Spice Girls
-
మళ్లీ దుమ్ము రేపనున్న స్పైసీ గర్ల్స్!
లండన్: చాన్నాళ్లకు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ బ్యాండ్ స్పైసీ గర్ల్స్ కలిశారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు విడివిడిగా ఉన్నవారు ఈ వారం రహస్యంగా ఓ స్టూడియోలో తిరిగి ఒకరినొకరు కలుసుకున్నారు. అయితే, గతంలో మాదిరిగా దుమ్ములేపే సాంగ్స్ రాసి పాడి ఇరగదీసేందుకే వారు తిరిగి కలిసినట్లు అక్కడి వార్తా సంస్థలు చెప్తున్నాయి. డీప్ ప్లే స్టూడియోలో స్పైసీ గర్ల్స్ గేరి హార్నర్, మెల్ బీ, ఎమ్మా బంటన్ కొత్తకొత్త పరికరాలతో పనిచేస్తూ దాదాపు పదహారేళ్ల తర్వాత తమ తొలిపాటను రాసి పాడి రికార్డు చేసినట్లు సమాచారం. ఈ సాంగ్ దుమ్మురేపేలా ఉందంట. అయితే, ఇదే బ్యాండ్ కు చెందిన మెల్ సీ, విక్టోరియా బెకాం మాత్రం హాజరుకానట్లు తెలిసింది. స్పైసీ గర్ల్స్ బ్యాండ్ నిర్మాత ఎలియట్ కెన్నడీ కూడా తన ట్విట్టర్ ఖాతాలో దీనిపై స్పందించారు. 'ఇప్పుడు ఆ రోజు చరిత్రలో ఒక రోజుగా మిగిలిపోతుంది. మంచి స్నేహానికి 20 ఏళ్లు దూరంగా ఉండే పరిస్థితి ఎవరికీ ఏర్పడకూడదు. హిట్ సాంగ్' అంటూ ఆయన పోస్ట్ చేశారు. మెల్ బీ కూడా ఇన్ స్టాగ్రమ్ ద్వారా తాము తిరిగి కలిశామని చెప్పింది. 'నేను ఇప్పుడు చెప్తాను.. ఓహ్ లాలా' అంటూ ఆ అమ్మడు పోస్ట్ చేసింది. -
ఆ స్పైసీ గాళ్స్ అంతా మళ్లీ కలుస్తున్నారు
లాస్ ఎంజిల్స్: వారు పేరుకే అమ్మాయిలు.. కానీ స్టేజీ మీదకు వచ్చారో చెవులు చిల్లులు పడేలా కేరింతల మోతలుంటాయి. చిన్నా పెద్దా లేకుండా ఎవరైనా హుషారుతో చిందులేయాల్సిందే. పాట అందుకున్నారంటే పరవశమవ్వక తప్పదు. వారే ఆల్ గర్ల్స్ బ్యాండ్ స్పైస్ గర్ల్స్. వచ్చే ఏడాదిలో ఒక రోజు వీరంతా ఓ చోట చేరనున్నారు. ఏదో ఒక ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కలిసి పనిచేసి వీరంతా వచ్చే సంవత్సరం 20వ పునస్సంగమ వేడుకను జరుపుకోనున్నారు. స్పైసీ గర్ల్స్ అంటే ఓరకంగా బ్యాండ్ కలిగిన చీర్ లీడర్స్ లాంటివారన్నమాట. వీరికి బ్యాండ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఏవైన ప్రముఖ జాతీయ లేక అంతర్జాతీయ వేడుకల్లోనే తమ అందాలను ఆరబోస్తూ దుమ్మురేపే స్టెప్పులతో, పాటలతో క్రీడాకారులను, ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని కలిగించడం వీరి ఆనవాయితీ. ఒకసారి ఒక ఈ వెంట్లో పాల్గొన్న వీరంతా మరో ఈవెంట్ వరకు కలిసే అవకాశాలు తక్కువ. అందుకోసమే వీరంతా వీలయినప్పుడల్లా ఒక ప్రత్యేక రోజును కేటాయించుకుని ఆ రోజు కలుసుకుంటారు. ఈ సందర్భంగా ది డెయిలీ స్టార్ మాజీ స్పైసీ గర్ల్ ఎమ్మా బంటన్ మాట్లాడుతూ తమ తరుపున జరిపే 20వ పునస్సంగమ వేడుక వచ్చే ఏడాది జరుపుకోనున్నామని తెలిపారు. తామంతా మరోసారి ఒకరినొకరం కలుసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇప్పటికే ఒక్కొక్కరం ఎవరి ప్రేమల్లో వారున్నామని, ఓ ఇంటివాళ్లం కూడా అయ్యామని, గతంలో చివరిసారి 2012 ఒలింపిక్స్ గేమ్స్ వేడుకల్లో కలుసుకున్నట్లు తెలిపారు. -
నో.... మిస్సమ్మ!
సమ్‌థింగ్ స్పెషల్ మాంచెస్టర్ (ఇంగ్లండ్)కు చెందిన మిస్ వెస్ట్... షాపింగ్ చేయడం అంటే ఇష్టం. అందులో భాగంగా రకరకాల ఐటమ్స్‌ను సేకరించడం అంటే కూడా బోలెడంత ఇష్టం. అలా ఏకంగా 5,000 రకాల స్పైసీ గర్ల్స్ ఐటమ్స్‌ను సేకరించింది. ఇందుకోసం తన పొదుపు మొత్తాలను కూడా వినియోగించేది. 29 సంవత్సరాల వెస్ట్ తన 11వ ఏట నుంచే ఇలా ఆడపిల్లలకు సంబంధించిన వస్తువులను సేకరిం చడం ప్రారంభించింది. కొత్తగా వచ్చిన ఏ వస్తువును ‘మిస్’ చేసేది కాదు. ‘‘మొదట్లో సరదాగా ఈ పని చేసినా తరువాత సీరియస్‌గా చేయడం ప్రారంభించాను’’ అంటుంది వెస్ట్. నచ్చిన వస్తువులు మార్కెట్లో దొరకకపోతే ఆన్లైన్ మార్కెట్లో కూడా కొనుగోలు చేసేది. మిస్ వెస్ట్ అభిరుచి ఊరకే పోలేదు. గిన్నిస్‌బుక్‌లో కూడా ఎక్కింది. తాజా విషయం ఏమిటంటే, తాను అనేక ఏళ్లుగా సేకరించిన వస్తువులతో లండన్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తోంది వెస్ట్. శుభం!