సరిత ‘ప్రొ’ పంచ్ అదుర్స్
ఇంఫాల్: భారత మహిళా స్టార్ బాక్సర్ లైష్రామ్ సరితా దేవి తన ప్రొఫెషనల్ కెరీర్లో శుభారంభం చేసింది. తన తొలిపోరులో హంగేరికి చెందిన వెటరన్ సోఫియా బెడోను కంగుతినిపించింది. ఆదివారం ఇక్కడి ఖుమన్ లాంపక్ స్టేడియంలో జరిగిన ‘ఐబీసీ’ ఫైట్నైట్లో సరిత... ప్రొ సర్క్యూ ట్లో ఎంతో అనుభవజ్ఞురాలైన సోఫియాను అలవోకగా ఓడించింది.
59 ప్రొఫెషనల్ బౌట్లలో తలపడిన ఆమె భారత బాక్సర్ పంచ్‌లకు తలవంచింది. మరో పోరులో పింకీ జాంగ్రా కూడా శుభారంభం చేసింది. 26 ఏళ్ల పింకీ... స్లోవేకియాకు చెందిన క్లౌడియా ఫెరెన్జీపై విజయం సాధించింది.