్రధాని ఈ ఆకాంక్షను చక్కగా పసిగట్టారు కదా! స్వాతంత్య్రం సిద్ధించి నూరేళ్లు పూర్తయ్యే సమయానికి అనేక ప్రభావిత రంగాల్లో భారత్ అత్యంత చోదక శక్తుల్లో ఒకటిగా ఉంటుందనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. కొన్ని అంతర్జాతీయ సంభాషణల్లో భారత్ ఒక తప్పనిసరిగా వినాల్సిన స్వరంగా ఉంటోంది. కానీ 2047 నాటికి ఇదే స్వరం మరి కొన్ని వందల డెసిబెల్స్ స్థాయిలో మార్మోగుతుందని నేను భావిస్తున్నాను. వాతావరణ మార్పు, పెరుగుతున్న అసమానతా స్థాయులు, భౌగోళిక రాజకీయ మండలాల్లో ఎగుడుదిగుడులు వంటి అంతర్జాతీయ సవాళ్లను చూసినట్లయితే... భారత యూనియన్ లోపల ఇప్పుడు అవసరమైన స్నేహభావాన్ని సులభమైన పదాల్లో వివరించలేం.
ఈ ప్రయాణం కోసం ఇండియా ప్రాజెక్టు మూల్యం చెల్లించవలసి ఉంటుంది. అది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశ సంపద సృష్టిలో 33 శాతం వాటా కలిగిన... ఒక్క శాతం మంది దీని సంగతి చూసుకుంటారని కొందరనవచ్చు గాక. కానీ అనేక ఏళ్లుగా ప్రజా జీవితంలో గడిపిన నేను ఇది చాలదని అనుకుంటున్నాను. ప్రతి వ్యక్తీ భారత్ చెల్లించవలసిన మూల్యంలో భాగస్వామి అయినప్పుడే ఈ చెల్లింపు సాధ్యమవుతుంది.
ఏ దేశమైనా సరే, అభివృద్ధి సాధించాలంటే అందరికీ సమాన అవకాశాలు, సామాజిక న్యాయం అనే రెండు ప్రధాన పాత్ర పోషి స్తాయి. మందబలం ఉన్న వారి భుజబల ప్రదర్శనకు వ్యతిరేకంగా వైఖరి తీసుకోవడంలో సమాజ ఇంగిత జ్ఞానానికి సంబంధించినంత వరకు చరిత్రలో ఈ క్షణం ఒక శంఖారావం లాంటిది. నిరంకుశ చట్టాలతో స్వారీ చేయడం, సమాజం ముక్కలుగా చీల్చివేయడాన్ని తారస్థాయికి తీసుకెళుతున్నారు. జనాభాలో 10 శాతం మంది దేశ సంపదలో 64.6 శాతం సంపదను సృష్టిస్తున్నారు. అదే దిగువ భాగంలో ఉంటున్న 50 శాతం మంది ప్రజలు కేవలం 5.9 శాతం సంపదను మాత్రమే సృష్టిస్తున్నారు. ఆర్థిక వృద్ధి ఇంకా సమ్మిశ్రితం కాలేదు. అంటే అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం దీంట్లో ఇంకా సాకారం కాలేదు. ఫలితంగా అసమానతలను ఇది ఇంకా విస్తృతం చేస్తుందన్నమాట. కాబట్టే ఇండియా ప్రాజెక్టును ఇంకా విభిన్న స్థాయికి తీసుకెళ్లడంలో ఇది మార్గదర్శకంగా పనిచేస్తుంది. దేశం శాఖో పశాఖలుగా చీలిపోతే చరిత్రలో అంధకార యుగాలతోనే పోల్చి చూడగలం. ఆర్‌ఎస్‌ఎస్ స్వాతంత్య్రానికి పెద్దగా దోహదం చేయ లేదని డి. రాజా చెప్పారు. కానీ ఇప్పుడు అదే ఆరెస్సెస్ స్వాతంత్య్ర సమర వారసత్వాన్నే ప్రమాదంలో పడవేస్తోంది కదా?
సామాజిక న్యాయం గురించి ఇంకా విస్తృత స్థాయిలో సంభాషిం చడానికి ఇది తిరిగి మేల్కొల్పవలసిన సమయం. ఇంత పెద్ద రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో దార్శనిక పత్రంలో సామాజిక న్యాయానికి ఎలాంటి ప్రత్యామ్నాయమూ లేదు. రాజ్యాంగ ప్రవేశిక తొలి భాగమే ఏం చెబుతోందంటే ‘‘...పౌరులందరికీ న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులను పదిలపర్చడం...’’ సామా జిక న్యాయం సమానత్వానికి హామీ ఇస్తుంది. తదుపరి 25 సంవత్స రాలు ఆ తర్వాత ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ సమాజంలో సానుకూల మార్పుకు ఉత్ప్రేరకం ఏమిటంటే, సమగ్రవృద్ధికి హామీ పడటమేనని ఇది భారత పౌరులకు తెలుపుతుంది.
సామాజిక న్యాయంలో మూలాలు కలిగిన అభివృద్ధికి విజయవంతంగా పునాది వేయడం వల్లనే తమిళనాడులో కొన్ని దశాబ్దాలుగా సాధించిన వృద్ధి సాధ్యమైంది. పెరియార్‌తో సహా, కామరాజర్, సీఎన్ అన్నాదురై, కలైజ్ఞర్ ఎం. కరుణానిధి వంటి నేతలు ప్రజా స్వామ్య సమ్మిశ్రిత స్వభావానికి ప్రతినిధులుగా ఉంటూ వచ్చారు. ఉదాహరణకు, తమిళనాడులో ప్రభుత్వ వైద్య కళాశాలలను స్థాపించ డానికి కరుణానిధి తీసుకున్న చొరవ ఆనాటికి వెనుకబడివున్న ప్రతి ఒక్కరికీ అవకాశాలను కల్పించింది. తక్కువ ఫీజులతో వైద్య విద్య చదవాలనుకున్న ప్రతి ఒక్క పిల్లాడికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈరోజు ‘నీట్’ ఆ వ్యవస్థను విధ్వంసం చేయడానికి ప్రవేశించింది.
మన చరిత్ర శకలం పితృస్వామిక రంగుతో రూపొందింది. దీనివల్లే మార్పులు చోటు చేసుకోవడం కష్టమవుతోంది. ఈ దేశంలో 18 శాతం మంది మహిళలు మాత్రమే నేటికీ వేతన రూపంలోని ఆదాయాలను ఆర్జిస్తున్నారు. ఉద్యోగాల లేమి, నైపుణ్య స్థాయుల విషయంలో... వ్యవస్థ దురభిమానాలు, వేతనం చెల్లించని కుటుంబ విధుల వంటివి మహిళలకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నాయి. 2047 నాటికి మార్పు వస్తుందని నేను భావిస్తున్నాను. 33 శాతం రిజర్వేషన్ అనేది వాస్తవమవుతుందని భావిస్తున్నా. అప్పుడు 50 శాతం వాటా కోసం బలంగా కృషి చేయాలి. ప్రాథమిక స్థాయిలో శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం వల్ల ఉత్పత్తిలో గణనీయంగా పెరుగుదల నమోదు అవుతోంది. కానీ మీరు లోతుకు వెళ్లే కొద్దీ మరింత ఉత్తమంగా ఉంటుందని మీరు అర్థం చేసుకుంటారు. ఈ ప్రభావం ఆర్థికవ్యవస్థపై గణనీయంగా ఉంటుందని ఆర్థికవేత్తలంటుంటారు. దీని ప్రతిఫలనం ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలిగిస్తుంది.
స్వాతంత్య్రం దాని స్వభావ రీత్యానే ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఇస్తుంది. ఉదాహరణకు, ఒక మతానికి కట్టుబడి ఉండే అవకాశం. తమకు నచ్చిన మతాన్ని ఆచరించేందుకు వ్యక్తులు ఎంపిక చేసుకో వచ్చు. వ్యక్తి స్థాయిలో స్వాతంత్య్రానికి చెందిన నిజమైన అర్థం ఏమి టంటే, అస్తిత్వాలకు అతీతంగా ప్రత్యేకించి మైనారిటీ అస్తిత్వాలకు అతీతంగా హక్కులు, సౌకర్యాలను పంపిణీ చేయడం. 2047 నాటికి, ఎల్‌జీబీటీక్యూ+ కమ్యూనిటీ... అంటే సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాలలో ఒకటి ఎలాంటి తిరోగమన నిబంధనల ద్వారా సవాలు చేయబడకుండానే సామాజిక, రాజకీయ పరిధిలో జీవితాన్ని సాగిస్తుంది. వ్యవస్థలో సహానుభూతి లేకపోవడం వల్ల, మైనారిటీ లను వారికి అర్హమైన గౌరవంతో వ్యవస్థ వ్యవహరించదు. సమా నత్వం, సామాజిక న్యాయం ఉన్న చోటే వారి స్వరాలు వినిపిస్తాయి, వారి సమస్యలు ప్రతిధ్వనిస్తాయి.
మన పంథాలో దిద్దుబాటు అవసరం. అప్పుడే మన భవిష్యత్ తరాలు స్వేచ్ఛాయుతమైన, సంపద్వంతమైన సమాజాన్ని చూడగలు గుతాయి. మన రిపబ్లిక్ పౌరులందరినీ కాపాడేలా, శాస్త్రీయ ధృతితో ఈ ప్రయాణంలో తనిఖీకేంద్రాలను అప్రోచ్ అయ్యేలా మనం జాగ్రత్త వహించాలి. చరిత్రను విజేతలే రాస్తారనే ప్రసిద్ధ సూక్తిని నేను గుర్తు చేసుకుంటాను. ఆశావహుల ద్వారా భవిష్యత్తు లిఖితమవుతుందని నా భావన. ఆశావహులకు భావవ్యక్తీకరణ స్వాతంత్య్రం ఉన్నప్పుడే వారు ఆ పని చేస్తారు. భావవ్యక్తీకరణ స్వాతంత్య్రం లేకుండా పోయిన అనేకమంది ఆశావహులు ఈరోజు జైల్లో ఉంటున్నారు. నిరంకుశ రాజ్యవ్యవస్థలో ఈ నిరాకరణకు మూలాలు ఉన్నాయి. కానీ సాహస పదాలను రాయడాన్ని, గట్టిగా మాట్లాడటాన్ని, 2047 వరకు మాట్లాడుతుండటాన్ని మనం కొనసాగిస్తుంటాం. దీనికోసం తమిళ కవి సుబ్రహ్మణ్య భారతీయార్ మాటలను మనసులో ఉంచుకోవాలి. దారిద్య్రంలో లేదా బానిసత్వంలో ఏ ఒక్కరూ ఉండకూడదు. కులం పేరుతో దేశంలో ఎవరూ అణిచివేతకు గురికాకూడదు. విద్యా సంపదను ప్రశంసించుదాం. సంతోషంలో మునిగి తేలుదాం. మనం అందరం ఒకటే అనే విధంగా సమానత్వంలో జీవిద్దాం.
కనిమొళి కరుణానిధి, డీఎంకే పార్లమెంట్ సభ్యురాలు
Comments
Please login to add a commentAdd a comment