Special Bank
-
బంగారానికి ప్రత్యేక బ్యాంకు ఉండాలి
ముంబై: ప్రజల దగ్గరున్న భౌతిక రూపంలోని బంగారాన్ని (ఆభరణాలు, కడ్డీలు వంటివి) నగదీకరించడానికి ప్రత్యేకంగా బంగారం బ్యాంకులాంటిది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ తెలిపారు. ప్రత్యేకంగా బంగారం డిపాజిట్లు స్వీకరించడం, కేవలం పసిడి రుణాలకే పరిమితం కావడం లేదా ఎక్కువగా పుత్తడి రుణాలే ఇచ్చేట్లుగా దీన్ని రూపొందించవచ్చని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. భారత్ వంటి వర్ధమాన దేశాలు నిలకడగా అధిక స్థాయిలో వృద్ధి సాధించాలంటే బోలెడంత పెట్టుబడి అవసరం అవుతుందని గాంధీ పేర్కొన్నారు. ఇందుకు గోల్డ్ బ్యాంక్ తోడ్పడగలదని ఆయన చెప్పారు. ‘ప్రజల దగ్గరున్న బంగారాన్ని డిపాజిట్లాగా సేకరించేందుకు వినూత్నమైన ఆలోచనలు చేయాలి. ఉదాహరణకు.. బంగారం జ్యుయలరీని డిపాజిట్ చేసే వారికి.. కాలవ్యవధి తీరిపోయిన తర్వాత అదే డిజైన్ లేదా అదే తరహా ఆభరణాన్ని తిరిగి ఇచ్చేలా స్కీములు ఆఫర్ చేయొచ్చు‘ అని ఆయన వివరించారు. దేశీయంగా ప్రజల దగ్గర, ఆధ్యాత్మిక సంస్థల దగ్గర దాదాపు రూ. 23,000–24,000 టన్నుల బంగారం ఉందని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే గాంధీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
కొత్త బ్యాంకు ఖాతా తప్పనిసరికాదు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల కోసం పాత బ్యాంకు ఖాతానే వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంకు ఖాతా తెరిచి దాని ద్వారానే ఎన్నికల ఖర్చులు చేయాలన్న నిబంధనను ఎన్నికల సంఘం సడలించింది. అయితే నామినేషన్ దాఖలు సమయంలో పాత బ్యాంకు ఖాతా నంబర్‌ను రిటర్నింగ్ అధికారికి అందజేయడంతోపాటు నామినేషన్ దాఖ లు చేసిన తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సదరు ఖాతాను ఎన్నికల ఖర్చు కోసమే వినియోగిస్తామని ధ్రువీకరణ సమర్పించాలని తెలి పింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ శనివారం ప్రత్యేక సర్క్యులర్ జారీ చేశారు. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలుకు కనీసం ఒకరోజు ముందు ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి, ఆ ఖాతా వివరాలను రిటర్నింగ్ అధికారికి అందజేయాలని, మొత్తం ఎన్నికల ఖర్చును ఈ ఖాతా ద్వారానే చేయాలని గతేడాది మే 18న రాష్ట్ర ఎన్నికల సంఘం సర్క్యులర్ జారీ చేసింది. కొత్త బ్యాంకు ఖాతా తెరవడానికి 10–15 రోజుల సమయం పడుతోందని, ఈ నిబంధనతో ఎన్నికల్లో పోటీ చేయలేమని కొందరు అభ్యర్థులు క్షేత్రస్థాయి అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కొంతమంది జిల్లా కలెక్టర్లు ఈ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి దృష్టికి తీసుకురాగా.. ఆయన స్పందించి తక్షణమే సడలింపు ఉత్తర్వులు జారీ చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలూ అర్హులే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసేందుకు ఎంపీటీసీ, జడ్పీటీసీలు అర్హులేనని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే ఒకటి కంటే ఎక్కువ పదవులకు ఎన్నికైతే ఏదో ఒక పదవినే చేపట్టాల్సి ఉంటుందని, నిబంధనల ప్రకారం ఇతర పదవిని కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొం ది. పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల అర్హతల విషయంలో ఎన్నికల అధికారుల నుంచి వస్తున్న సందేహాలను నివృత్తి చేస్తూ ఆదివారం జిల్లా కలెక్టర్ల కు ఈ మేరకు లేఖ రాసింది. ఒక అభ్యర్థి ఏకకాలంలో సర్పంచ్, వార్డు సభ్యుడి స్థానాలకు పోటీ చేయవచ్చని, ఒక వేళ ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే నిబంధనల ప్రకారం ఒక పదవిని మాత్రమే చేపట్టి ఇతర పదవిని వదులుకోవాల్సి ఉంటుందని తెలిపింది. పంచాయతీ ఎన్నికల్లో ఒకటి కంటే ఎక్కువ వార్డుల్లో, ఒకటి కంటే ఎక్కువ ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి ఒక అభ్యర్థి పోటీ చేసేందుకు అవకాశం లేదని తేల్చి చెప్పింది. అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ వార్డులు/ప్రాదేశిక నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేయవచ్చని, నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా ఒకటి తప్ప మిగిలిన చోట్లలో వేసిన నామినేషన్లలను ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. -
టీడీపీకి కలెక్టర్ వెన్నుదన్ను : తాతినేని
పెనమలూరులో రోడ్ల నిర్మాణానికి కమిటీ వేశారని, ఆ కమిటీ కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను ఏర్పాటు చేశారని, ఖాతాలో ఉన్న డబ్బును పంచాయతీ, మండలం, జెడ్పీకి జమ చేయకుండానే పనులు ఎలా చేశారని తాతినేని నిలదీశారు. యనమలకుదురు క్వారీ నుంచి రోడ్ల నిర్మాణం పేరుతో ఇసుకను తవ్వి అనేక లారీలను బయటకు పంపారని, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. సీఆర్డీఏ పరిధిలో ఉన్న పెనమలూరు నియోజకవర్గంలో ప్రభుత్వం అనుమతి లేకుండా రోడ్ల నిర్మాణం ఎలా చేస్తారని అడిగారు. యనమలకుదురు క్వారీ నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా, ఆన్లైన్లో ఫిర్యాదు పంపినా ఎందుకు స్పందించలేదని కలెక్టర్‌ను ఆమె ప్రశ్నించారు. టీడీపీకి అనుకూలంగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నారు. యనమలకుదురు క్వారీకి అనుమతులు ఉన్నాయో, లేదో చెప్పాలని కలెక్టర్‌ను ఆమె కోరారు. పరిశీలించి చెబుతానని కలెక్టర్ చెప్పడం గమనార్హం. క్వారీల నుంచి ఇసుకను తరలించే లారీలకు జీపీఎస్ పద్ధతి అమలుచేయడం లేదని, జీపీఎస్ స్టిక్కర్లు లేని లారీల ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ పద్మావతి ఓ వీడియోను పోడియం వద్దకు వెళ్లి కలెక్టర్, జెడ్పీ చైర్‌పర్సన్‌కు చూపారు. 90 శాతం వాహనాలకు జీపీఎస్ పద్ధతిని అమలు చేస్తున్నామని, మిగిలిన 10 శాతం త్వరలో పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. దీనిపై పద్మావతిని ఉద్దేశించి గద్దె అనురాధ స్పందిస్తూ.. మీకు అభివృద్ధి జరగడమంటే ఇష్టం లేదు.. అందుకే కలెక్టర్‌పైనా వ్యాఖ్యలు చేస్తున్నారు.. మీరలా మాట్లాడకూడదు.. ఈ ఒక్క కారణంతో మిమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేయవచ్చు..’ అని పేర్కొన్నారు. -
తుపాను సాయం స్వాహా
విశాఖ : హుదూద్ సహాయంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిత్యావసర వస్తువులను టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వాహా చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ విమర్శించారు. ఆయన శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గాజువాక, భీమిలి ప్రాంతాల్లో నిత్యావసర సరుకులతో పట్టుబడ్డ టీడీపీ నాయకులే దోపిడీకి నిదర్శనమన్నారు. టీడీపీ కార్యకర్తలు సంతకాలు పెట్టి రేషన్ సరుకులను కొల్లగొడుతున్నారని ఆయన ఆరోపించారు. జిల్లా మంత్రుల నియోజకవర్గాల్లో సైతం అవకతవకలు జరిగాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడే మకాం వేసి హడవుడి చేస్తూ నటించారన్నారు. ఏజేన్సీలో ఇప్పటికి ఎలాంటి సాయం అందలేదని బాబుకు తెలీదా అని ప్రశ్నించారు. జిల్లాలో లక్ష ఇళ్లకు పైగా దెబ్బతిన్నాయి. కూలినప్రతీ ఇంటిని పక్క నిర్మాణం చేయాలి. చినగదిలి దేవస్థానం భూముల్లోని పడి పోయిన ఇళ్లను నిర్మించాలి. హుదూద్ తుఫాన్ బాధితులకు వస్తున్న విరాళాలు ముఖ్యమంత్రి రిలీప్ ఫండ్‌లో జమ చేయకూడదు. ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరిచి దాతల విరాళాలను జమ చేసి జిల్లాకే వినియోగించాలని అమర్నాధ్ డిమాండ్ చేశారు. తుఫాన్ పనుల్లో టీడీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ వైఖరకి నిరసనగా నవంబరు 5న ధర్నా నిర్వహించానున్నామని చెప్పారు. ఎమ్మేల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ పెను తుఫాన్‌తో ఏజెన్సీ అతాలకుతలమైందన్నారు. పది పదిహేనేళ్లు కష్టపడితే వచ్చే కాఫీ పంటలు నాశనమైందన్నారు. చంద్రబాబు నాయుడు ఏజెన్సీలో కంటితుడుపు పర్యటన చేశారన్నారు. హెక్టార్ కాఫీ పంటలపై ఏడాదికి రూ.లక్ష సంపాదించే గిరిజన రైతులను రూ.25వేలు సహాయం చేయానున్నట్టు జీవో విడుదల చేయడం బాధాకరమన్నారు. గిరిజనులకు కనీసం 35 కేజీల బియ్యం అందివ్వాలని వినతి పత్రం అందిస్తే సీఎం కసురుకుని అవమానించారన్నారని ఆవేదన చెందారు. వైఎస్సార్సీపీ గెలిచిన గిరిజన ప్రాంతాలను చిన్న చూపుచూస్తున్నారని ఆరోపించారు. హుదూద్ వచ్చి పందొమ్మిది రోజులైనా టీడీపీ ప్రభుత్వం సర్వేలతో కాలయాపన చేస్తున్నారని ద్వజమెత్తారు. బియ్యం, కాయగూరలు తప్ప ఆర్ధిక సహయం అందివ్వలేదని మండిపడ్డారు. తమ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ప్రజలకు మద్దతుగా ప్రభుత్వంపై పోరాటం చేయానున్నామన్నారు. 5వ తేదీన జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో రాష్ట కార్యదర్శులు వంశీకృష్ణశ్రీనివాస్, కంపా హనోకు, సమన్వయకర్తలు కర్రి సీతారం, మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, పెట్ల ఉమాశంకరగణేష్, రొంగలి జగన్నాథం, ప్రగడ నాగేశ్వరరావు, చొక్కాకుల వెంకటరావు, తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.హెచ్.ఫరూఖి, నాయకులు భూపతిరాజు శ్రీనివాస్, రవిరెడ్డి, పక్కి దివాకర్, గుడ్ల పోలిరెడ్డి, పసుపులేటి ఉషాకిరణ్, జాన్ వెస్లీ, విల్లూరి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.