(ఫైల్ ఫోటో)
సాక్షి : పార్టీ ఫిరాయింపుల నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లేదంటే భావితరాలకు తప్పుడు సంకేతాలు ఇచ్చిన వాళ్లమవుతామని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. గురువారం డెహ్రాడూన్‌లో జరిగిన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని, అధికార పార్టీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకొని మంత్రి పదవులను కూడా ఇచ్చిందని వెల్లడించారు. ఇలాంటి అవకాశం ఉండడం మంచిది కాదని, మా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విలువలను పాటించి ఆదర్శవంతంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. షెడ్యూల్ 10 లో ఫిరాయింపుల చట్టాన్ని పటిష్ట పరిచి పార్టీ మారితే చర్యలు తీసుకునేలా ఉండాలని స్పీకర్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment