కొలతలు తీసుకుంటున్న ఎస్పీ
ముగిసిన దేహదారుఢ్య పరీక్షలు
Published Thu, Jul 28 2016 11:06 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
ఆదిలాబాద్ క్రైం : కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ తెలిపారు. స్థానిక పోలీసు హెడ్‌క్వార్టర్‌లోని పరేడ్ మైదానంలో 455 మంది అభ్యర్థులు హాజరుకాగా, వారికి 800 మీటర్ల పరుగు పరీక్షలు, సర్టిఫికెట్ పరిశీలనతోపాటు ఛాతి, ఎత్తు కొలతలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. వారిలో 180 మంది దేహదారుఢ్య పరీక్షలు అర్హత సాధించారని తెలిపారు. శుక్రవారం అర్హత సాధించిన అభ్యర్థులకు 100 మీటర్ల పరుగు పరీక్షలు, షార్ట్‌పుట్, లాంగ్‌జంప్, హైజంప్ విభాగాల్లో పరీక్షలు ఉంటాయని తెలిపారు.
దేహదారుఢ్య పరీక్షలకు చివరి రోజు 65 మంది మహిళా అభ్యర్థులు హాజరుకాగా.. 49 మంది అర్హత సాధించారని, ఈ నెల 15 నుంచి ప్రారంభమైన కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ 15 రోజుల పాటు కొనసాగిందని తెలిపారు. ప్రధానంగా అభ్యర్థుల ఆధార్‌కార్డు, బయోమెట్రిక్, సర్టిఫికెట్ల పరిశీలనలో జిల్లా పోలీసు కార్యాలయం అధికారులు, సిబ్బంది, కంప్యూటర్ విభాగం సిబ్బంది ఎంతో అప్రమత్తంగా వ్యవహరించారని అన్నారు.
ప్రతి విభాగంలో డీఎస్పీ స్థాయి అధికారులతో సహా వ్యాయామ ఉపాధ్యాయులను నియమించి పూర్తిగా పారదర్శకంగా పోటీ పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. అభ్యర్థుల కోసం తాగునీటి సదుపాయంతోపాటు వర్షంలో తడవకుండా ప్లాస్టిక్ షామియానాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రక్రియ కోసం అదనపు ఎస్పీ జీఆర్ రాధిక, మంచిర్యాల ఏఎస్పీ ఎస్‌ఎం విజయ్‌కుమార్, కార్యాలయం అధికారులు జి.పుష్పరాజ్, జోసెఫిన్, యూనుస్‌అలీ, ఆర్.భారతి, సిబ్బంది విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు.
Advertisement