ఫ్యాన్ శబ్దం వినిపించాల్సిందే!
గుడ్స్లీప్
నిద్ర పోవడం అంటే నా దృష్టిలో మరో ప్రపంచంలో విహరించడం లాంటిది. నాకు ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. తక్కువ అయితే మాత్రం ఆరోజంతా ఏ పని చేయాలన్నా విసుగ్గా అనిపిస్తుంది. నిద్ర పోవడానికి ముందు చమోమైల్ టీ తాగుతాను. సాఫ్ట్ మ్యూజిక్ వింటాను. లేదా ఏదైనా చిన్న కథ చదువుతాను.
అలా చదివే క్రమంలో నిద్ర చేరువవుతుంది. వింత విషయం ఏమిటంటే, వర్షాకాలమైనా, చలికాలమైనా, ఎండాకాలమైన నా గదిలో ఫ్యాన్ తిరుగాల్సిందే. ఫ్యాన్ శబ్దం వినిపించకపోతే నాకు ససేమిరా నిద్ర పట్టదు! పడక కూడా నిద్రను ప్రభావితం చేస్తుంది. ఫ్లోరల్ ప్యాట్రన్స్తో కూడిన వైట్ బెడ్షీట్లను ఇష్టపడతాను.
- విశాఖసింగ్, హీరోయిన్