special vaccination
-
Telangana: రోజుకు 3 లక్షల టీకాలు
విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులు,వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చాం. ఇకపై వైద్యం, విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాం. మెడికల్ కాలేజీలు, మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సత్వర నిర్మాణంపై అధికారులు శ్రద్ధ వహించాలి. టీకా, జాగ్రత్త.. రెండూ అవసరం కోవిడ్ టీకా ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిదనే విషయాన్ని ప్రజలు గమనించాలి. కరోనా వేవ్‌ల సమయంలో అప్రమత్తంగా ఉన్నవారు త్వరగా కోలుకున్నారని, నిర్లక్ష్యం చేసినవారు ప్రాణాలు కోల్పోయారని నివేదికలు చెప్తున్నాయి. అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం లక్షణాలున్నా.. ఆరోగ్య కేంద్రాల్లో చూపించుకోవాలి. మాస్కులు, కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. సాక్షి, హైదరాబాద్: కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి విస్తృతంగా వ్యాక్సినేషన్ నిర్వహించాలని.. రోజుకు 3 లక్షల మందికి టీకాలు వేసేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోందని, మన రాష్ట్రానికి కూడా సరిపడా వ్యాక్సిన్లు సరఫరా కానున్నాయని తెలిపారు. ప్రస్తుతం కరోనా పూర్తి నియంత్రణలోనే ఉన్నా.. భవిష్యత్‌లో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా ముందుజాగ్రత్తగా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని స్పష్టం చేశారు. వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రి ఎర్రబెల్లి, సీఎస్ సోమేశ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ తదితరులు రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వైద్యారోగ్యశాఖకు సంబంధించిన వివిధ అంశాలపై సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పలు అంశాలను సీఎం కేసీఆర్‌కు వివరించారు. రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు పునః ప్రారంభమయ్యాయని.. ఎక్కడా కరోనా ప్రభావంపెద్దగా లేదని తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి మందులు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అనంతరం అధికారులకు సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న నిమ్స్ దవాఖానా పరిధిలో మరో రెండు పెద్ద భవనాలు (టవర్స్) నిర్మించి సేవలను మరింత విస్తృత పరచాలని ఆదేశించారు. శుభ్రత, ఇతర సేవల విషయంలో కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అందరి సహకారంతో స్పెషల్ డ్రైవ్ రోజుకు మూడు లక్షల మందికి కోవిడ్ టీకాలు వేసేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ స్పెషల్ డ్రైవ్ విజయవంతం అయ్యేందుకు సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. ఎంపీవోలు, ఎంపీడీవోలు, డీఎల్పీవోలు, డీపీవోలు, జెడ్పీ సీఈవో, ఇతర అధికారులు వైద్య సిబ్బందికి పూర్తి సహకారం అందించి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరిగేలా చూడాలన్నారు. కరోనా ఉధృతంగా ఉన్నప్పుడు గ్రామాల్లో లాక్డౌన్లు పెట్టుకోవడం, కోవిడ్ సోకినవారి కోసం స్కూళ్లలో ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం వంటి చర్యల ద్వారా.. సర్పంచులు ప్రజలకు అండగా నిలిచారని సీఎం కేసీఆర్ అభినందించారు. ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియలోనూ భాగస్వాములు కావాలని కోరారు. స్పెషల్ డ్రైవ్‌పై కలెక్టర్లు, ఇతర అధికారులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. వ్యాక్సినేషన్ సెంటర్లుగా స్కూళ్లు, కాలేజీలు, రైతు వేదికలు వంటి ప్రభుత్వ/ప్రైవేటు భవనాలను ఉపయోగించుకోవాలని.. అవసరమైన చోట్ల టెంట్లు వేసి శిబిరాలు నిర్వహించాలని సూచించారు. సిద్ధంగా ఉండండి భవిష్యత్‌లో కరోనా, సీజనల్ వ్యాధులు సహా ఎలాంటి ఆపద వచ్చినా ప్రజలను ఆదుకోవడానికి వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అవసరమైన మేరకు బెడ్లు, ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు విషయంలో తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. సీఎం సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కోటీ 42 లక్షల మందికి వ్యాక్సిన్లు.. రాష్ట్రంలో 18 ఏళ్లపైన వయసు ఉండి, కోవిడ్ టీకాకు అర్హత ఉన్నవారు 2కోట్ల 80 లక్షల మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఇప్పటికే కోటీ 42 లక్షల మందికి మొదటి డోసు వేశామని.. అందులో 53 లక్షల మందికి రెండు డోసులూ పూర్తయ్యాయన్నారు. కోటీ 38 లక్షల మందికి తొలి డోసు వేయాల్సి ఉందని పేర్కొన్నారు. -
ఏపీ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ శనివారం కొనసాగుతోంది.18 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ కోసం 2వేలకు పైగా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక, ఏపీలో ఇప్పటివరకూ 2.77 కోట్ల మందికి పైగా కోవిడ్ వ్యాక్సినేషన్ అందించిన విషయం తెలిసిందే. చదవండి: ఒక్క రోజే కోటి వ్యాక్సినేషన్లు -
పోలియోపై సమరం
నేటి నుంచి 26 వరకు హైదరాబాద్‌లో ప్రత్యేక వ్యాక్సినేషన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని మురుగునీటిలో పోలియో వైరస్ వెలుగు చూసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. చిన్నారులెవరూ ఈ మహమ్మారి బారిన పడకుండా చూసేందుకు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో సోమవారం నుంచి 26 వరకు ప్రత్యేక పోలియో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేసింది. ఆరు వారాల నుంచి మూడేళ్ల వయసున్న చిన్నారులకు ఉచితంగా ఇన్-యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ (ఐపీవీ) ఇంజెక్షన్లు వేయనుంది. ఇందుకోసం నగరంలోని 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) పరిధిలో ఉన్న 12 క్లస్టర్లలో 750 బూత్‌లతోపాటు, రంగారెడ్డి జిల్లాలోని 12 పీహెచ్‌సీల పరిధిలో 11 క్లస్టర్లలో 136 బూత్‌లను ఏర్పాటు చేసింది. వీటి పరిధిలోని 2.5 లక్షల మంది పిల్లలకు ఐపీవీ ఇంజెక్షన్లు ఇప్పించనుంది. అధికారులు ఇప్పటికే చెన్నై నుంచి ప్రత్యేకంగా 3.5 లక్షల ఐపీవీ వ్యాక్సిన్ డోసులను హైదరాబాద్‌కు తెప్పించారు. ఒక్కో రోజు, ఒక్కో చోట బూత్‌లను ఏర్పాటు చేస్తా రు. అధికారులు నిర్ధరించిన తేదీల్లో సంబంధిత బూత్‌ల పరిధిలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తల్లిదండ్రులు వారి పిల్లలకు వ్యాక్సిన్ వేయించాల్సి ఉంటుంది. దీనిపై మరిన్ని వివరాలకు ప్రభుత్వం ‘104’ అత్యవసర ఫోన్ సర్వీసు ద్వారా సమాచారం తెలుసుకునే వీలు కల్పించింది. నగరానికి యునిసెఫ్, డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు... నగరంలో పోలియో వైరస్ వెలుగు చూడడంతో ఐపీవీ పోలియో వ్యాక్సిన్‌ను ప్రత్యేక డ్రైవ్ ద్వారా చిన్న పిల్లలకు వేయడం ప్రపంచంలోనే మొదటిసారని వైద్యాధికారులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జెనీవా, నైజీరియాల నుంచి యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థలకు చెందిన నలుగురు ప్రతినిధులు ప్రత్యేకంగా హైదరాబాద్ తరలివచ్చారు. ఆ సంస్థలకు చెందిన మరో ఐదుగురు ప్రతినిధులు ఢిల్లీ నుంచి కూడా వచ్చారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించి అధికారులకు అవసరమైన సూచనలను వారు ఇవ్వనున్నారు. కార్యక్రమాన్ని వీడియో రికార్డింగ్ చేయించడంతోపాటు డాక్యుమెంటరీ రూపకల్పనకు ఏర్పాట్లు చేశారు. కొద్దిగా నొప్పి..దద్దుర్లు వచ్చే అవకాశం ఐపీవీ వ్యాక్సిన్‌ను ఇంజెక్షన్ రూపంలో ఇవ్వనున్నందున కొద్దిపాటి నొప్పి, చిన్న దద్దుర్లు వస్తాయని ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. అతి కొద్దిమంది చిన్నారులకు మాత్రమే జ్వరం వచ్చే అవకాశం ఉందన్నారు. అయినా కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. ఐపీవీ వ్యాక్సిన్ అత్యంత రక్షణతో కూడినదన్నారు. ఏవైనా ఇబ్బందులుంటే సమీపంలోని ఆసుపత్రులకు తీసుకెళ్లాలని సూచించారు. పోలియో కనిపించకుండా చర్యలు హైదరాబాద్: దేశంలో ఎక్కడా పోలియో కేసులు కనిపించకుండా పూర్తిస్థాయిలో ఆరోగ్య రక్షణ చర్యలు చేపడుతున్నట్టు యునెటైడ్ నేషన్స్ కంట్రీ ఆఫీస్ చీఫ్ ఆఫ్ పోలిక్ డాక్టర్ నిలోక్ డచ్ చెప్పారు. ఆదివారం ఇక్కడ జరిగిన స్పెషల్ ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్ వ్యాక్సిన్ (ఐ.పి.వి) స్పెషల్ డ్రైవ్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. పోలియో రాకుండా ఉండేందుకు చిన్నారులకు ఐపీవీ ఇంజెక్షన్ రూపంలో ఇస్తామన్నారు. దీనిగురించి ఇప్పటికే 700 మంది పిల్లల డాక్టర్లకు 3 రోజుల పాటు నగరంలో సీఎంఈ పేరిట అవగాహన కల్పించామన్నారు. ఈ ఇంజెక్షన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 200 మందికిపైగా పిల్లల వైద్య నిపుణుల సేవలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన 200 మందికిపైగా పిల్లల వైద్య నిపుణులు ముందుకొచ్చారు. ఐపీవీ వ్యాక్సినేషన్ కోసం ఐదు వేల మంది సిబ్బందిని వైద్య ఆరోగ్యశాఖ నియమించింది. ఇందులో వెయ్యి మంది వైద్య ఆరోగ్యశాఖకు చెందినవారున్నారు. మిగిలిన వారిలో వివిధ ప్రభుత్వ శాఖలు, ఎన్జీవోలకు చెందిన సిబ్బంది ఉన్నారు. మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి సిబ్బందిని తరలించారు. ఆయా జిల్లాల నుంచి 600 మంది ఏఎన్ఎంల సేవలను వినియోగించుకోనున్నారు. వీరందరినీ పర్యవేక్షించేందుకు 60 మందిని నియమించారు. చిన్నారులకు ఐపీవీ వ్యాక్సినేషన్ వేశాక ప్రతికూల పరిణామాలు ఏమైనా సంభవిస్తే తక్షణమే వారిని సమీపంలోని ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు అడ్వర్స్ ఇవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ (ఏఎఫ్ఐ) టీంలను ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో ఒక్కో టీంను సిద్ధం చేశారు.