Solar street lights
-
ఇంటింటికి సౌర సిరులు
మనకు సూర్యుడున్నాడు.వద్దన్నా రోజూ ఉదయిస్తాడు.సిస్టమ్ ఉంటే పవర్‌ఫుల్‌గా పనిచేస్తాడు.కరెంట్ కష్టాలకు చెల్లు చీటి ఇస్తాడు.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఘనంగా 75 ఏళ్ల ఉత్సవాలను కూడా చేసుకున్నాం. కానీ ఇప్పటికీ దేశంలో కరెంటు దీపం వెలగని గ్రామాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు, చుట్టుపక్కల గ్రామాలు కూడా. ఇలాంటి గ్రామాల్లో వెలుగులు నింపారు ఈ హైదరాబాద్ ఇంజనీర్. వాహనం వెళ్లడానికి దారి లేని పాడేరు కొండలను కాలినడకన చుట్టి వచ్చిన రాధికా చౌదరి అక్కడి యాభై గ్రామాల్లో సౌరశక్తితో దీపాలు వెలిగించారు. కోటి ఇళ్లకు సౌర వెలుగులను అందించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఆమె నాలుగు లక్షల ఇళ్లకు సర్వీస్ అందించారు. సోలార్ ఎనర్జీలో కెరీర్‌ని నిర్మించుకున్న రాధిక... పీఎం సూర్య ఘర్ యోజన పథకం ద్వారా లబ్ది పొందమని సూచిస్తున్నారు.మూడు తర్వాత బయటకు రారుపాడేరు కొండల్లో నివసించే ఆదివాసీలు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత బయటకు రారు. బయటకు వెళ్లిన వాళ్లు సూర్యుడు అస్తమించేలోపే తిరిగి ఇల్లు చేరాలి కాబట్టి మధ్యాహ్నం మూడు తర్వాత ఇల్లు కదలేవాళ్లు కాదు. అలాంటి వాళ్లకు సౌరశక్తితో దీపం వెలుతురును చూశారు. మన పాడేరు వాసులే కాదు, కశ్మీర్‌లోయలోని లధాక్, లేప్రాంతాలు కూడా సౌర వెలుగును చూశాయి. కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ జిల్లాలతో సహా మొత్తం 27 రాష్ట్రాల్లో 50 పట్టణాల్లో సేవలు అందించారామె. సోలార్ ఉమన్రాధికకు యూఎస్‌లో ఎమ్ఎస్ న్యూక్లియర్ ఇంజనీరింగ్‌లో ఫ్రీ సీట్ వచ్చింది. సోలార్ పవర్‌తో శాటిలైట్లను పనిచేయించడం అనే అంశంలో కోర్సు చేయడానికి నాసా స్పాన్సర్ చేసింది. యూఎస్‌లో కొంతకాలం విండ్ ఎనర్జీలో ఉద్యోగం, మరికొన్నేళ్లు స్వీడిష్ కంపెనీకి పని చేశారామె. ఆల్టర్నేటివ్ ఎనర్జీ సెక్టార్లో అడుగు పెట్టడం నుంచి సోలార్ పవర్ విభాగంలో పని చేయడంలో ఆసక్తి పెంచుకున్నారు రాధిక. ఇండియాలో సర్వీస్ ఇచ్చే అవకాశం రాగానే 2008లో ఇండియాకి వచ్చేశారు. ఆ తర్వాత ఆరేళ్లకు సోలార్ ఎనర్జీలో పని చేసిన సౌరవ్‌తో కలిసి ఫ్రేయర్ ఎనర్జీ ప్రారంభించారు. ‘‘నలుగురు వ్యక్తులం, ఓ చిన్న గది. ఆరు నెలలు జీతం తీసుకోలేదు. ఆ తర్వాత కూడా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని విస్తరించాం. ఇప్పుడు 450 మంది ఉద్యోగులతో పని చేస్తోంది మా సంస్థ’’ అన్నారామె. మనదేశంలో సోలార్ ఎనర్జీ విభాగంలో ఇంత భారీ స్థాయిలో సర్వీస్ అందిస్తున్న ఏకైక మహిళ రాధిక. ఏ వ్యాపారానికైనా ఇండియా చాలా పెద్ద మార్కెట్. కాబట్టి ఇండియా మొత్తాన్ని కవర్ చేయాలన్న కేంద్రప్రభుత్వం విధానాలతో కలిసి పనిచేస్తూ దేశాన్ని సౌరవెలుగులతో నింపడమే ప్రస్తుతానికి ఉన్న ఆలోచన’’ అన్నారామె. ప్రత్యామ్నాయం ఇదిబొగ్గు నిల్వలు తగ్గుతున్నాయి. విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి బొగ్గు గనుల మీద ఆధారపడడం తగ్గించి ఆల్టర్నేటివ్ ఎనర్జీని వినియోగంలోకి తెచ్చుకోవాలి. విండ్ పవర్ అనేది వ్యవస్థలు చేపట్టాల్సిందే కానీ వ్యక్తిగా చేయగలిగిన పని కాదు. ఇక మిగిలింది సోలార్ పవర్. సౌరశక్తిని వినియోగించుకోవడం సాధ్యమే. నిజమే... కానీ ఒక ఇంటికి సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఎంత ఖర్చవుతుంది? దాదాపు లక్ష అవుతుంది. సగటు మధ్య తరగతి నుంచి ‘అమ్మో ఒక్కసారిగా అంత ఖర్చా మా వల్ల కాదు’ అనే సమాధానమే వస్తుంది. అలాంటి వాళ్లకు రాధిక ఇచ్చే వివరణే అసలైన సమాధానం.నాలుగేళ్ల్ల బిల్ కడితే ఇరవై ఏళ్లు ఫ్రీ పవర్ సోలార్ సిస్టమ్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే పాతికేళ్లు పని చేస్తుంది. నెలకు రెండువేల రూపాయలు కరెంటు బిల్లు కట్టే ఇంటికి రెండు కిలోవాట్ల కెపాసిటీ ΄్లాంట్ అవసరమవుతుంది. దాని ఖర్చు లక్షా నలభై వేలవుతుంది. ప్రభుత్వం నుంచి 60 వేల సబ్సిడీ వస్తుంది. వినియోగదారుడి ఖర్చు 80 వేలు. ఏడాదికి 24 వేల రూపాయలు కరెంటు బిల్లు కట్టే వాళ్లకు నాలుగేళ్లలోపు ఖర్చు మొత్తం వెనక్కి వచ్చినట్లే. ఇక కనీసంగా ఇరవై ఏళ్లు సోలార్ పవర్‌ని ఫ్రీగా పొందవచ్చు. సోలార్ పవర్‌ను పరిశ్రమలకు కూడా విస్తరిస్తే కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తగ్గుతుంది.– రాధికా చౌదరి,కో ఫౌండర్, ఫ్రేయర్ ఎనర్జీ– వాకా మంజులారెడ్డి, ఫొటోలు : మోహనాచారి -
దేశంలో తొలి ‘సోలార్’ గ్రామంగా మొధేరా.. మోదీ ప్రకటన
గాంధీనగర్: దేశంలోనే తొలి 24×7 సోలార్ విద్యుత్ గ్రామంగా గుజరాత్, మెహసానా జిల్లాలోని మొధేరా గ్రామాన్ని అధికారికంగా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మొధేరాలో నిర్వహించిన బహిరంగ సభ వేదికా ఈ మేరకు ప్రకటించారు. ఈ సందర్భంగా.. ఇప్పటివరకు సూర్యదేవాలయం ఉన్న గ్రామంగానే మొధేరా దేశానికి తెలుసునని.. ఇప్పుడు దేశ ప్రజలంతా దీన్ని సౌర విద్యుత్తు గ్రామంగా గుర్తిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు శరద్ పూర్ణిమ, వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు మోదీ. ‘సహజ వనరులను సద్వినియోగం చేసుకొని పునరుత్పాదక ఇంధనాన్ని మరింత పోత్సహించడం ద్వారా ప్రపంచానికి ఇంధన ప్రదాతగా మారడమే లక్ష్యంగా పనిచేయాలి. మెహసానా ప్రజలు గతంలో నీళ్లు, విద్యుత్ కోసం ఎన్నో అవస్థలు పడ్డారు. మహిళలు నీటి కోసం మైళ్ల దూరం నడవాల్సి వచ్చేది. కానీ ఇప్పటితరానికి ఆ బాధల్లేవు. మంచి ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యంతో పరిశ్రమలను స్థాపించడం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, అనుసంధానతను పెంచడం వంటివి అందిస్తోంది.’ అని తెలిపారు మోదీ. గతంలో కరెంట్ సౌకర్యం లేకపోవడం వల్ల చదువు, ఇంటి పనులకు ఇబ్బందులు ఉండేవని.. ఇప్పుడు సౌర విద్యుత్ న్యూ ఇండియాను మరింత సాధికారత కల్పించేలా లక్ష్యాన్ని అధిగమించేలా చేస్తోందన్నారు. ఒకప్పుడు సైకిళ్లను తయారు చేయలేని రోజుల నుంచి నేడు గుజరాత్ కార్లు, మెట్రోకోచ్‌లను తయారు చేసే స్థాయికి ఎదిగిందన్నారు. મોઢેરાના વિશ્વ વિખ્યાત સૂર્ય મંદિરનું પરિસર 3D પ્રોજેક્શન મેપિંગ તથા હેરિટેજ લાઇટિંગ્સથી ઝળહળી ઉઠશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તા.9 ઓક્ટોબરના રોજ કરશે આ સૌર ઊર્જા સંચાલિત લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું ઉદઘાટન અને સાથે જ ઉજાગર થશે મોઢેરાનો ગૌરવવંતો ઇતિહાસ.#SuryaGramModhera pic.twitter.com/zsop1XqOiT — CMO Gujarat (@CMOGuj) October 8, 2022 ఇదీ చదవండి: ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం.. ‘ఆప్’ మంత్రి రాజీనామా -
సౌర వీధి దీపాలు
సాక్షి, హైదరాబాద్: గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు అమ్ముడవ్వడానికి బిల్డర్లు వీధుల్లో ఆధునిక విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తారు. విదేశాల్లో తలపించేలా పరిసరాలుంటాయని గొప్ప లూ చెబుతారు. కానీ, నిర్మాణం పూర్తయి నివాసితుల సంఘానికి అప్పజెప్పాక.. పెరిగే విద్యుత్ బిల్లులు చూసి నివాసితుల సంఘాలు బెంబేలెత్తక తప్పదు. కాబట్టి, ఇలాంటి ఇబ్బందులు అధిగమించాలంటే విద్యుత్ వినియోగంలో జాగ్రత్తలు తప్పనిసరి. ♦ బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాలు, లగ్జరీ విల్లాలు.. ఏ నిర్మాణమైనా నిర్వహణ విషయంలో బిల్లులు తడిసిమోపెడవుతాయి. ప్రత్యేకించి విద్యుత్ బిల్లుల భారాన్ని తప్పించుకోవాలంటే సాధ్యమైనంత వరకూ సౌర విద్యుత్ దీపాలనే వినియోగించాలి. ప్రాజెక్ట్ ఆవరణలో, సెల్లార్లలో సాధారణ విద్యుత్ దీపాల స్థానంలో సౌర వీధి దీపాల్ని ఏర్పాటు చేసుకుంటే సరి. నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. ♦ సౌర వీధి దీపాలు రెండు రకాలుగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కో స్తంభం మీద ఒక్కో దీపం ఏర్పాటు చేసుకోవచ్చు. దీన్ని స్టాండ్ ఎలోన్ సిస్టం అంటారు. మనకెన్ని కావాలో అన్ని వీధి దీపాలను ఏర్పాటు చేసుకోవచ్చు. దీనిలోని ప్రతికూలత ఏంటంటే.. ఈ పరికరంపై ఎండ నేరుగా పడితేనే పని చేస్తుంది. ♦ రెండో రకానికొస్తే.. అపార్ట్మెంట్ పైకప్పు మీద సోలార్ ఫొటో వోల్టెక్ (ఎస్పీవీ) మాడ్యూళ్లను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ్నుంచి కేబుళ్ల ద్వారా విద్యుత్‌ను వీధి దీపాలకు సరఫరా చేస్తారు. ♦ ఈ విధానంలో గేటెడ్ కమ్యూనిటీల్లో ఒక కిలో వాట్ సోలార్ పవర్‌ప్యాక్ ఏర్పాటు చేసుకుంటే 25 వీధి దీపాలకు విద్యుత్‌ను సరఫరా చేయవచ్చు. దాదాపు 12 అడుగులుండే ఒక్కో స్తంభా నికి 9 వోల్టుల ఎల్ఈడీ లైట్‌ను బిగించుకోవచ్చు. ఇది ఎంతలేదన్నా 30 అడుగుల దూరం దాకా వెలుగునిస్తుంది. దీని కోసం ఎంతలేదన్నా రూ.2లక్షల నుంచి 4 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇందులో నుంచి 30 శాతం సబ్సిడీగా అందజేస్తారు. పరికరాన్ని బట్టి బ్యాకప్ ఆధారపడుతుందని గుర్తుంచుకోండి. ♦ ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికొస్తే.. 3 రోజుల దాకా విద్యుత్ ప్రసారంలో ఎలాంటి అంతరాయం ఉండదు. మరింత ఎక్కువ కాలం సరఫరా కోరుకునేవారు కాస్త ఖర్చెక్కువ పెట్టాల్సి ఉం టుంది. దీంతోపాటు అధిక సామర్థ్యం గల సోలార్ మాడ్యూళ్లను కొనాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టు లైట్లనూ ఎంచుకోవాలి. ♦ ఎస్వీపీ పరికరాల్ని వినియోగించేవారు ఆటోమేటిక్ సెన్సార్లను ఏర్పాటు చేసుకునే సౌలభ్యమూ ఉంది. మనం కోరుకున్న సమయంలో లైట్లు వెలగడం, ఆరిపోవటం వంటివి ముందే నిర్ణయించుకోవచ్చు. లేదా ఎప్పుడెప్పుడు ఎం తెంత వెలుతురు కావాలో ముందే ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసుకోవచ్చు కూడా. రాత్రి 10 గంటల వరకు ఎక్కువ వెలుతురు.. అర్ధరాత్రి 12 దాటితే 50 శాతం వెలుతురు.. ఇలా మనం కోరుకున్నట్టుగా ప్రణాళికలు చేసుకోవచ్చు. -
ఎల్ఈడీ సోలార్ స్ట్రీట్‌లైట్లు
రాష్ట్రంలో తొలిసారిగా ఇనుగుర్తిలో.. కేసముద్రం: తెలంగాణ రాష్ట్రంలో ప్రథమంగా వరంగల్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో ఫోర్ఆర్మ్ 24 వాట్స్ హైపవర్ ఎల్ఈడీ సోలార్ స్ట్రీట్ లైట్లను సోమవారం ఏర్పాటు చేశారు. సెన్సార్ సిస్టం ద్వారా ఈ సోలార్ లైట్లు పనిచేస్తాయని, సూర్యుడి వెలుగులో ఈ లైట్లు ఆరిపోతాయని, చీకటి పడగానే వాతంతటవే వెలుగుతాయని ఇందన వనరుల అభివృద్ధి సంస్థ డీవో కృష్ణారెడ్డి విలేకరులకు తెలిపారు. కాగా ఎంపీ నిధుల నుంచి ఈ గ్రామానికి నాలుగు స్ట్రీట్‌లైట్లు మంజూరయ్యాయని, ప్రస్తుతానికి ఒక లైట్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఒక్క స్ట్రీట్‌లైట్ ధర రూ.1,39,350 ఉంటుం దని, దీనికి నాలుగువైపులా బల్బుటుంటాయన్నారు. మొదటిసారిగా మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన ఈ సోలార్ స్ట్రీట్లైట్లను మన రాష్ట్రంలో ఇనుగుర్తిలోనే ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వీటిని దసరానాడు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. -
వాటర్‌షెడ్ పనులు పూర్తిచేయాలి
చేవెళ్ల: వాటర్‌షెడ్ ద్వారా 2013-14 సంవత్సరానికి నిర్దేశించిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని చేవెళ్ల క్లస్టర్ వాటర్‌షెడ్ ప్రాజెక్టు అధికారి ప్రజ్ఞ సూచించారు. మండల కేంద్రంలోని నీటియాజమాన్య సంస్థ కార్యాలయంలో సోమవారం చేవెళ్ల, షాబాద్, పూడూరు మండలాల పరిధిలోని వాటర్‌షెడ్ టెక్నికల్ అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వాటర్‌షెడ్ పనుల పురోగతిపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రజ్ఞ మాట్లాడుతూ చేవెళ్ల క్లస్టర్‌లోని ఐదు వాటర్‌షెడ్ గ్రామాలలో 250 ఎకరాలలో పండ్లతోటలను పెంచాలని లక్ష్యంగా నిర్ణయించినా ఇప్పటికి కేవలం 40 ఎకరాలలో మాత్రమే పూర్తిచేయగలిగామని తెలిపారు. కూలీల కొరత, రైతులు ముందుకు రాకపోవడం తదితర కారణాలతో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆమె ఆదేశించారు. గత 2013-14 వాటర్‌షెడ్ ద్వారా చేయాల్సిన పనుల సమయం ఈ నెలాఖరు వరకే ఉన్నదని, వచ్చే నెల కొత్త సంవత్సరం, కొత్త లక్ష్యాలు ఉంటాయని వివరించారు. వాటర్‌షెడ్ గ్రామాలలో సోలార్ వీధి దీపాలు, వాటర్ప్ల్లాంటు ఏర్పాటు, పాఠశాలల్లో బెంచీల సౌకర్యం, మినీవాటర్ ట్యాంకుల నిర్మాణానికి ప్రభుత్వం 80శాతం నిధులను సమకూరుస్తుందని, మిగతా 20 శాతం నిధులను గ్రామస్తులు కంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. చేవెళ్ల మండలంలోని దేవునిఎర్రవల్లిలో సోలార్ వీధిదీపాల ఏర్పాటు పూర్తి కావచ్చిందని, త్వరలోనే వీటిని ప్రారంభిస్తామని చెప్పారు. వాటర్‌షెడ్ పనులు చేయడానికి కూలీల కొరత కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని టెక్నికల్ అసిస్టెంట్లు పీఓ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో క్లస్టర్ జేఈలు వెంకటేశ్వర్‌రెడ్డి, రాంచంద్రన్, పలు మండలాల టెక్నికల్ అధికారులు, అసిస్టెంట్లు పాల్గొన్నారు.