Spencer Tunick
-
ఫేస్బుక్ కార్యాలయం ముందు నగ్న నిరసన
న్యూయార్క్ : కళాత్మక నగ్నత్వంపై ఫేస్బుక్ విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని #WeTheNipple పేరుతో వందల మంది మోడల్స్ న్యూయార్క్‌లోని ఆ కార్యాలయం ముందు నగ్న నిరసన చేపట్టారు. మగాళ్లు తమ చనుమొనలు చూపిస్తే ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు.. మహిళల చనుమొనలపై ఎందుకు ఆంక్షలు? అంటూ గొంతెత్తి అరిచారు. ఆడవాళ్ల చనుమొనలు ఫొటోలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివాదాస్పద ఆర్టిస్ట్ స్పెన్సర్ తునిక్, నేషనల్ కోలిషన్ ఎగైనెస్ట్ సెన్సార్షిప్(ఎన్సీఏసీ)తో కలిసి ఈ ఉద్యమాన్ని చేపట్టాడు. గత ఆదివారం న్యూయార్క్ వీధుల్లో మోడళ్లతో దుస్తులు విప్పించి ఆందోళనకు తెరతీశాడు. మన్‌హట్టన్‌లోని అస్టర్ ప్లేస్ సబ్వే స్టేషన్ వద్ద మోడళ్లు దుస్తులు విప్పేసి చనుమొనల చిత్రాలతో ఫొటోలకు పోజులిచ్చారు. వారి చనుమొనలకు పురుషుల చనుమొనల స్టిక్కర్లు అంటించుకొని.. వారి జననాంగాలు కనిపించకుండా చనమొనల ప్లకార్డుల అడ్డుపెట్టుకుని నిరసన తెలిపారు. ఇక ఫేస్బుక్లో కేవలం పెయింటింగ్ నగ్న చిత్రాలు మినహా ఫొటోలకు అనుమతి లేదు. వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాం యూట్యూబ్ సైతం తన నిబంధనలు మార్చుకుందని, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు ఏమైందని స్పెన్సర్ తునిక్ ప్రశ్నించారు. ఇది న్యూడ్ ఫొటోగ్రఫీ స్పూర్తిని దెబ్బతీయడేమనని వాపోయారు. -
న్యూడ్‌గా వేల మంది ఫొటోలకు ఫోజులు!
లండన్: ప్రఖ్యాత కళాకారుడు స్పెన్సర్ ట్యునిక్ యూకేలోని హల్ నగరంలో వినూత్న ప్రదర్శనకు శ్రీకారం చుట్టాడు. న్యూయార్క్ కు చెందిన ఆ పెయింటర్, ఫొటోగ్రాఫర్ ప్రదర్శన కోసం దాదాపు 20 దేశాలకు చెందిన ప్రజలు ఇక్కడకు తరలివచ్చారు. హల్ నగర మండలి సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 3200 మంది నగ్నంగా ఫొటోలకు ఫోజులిచ్చారు. ట్యునిక్ పై అభిమానంతో 80 ఏళ్ల స్టెఫానే జాన్సీన్ అమెరికా నుంచి హల్ సిటీకి వచ్చారు. నగరంలోని వారసత్వ కట్టడాల వద్ద, ముఖ్యమైన ప్రాంతాల్లో ఇలా నగ్నంగా ఫొటోలకు ఫోజులివ్వాలని ట్యునిక్ ఇచ్చిన పిలుపు మేరకు ఆసక్తి ఉన్నవారు ఇక్కడికి తరలివచ్చారు. మొత్తం నీలం రంగులలో నాలుగు షేడింగ్స్ పెయింట్ ను ఆడా, మగా అందరి శరీరంపై పూర్తిగా పెయింట్ చేశారు. వారసత్వ కట్టడాలు, ప్రకృతిసిద్ధమైన ఆస్తులను కాపాడుకోవాలని చెప్పడంలో భాగంగా ఇలా చేశామని ఆర్టిస్ట్ ట్యునిక్ చెప్పారు. సముంద్రం, నదులలో నీళ్లు తనకెప్పుడూ ఇష్టమేనని, వాటితో అనుబంధం ఈ విధంగా నీలి రంగు పెయింట్ వాడేలా చేసిందని ఆమెరికన్ ఆర్టిస్ట్ స్పెన్సర్ ట్యునిక్ అన్నాడు. తాను చేపట్టిన ప్రాజెక్టులలో ఇది చాలా భిన్నమైనదన్నారు. 2017లో తాను ఇప్పటివరకూ చేసిన ప్రాజెక్టులను ప్రజల ముందుకు తీసుకొస్తానని తెలిపారు. ఇక్కడికి తరలివచ్చిన వారికి ఫొటోలను పంపిస్తామని, ఎప్పటికీ ఇలాంటి ఘటనలు వారికి గుర్తులుగా మిగిలిపోతాయని ఆర్టిస్ట్ ట్యునిక్ అభిప్రాయపడ్డారు. -
ఆరువేల మంది ఒకేసారి నగ్నంగా..!
బొగోటా: మనుషులను సామూహికంగా నగ్న చిత్రాలు తీయండంలో నేర్పరి అయిన అమెరికన్ ఫోటోగ్రఫర్ స్పెన్సర్ ట్యూనిక్ ఇచ్చిన పిలుపు మేరకు 6000 మంది కొలంబియా ప్రజలు సోమవారం తమ ఒంటిపై ఉన్న వస్త్రాలను విప్పేశారు. 7 డిగ్రీల చలివాతావరణాన్ని కూడా లెక్కచేయకుండా శరీరంపై నూలిపోగు లేకుండా బొగోటా నగరంలోని మెయిన్ సెంటర్లో నిల్చుని ఫోటోలకు పోజులిచ్చారు. గత ఆరేళ్ల కాలంలో స్పెన్సర్ సామూహిక నగ్న చిత్రాల్లో ఇదే అతిపెద్దది కావటం విశేషం. కొలంబియాలోని లెఫ్టిస్ట్ తిరుగుబాటుదారులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలన్న నినాదంతో ప్రజలు ఈ సామూహిక నగ్న ఫోటో సెషన్లో పాల్గొన్నారు. ' నగ్నంగా మారిపోవడం సంతోషంగా ఉంది. మేమంతా గర్వాన్ని పక్కనబెట్టి మౌనంగా, శాంతిగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇది యూనిటీకి చిహ్నంగా ఉంటుంది' అని ఫోటో సెషన్లో పాల్గొన్న బెర్రియాంటొస్(40) వెల్లడించారు. 'ఇది నిజంగా కొత్త అనుభవం. మనం ప్రపంచంలోకి ఎలా వస్తామో అలాగే ఫోటో సెషన్లో పాల్గన్నాం' అని బెల్ట్రాన్(20) తెలిపాడు. ఈ ఫోటో సెషన్‌తో ప్రభుత్వం శాంతి చర్చల దిశగా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఫోటోగ్రాఫర్ ట్యూనిక్ వెల్లడించారు. కొలంబియా వివాదం రైతుల తిరుగుబాటుతో 1960లలో మొదలైంది.