Speakers Meeting
-
కల్లోలాలు మంచివి కావు
న్యూఢిల్లీ: ఘర్షణలు, కల్లోలాలు ఏ పక్షానికీ మంచి చేయబోవని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలకు విచి్ఛన్న ప్రపంచం పరిష్కారాలు చూపజాలదన్నారు. ఇది శాంతి, సౌభ్రాతృత్వాలు నెలకొనాల్సిన సమయమని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు నానాటికీ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శుక్రవారం ఇక్కడ మొదలైన జీ20 పార్లమెంటరీ స్పీకర్ల 9వ సదస్సు ప్రారంభ సెషన్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ప్రపంచంలో పలు చోట్ల ప్రస్తుతం ఏం జరుగుతోందో మనందరికీ తెలుసు. కలసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయమిది’’ అని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్, హమాస్ పోరుకు తక్షణం తెరపడాల్సిన అవసరం చాలా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పరస్పర విశ్వాసంతో మానవ విలువలకు పెద్ద పీట వేయడమే ఇందుకు మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదమే మార్గం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాద భూతంపై అంతర్జాతీయ సమాజం ఉక్కుపాదం మోపడమే ఏకైక మార్గమని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘భారత్ దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. మా దేశంలో వేలాదిగా అమాయకులను బలి తీసుకుంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే మానవత్వానికి మాయని మచ్చ‘ అని పునరుద్ఘాటించారు. ఇంత జరిగినా ఉగ్రవాదాన్ని నిర్వచించే అంశం మీద కూడా ఇప్పటికీ అంతర్జాతీయ సమాజం ఏకాభిప్రాయానికి రాలేకపోవడం శోచనీయమన్నారు. మహిళా భాగస్వామ్యానికి ప్రోత్సాహం భారత్‌లో ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పిస్తున్నట్టు మోదీ తెలిపారు. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో సగం మేరకు వాళ్లే ఉన్నట్టు పార్లమెంటుల స్పీకర్లకు వివరించారు. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ ఇటీవలే పార్లమెంటులో చట్టం కూడా చేసినట్టు చెప్పారు. ‘నేడు భారత్ ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యంతో కళకళలాడుతోంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో మహిళల చురుకైన పాత్ర దేశ ప్రగతికి చాలా కీలకం‘ అని అన్నారు. భారత్‌లో 28 భాషల్లో ఏకంగా 900కు పైగా టీవీ చానళ్లు, దాదాపు 200 భాషల్లో 33 వేలకు పైగా వార్తా పత్రికలు ఉన్నాయని వారికి వివరించారు. ప్రపంచమంతటా దేశాల నాయకత్వ స్థానంలో మహిళలు ఎక్కువగా ఉంటే బహుశా ఇన్ని యుద్ధాలు జరిగేవి కాదని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ప్రెసిడెంట్ దుతర్తే పచెకో అభిప్రాయపడ్డారు. -
వచ్చే నెలలో ఢిల్లీలో జీ20 పార్లమెంట్ స్పీకర్ల భేటీ
న్యూఢిల్లీ: జీ20 కూటమి దేశాల పార్లమెంట్ స్పీకర్ల సమావేశం వచ్చే నెలలో ఢిల్లీలో జరగనుంది. అక్టోబర్ 12, 13, 14వ తేదీల్లో పార్లమెంట్ నూతన భవనం పార్లమెంట్–20 భేటీకి వేదిక కానుందని జీ20 ఇండియా స్పెషల్ సెక్రటరీ ముక్తేశ్ పర్దేశి చెప్పారు. జీ20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాల పార్లమెంట్ ప్రిసైడింగ్ అధికారులు పాల్గొని చర్చలు జరుపుతారని తెలిపారు. ‘పార్లమెంటేరియన్లు సంబంధిత ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. కాబట్టి, పీ20 సమావేశాలు ప్రపంచ పాలనకు పార్లమెంటరీ కోణాన్ని తీసుకురావడం, అవగాహన పెంచడం, అంతర్జాతీయ నిబంధనలకు రాజకీయ మద్దతును సాధించడం, వీటిని సమర్థంగా కార్యరూపం దాల్చేలా చేయడమే ఈ సమావేశాల లక్ష్యం’అనిముక్తేశ్ వివరించారు. భారత్‌ను ప్రజాస్వామ్యానికి తల్లిగా చూపేందుకు ఉద్దేశించిన ఒక ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. 2010లో జీ20 అధ్యక్ష స్థానంలో కెనడా ఉన్నప్పటి నుంచి పీ20 గ్రూప్ భేటీలు జరుగుతున్నాయని, ఆ క్రమంలో ఇది 9వదని వివరించారు. -
భావితరాలకు తప్పుడు సంకేతాలు : స్పీకర్ తమ్మినేని
సాక్షి : పార్టీ ఫిరాయింపుల నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లేదంటే భావితరాలకు తప్పుడు సంకేతాలు ఇచ్చిన వాళ్లమవుతామని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. గురువారం డెహ్రాడూన్‌లో జరిగిన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని, అధికార పార్టీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకొని మంత్రి పదవులను కూడా ఇచ్చిందని వెల్లడించారు. ఇలాంటి అవకాశం ఉండడం మంచిది కాదని, మా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విలువలను పాటించి ఆదర్శవంతంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. షెడ్యూల్ 10 లో ఫిరాయింపుల చట్టాన్ని పటిష్ట పరిచి పార్టీ మారితే చర్యలు తీసుకునేలా ఉండాలని స్పీకర్ అభిప్రాయపడ్డారు. -
నేడు ఏపీ,టీ స్పీకర్ల సమావేశం
-
ఒకే ఆవరణలో రెండు అసెంబ్లీల నిర్వహణపై చర్చ
హైదరాబాద్: ఒకే ఆవరణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రెండు అసెంబ్లీల నిర్వహణపై ఈ రోజు ఇక్కడ జరిగిన స్పీకర్ల సమావేశంలో చర్చ జరిగింది. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్, తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిల సమావేశం ముగిసింది. ప్రధానంగా ఇరు రాష్ట్రాల అసెంబ్లీ వ్యవహారాల అంశంపైనే చర్చించారు. ఏపీ అసెంబ్లీని జూబ్లీహాల్లో నిర్వహించే అంశం ప్రతిపాదనకు వచ్చింది. ఇద్దరు స్పీకర్లు మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ, కౌన్సిల్ ఒకేచోట నిర్వహించాలన్న ప్రతిపాదనపై చర్చించారు. జులై మొదటి వారంలో మరోదఫా ఇరు రాష్ట్రాల స్పీకర్లు సమావేశమవుతారు. ఈ రోజు జరిగిన సమావేశంలో స్పీకర్లతోపాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.