sp vikramjeeth duggal
-
జిల్లాలో ఎస్సైల బదిలీ
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో 61 మంది ఎస్సైలను బదిలీ చేశారు. ఈ మేరకు ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ బుధవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 32 మంది ఎస్సైలను వివిధ స్టేషన్లకు బదిలీ చేయగా.. 29 మంది ప్రొబేషనరీ ఎస్సైలకు ఎస్సైగా పోస్టింగ్ కల్పించారు. -
గ్రామాలు అభివృద్ధి సాధించాలి
ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ రోంపల్లిలో జనమైత్రి.. వైద్య శిబిరం తిర్యాణి : మారుమూల గిరిజన గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. జనమైత్రి కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని రోంపల్లి గ్రామంలో మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు సౌకర్యం లేకుంటే గ్రామాలు ప్రగతి సాధించలేవని, రోడ్డు సౌకర్యం కల్పించడానికి పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. గుండాల గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడానికి కృషి చేశామని, దండేపల్లి మండలం ఊట్ల గ్రామం నుంచి రోడ్డు పనులు సాగుతున్నాయని వివరించారు. జిల్లాలోని కల్వర్టులు, లోలెవల్ వంతెనలు, వాగులపై బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధిత అధికారులతో మాట్లాడి రవాణా సౌకర్యం మెరుగుపర్చడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులని, వారికి ఎవరూ సహకరించవద్దని అన్నారు. కరీంనగర్‌కు చెందిన సన్‌రైజ్, స్టార్, అపోలో ఆస్పత్రి వైద్యులు 802 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నలుగురిని మెరుగైన చికిత్స కోసం తరలించారు. వృద్ధులకు దుప్పట్లు, దోతులు, చీరెలు, విద్యార్థులకు ప్యాడ్లు, పెన్లు, అనాథ పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు. బెల్లంపల్లి డీఎస్పీ రమణారెడ్డి, తాండూర్ సీఐ కరుణాకర్, ఎస్సైలు బుద్దే స్వామి, సురేష్, రోంపల్లి జేపీవో కిరణ్ , వైద్యులు వెంకటేష్, స్పురణ, రజిత, సురేష్‌కుమార్, ఆంజనేయులు, మైఖేల్, శ్రీనివాస్, సర్పంచ్‌లు కుర్సింగ దేవు, వెన్న కమల, గ్రామ పటేల్‌లు జలపతి, దౌలత్, మాజీ సర్పంచ్ దిందర్షా పాల్గొన్నారు. గుండాలను సందర్శించిన ఎస్పీ మండలంలోని గుండాల గ్రామాన్ని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ గురువారం సందర్శించారు. రోంపల్లిలో వైద్యశిబిరం ప్రారంబించి అక్కడి నుంచి గుండాలకు కాలినడన చేరుకుని గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. దండేపల్లి మండలం ఊట్ల గ్రామం నుంచి గుండాల వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. -
ముగిసిన దేహదారుఢ్య పరీక్షలు
ఆదిలాబాద్ క్రైం : కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ తెలిపారు. స్థానిక పోలీసు హెడ్‌క్వార్టర్‌లోని పరేడ్ మైదానంలో 455 మంది అభ్యర్థులు హాజరుకాగా, వారికి 800 మీటర్ల పరుగు పరీక్షలు, సర్టిఫికెట్ పరిశీలనతోపాటు ఛాతి, ఎత్తు కొలతలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. వారిలో 180 మంది దేహదారుఢ్య పరీక్షలు అర్హత సాధించారని తెలిపారు. శుక్రవారం అర్హత సాధించిన అభ్యర్థులకు 100 మీటర్ల పరుగు పరీక్షలు, షార్ట్‌పుట్, లాంగ్‌జంప్, హైజంప్ విభాగాల్లో పరీక్షలు ఉంటాయని తెలిపారు. దేహదారుఢ్య పరీక్షలకు చివరి రోజు 65 మంది మహిళా అభ్యర్థులు హాజరుకాగా.. 49 మంది అర్హత సాధించారని, ఈ నెల 15 నుంచి ప్రారంభమైన కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ 15 రోజుల పాటు కొనసాగిందని తెలిపారు. ప్రధానంగా అభ్యర్థుల ఆధార్‌కార్డు, బయోమెట్రిక్, సర్టిఫికెట్ల పరిశీలనలో జిల్లా పోలీసు కార్యాలయం అధికారులు, సిబ్బంది, కంప్యూటర్ విభాగం సిబ్బంది ఎంతో అప్రమత్తంగా వ్యవహరించారని అన్నారు. ప్రతి విభాగంలో డీఎస్పీ స్థాయి అధికారులతో సహా వ్యాయామ ఉపాధ్యాయులను నియమించి పూర్తిగా పారదర్శకంగా పోటీ పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. అభ్యర్థుల కోసం తాగునీటి సదుపాయంతోపాటు వర్షంలో తడవకుండా ప్లాస్టిక్ షామియానాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రక్రియ కోసం అదనపు ఎస్పీ జీఆర్ రాధిక, మంచిర్యాల ఏఎస్పీ ఎస్ఎం విజయ్‌కుమార్, కార్యాలయం అధికారులు జి.పుష్పరాజ్, జోసెఫిన్, యూనుస్‌అలీ, ఆర్.భారతి, సిబ్బంది విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. -
హరితహారం
-
ప్రతీ ఇల్లు హరితవనం కావాలి..
ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ 13.56 లక్షల మొక్కలు నాటిన పోలీసులు ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో ప్రతీ ఇల్లు ఒక హరితవనం కావాలని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఆకాంక్షించారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణ శివారులోని సీసీఐ కాలనీ జీఎస్ ఎస్టేట్‌లో హరితహారం నిర్వహించారు. 2 వేల మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఎస్పీకి కాలనీ చిన్నారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో 13 లక్షల 56 వేల మొక్కలు నాటామని, రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉందని అన్నారు. కాలనీలోని ప్రతీ ఇంట్లో పది మొక్కలు నాటాలని సూచించారు. ఆదివారం ఒకే రోజు లక్షా 6 వేల మొక్కలు నాటామన్నారు. పోలీసులు మొక్కలు నాటడంతోపాటు గ్రామాల్లో మొక్కలు పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతీ రోజు లక్ష మొక్కలు నాటే ప్రణాళిక పెట్టుకున్నామని తెలిపారు. జనమైత్రి పోలీసు అధికారులకు స్థానిక యువకులు పూర్తి సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. మొక్కలు నాటడంతోపాటు వాటి రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ, వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, ఏఎస్సై జి.అప్పారావు, కాలనీవాసులు బి.కిషన్‌రావు, ఉత్తూరు సందీప్, వి.గంగాధర్, రాజేందర్ శర్మ, శేషగిరి, భాస్కరాచారి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.