breaking news
South Africa vs Zimbabwe
-
చిచ్చర పిడుగులు ఇరగదీశారు.. పాపం పసికూన!
జింబాబ్వేతో తొలి టెస్టు (ZIM vs SA 1st Test)లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును ఏకంగా 328 పరుగుల భారీ తేడాతో ఓడించి జయభేరి మోగించింది. కీలక ఆటగాళ్లు జట్టుతో లేకపోయినా ప్రొటిస్ జట్టు ఆద్యంత ఆధిపత్యం కనబరిచి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.అరంగేట్రంలోనే సత్తా చాటిన చిచ్చరపిడుగులుప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC)-2025 ఫైనల్ గెలిచిన తర్వాత సౌతాఫ్రికా.. తొలుత జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఆతిథ్య జట్టుతో రెండు టెస్టులు ఆడనుంది. రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమా (Temba Bavuma)తో పాటు ఐడెన్ మార్క్రమ్ వంటి కీలక ఆటగాళ్లు ఈ టూర్‌కు దూరం కాగా.. కేశవ్ మహరాజ్ సారథ్యంలో లువాన్-డ్రి ప్రిటోరియస్, డెవాల్డ్ బ్రెవిస్ టెస్టులలో అరంగేట్రం చేశారు.ఇక బులవాయో వేదికగా జూన్ 28న మొదలైన తొలి టెస్టులో టాస్ గెలిచిన పర్యాటక సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్ విఫలమైనప్పటికీ టీనేజర్లు లువాన్-డ్రి ప్రిటోరియస్, డెవాల్డ్ బ్రెవిస్ అదరొట్టారు. ప్రిటోరియస్ భారీ శతకం (153) బాదగా.. బ్రెవిస్ (41 బంతుల్లో 51) మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు.వీరిద్దరికి తోడు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ శతకం (100 నాటౌట్)తో చెలరేగాడు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్ల నష్టానికి 418 పరుగుల వద్ద ప్రొటిస్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. జింబాబ్వే బౌలర్లలో టనకా చివాంగ నాలుగు వికెట్లు తీయగా.. ముజర్బానీ రెండు, మసకజ్ద, మసేకెస ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. 251 పరుగులకే ఆలౌట్ ఇక తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 251 పరుగులకే ఆలౌట్ అయింది. సీన్ విలియమ్స్ (137) శతక్కొట్టగా.. మిగతా వారి నుంచి అతడికి సహకారం అందలేదు. ప్రొటిస్ బౌలర్లలో వియాన్ ముల్డర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కెప్టెన్ కేశవ్ మహరాజ్, కోడి యూసఫ్ చెరో మూడు వికెట్లు తీశారు.ఈ క్రమంలో 167 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. 369 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈసారి వియాన్ ముల్డర్ (147) శతకంతో ఆకట్టుకోగా.. కేశవ్ మహరాజ్ హాఫ్ సెంచరీ (51) చేశాడు.జింబాబ్వే బౌలర్లలో ఈసారి మసకజ్ద నాలుగు, చివాంగ, మసెకెస రెండేసి వికెట్లు తీయగా.. ముజర్బానీ, మెధెవెరె చెరో వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో తడబడిఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని సౌతాఫ్రికా జింబాబ్వేకు 537 పరుగుల లక్ష్యం విధించింది. అయితే, మంగళవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 208 పరుగులకే జింబాబ్వే ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా భారీ గెలుపు దక్కించుకుంది.మరోవైపు.. టెస్టుల్లో జింబాబ్వేకు ఇదే అతిపెద్ద పరాజయం. ఇదిలా ఉంటే.. జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో కార్బిన్ బాష్ ఐదు వికెట్లతో చెలరేగగా.. యూసఫ్ మూడు, కేశవ్ మహరాజ్, డెవాల్డ్ బ్రెవిస్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అరంగేట్రంలోనే శతక్కొట్టిన సౌతాఫ్రికా 19 ఏళ్ల చిచ్చరపిడుగు ప్రిటోరియస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.జింబాబ్వే వర్సెస్ సౌతాఫ్రికా తొలి టెస్టు సంక్షిప్త స్కోర్లుసౌతాఫ్రికా: 418/9 d & 369జింబాబ్వే: 251 & 208.చదవండి: IPL 2026: సీఎస్కేలోకి సంజూ.. బదులుగా రాజస్తాన్‌కు రుతురాజ్?! -
సీన్ విలియమ్స్ సూపర్ సెంచరీ.. తప్పిన ఫాలో ఆన్ గండం
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు (ZIM vs SA 1st Test)లో జింబాబ్వే ఫాలో ఆన్ గండం తప్పించుకుంది. మిడిలార్డర్ బ్యాటర్ సీన్ విలియమ్స్ (Sean Williams- 164 బంతుల్లో 137; 16 ఫోర్లు) సెంచరీ సాధించి ఈ మేరకు ఊరట కల్పించాడు. బులవాయో వేదికగా ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 67.4 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (90 బంతుల్లో 36; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. బ్రియాన్ బెనెట్ (19), కిటానో (0), నిక్ వెల్చ్ (4), వెస్లీ మధెవెరె (15), ప్రిన్స్ (7), తఫద్జా ట్సిగా (9), మసకద్జా (4) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు వరుసకట్టారు.ముల్డర్‌కు నాలుగు వికెట్లుఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్డర్ 4 వికెట్లు పడగొట్టగా... కేశవ్ మహరాజ్, యూసుఫ్ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది.ఓపెనర్లలో మాథ్యూ బ్రీజ్కె (1) అవుట్ కాగా... టోనీ డి జోర్జి (22 బ్యాటింగ్; 2 ఫోర్లు).. వన్‌డౌన్ బ్యాటర్ ముల్డర్ (25 బ్యాటింగ్; 4 ఫోర్లు)తో కలిసి క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 418/9 వద్దే దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో ఓవరాల్‌గా చేతిలో 9 వికెట్లు ఉన్న సఫారీ జట్టు ప్రస్తుతం 216 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తద్వారా జింబాబ్వేతో తొలి టెస్టులో పట్టు బిగించింది.కేశవ్ మహరాజ్@ 200ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న కేశవ్ మహరాజ్... అరుదైన ఘనత సాధించాడు. సఫారీ జట్టు తరఫున 200 టెస్టు వికెట్లు పడగొట్టిన తొలి స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కాడు. జింబాబ్వే కెప్టెన్ ఇరి్వన్ను అవుట్ చేయడం ద్వారా కేశవ్ మహరాజ్ సుదీర్ఘ ఫార్మాట్లో 200వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. 9 ఏళ్లుగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 35 ఏళ్ల కేశవ్... ఇప్పటి వరకు 59 టెస్టుల్లో 202 వికెట్లు పడగొట్టాడు. -
అరంగేట్రంలోనే సెంచరీ.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా టీనేజర్
జింబాబ్వే-దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడతున్నాయి. ఈ సిరీస్‌కు ప్రోటీస్ రెగ్యులర్ కెప్టెన్ టెంబా బావుమా గాయం కారణంగా దూరం కాగా.. కేశవ్ మహరాజ్ (Keshav Maharaj) సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇక రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వే- సౌతాఫ్రికా (ZIM vs SA) మధ్య శనివారం తొలి టెస్టు ఆరంభమైంది. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో టాస్ గెలిచిన పర్యాటక సౌతాఫ్రికా జట్టు.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.కుప్పకూలిన టాపార్డర్ఈ క్రమంలో ఆతిథ్య జింబాబ్వే బౌలర్లు ధాటిగా తమ అటాకింగ్ ఆరంభించారు. టనకా చివాంగ దెబ్బకు ఓపెనర్లు టోనీ డి జోర్జి (0), మాథ్యూ బ్రీట్జ్కే (13) త్వరత్వరగా పెవిలియన్ చేరారు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ వియాన్ ముల్దర్ (17) రనౌట్ కాగా.. నాలుగో నంబర్ బ్యాటర్ డేవిడ్ బెడింగ్హామ్ కూడా పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.లువాన్-డ్రి ప్రిటోరియస్, బాష్ శతకాలుఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అరంగేట్ర బ్యాటర్ లువాన్-డ్రి ప్రిటోరియస్ (Lhuan-Dre Pretorius) భారీ శతకంతో సత్తా చాటాడు. మొత్తంగా 160 బంతులు ఎదుర్కొన్న పందొమిదేళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 153 పరుగులు సాధించాడు. ఇతడికి తోడుగా చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ (51) అర్ధ శతకంతో మెరవగా.. వికెట్ కీపర్ బ్యాటర్ కైలీ వెరెన్నె (10) మాత్రం నిరాశపరిచాడు.అయితే, బౌలింగ్ ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ కూడా శతకంతో చెలరేగడం విశేషం. మిగతా వాళ్లలో కెప్టెన్ కేశవ్ మహరాజ్ 21, కోడీ యూసఫ్ 27 పరుగులు చేశారు. శనివారం నాటి తొలి రోజు ఆట ముగిసేసరికి 90 ఓవర్లలో సౌతాఫ్రికా తొమ్మిది వికెట్ల నష్టానికి 418 పరుగులు సాధించింది. బాష్ 100, క్వెనా మఫాకా 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.చరిత్ర సృష్టించిన ప్రిటోరియస్జింబాబ్వేతో మ్యాచ్‌లో శతక్కొట్టిన లువాన్-డ్రి ప్రిటోరియస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికా తరఫున పురుషుల క్రికెట్లో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు.. అరంగేట్రంలోనే టెస్టుల్లో శతకం బాదిన అత్యంత పిన్న వయస్కుడిగానూ నిలవడం విశేషం.ఈ క్రమంలో సౌతాఫ్రికా తరఫున 61 ఏళ్లుగా గ్రేమ్ పొలాక్ పేరిట ఉన్న రికార్డును ప్రిటోరియస్ బద్దలు కొట్టాడు. 1964లో ఆస్ట్రేలియా మీద 19 ఏళ్ల 317 రోజుల్లో పొలాక్ సెంచరీ చేయగా.. ప్రిటోరియస్ 19 ఏళ్ల 93 రోజుల వయసులో జింబాబ్వే మీద ఈ ఘనత సాధించాడు.చదవండి: నితీశ్ రెడ్డి కాదు!.. శార్దూల్ స్థానంలో అతడే సరైనోడు: భారత మాజీ క్రికెటర్