'స్పెల్లింగ్ బీ' పోటీలో భారత సంతతి విద్యార్థి విజయం!
వాషింగ్టన్: నేషనల్ స్పెల్లింగ్ బీ కాంపిటిషన్ లో భారత సంతతికి చెందిన 13 ఏళ్ల అమెరికా విద్యార్థి విజయం సాధించాడు. రెండు వారాల పాటు 90 రౌండ్లపాటు జరిగిన భీకర పోరులో కుష్ శర్మ టైటిల్ ను సొంతం చేసుకున్నారు.
ఫిబ్రవరి 22 తేదిన కాన్సాస్ సిటీకి చెందిన సోఫియా హఫ్ మెన్ తో కుష్ శర్మకు జరిగిన పోటి 'టై'గా ముగిసింది. ఓ దశలో జడ్జిలకు పదాలు లభించకపోవడంతో పోటిని మార్చి 8 శనివారానికి పోటిని వాయిదా వేశారు.
అతి కష్టమైన 'hemerocallis', 'jacamar', 'definition' లాంటి పదాలకు స్పెల్లింగ్ చెప్పి కుష్ శర్మ ఈ పోటీలో విజయం సాధించారు. గత కొద్ది సంవత్సరాలుగా భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థులు స్పెల్లింగ్ పోటీలలో విజయ ఢంకా మోగిస్తున్నారు. 2013 లో న్యూయార్క్ చెందిన విద్యార్థి అరవింద్ మహంకాళి నేషనల్ స్పెల్లింగ్ బీ పోటిలో విజయం సాధించాడు.