మళ్లీ దుమ్ము రేపనున్న స్పైసీ గర్ల్స్! | Spice Girls record new song | Sakshi
Sakshi News home page

మళ్లీ దుమ్ము రేపనున్న స్పైసీ గర్ల్స్!

Published Fri, May 13 2016 8:25 AM | Last Updated on Mon, Sep 4 2017 12:02 AM

మళ్లీ దుమ్ము రేపనున్న స్పైసీ గర్ల్స్!

మళ్లీ దుమ్ము రేపనున్న స్పైసీ గర్ల్స్!

లండన్: చాన్నాళ్లకు బ్రిటన్కు చెందిన ప్రముఖ బ్యాండ్ స్పైసీ గర్ల్స్ కలిశారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు విడివిడిగా ఉన్నవారు ఈ వారం రహస్యంగా ఓ స్టూడియోలో తిరిగి ఒకరినొకరు కలుసుకున్నారు. అయితే, గతంలో మాదిరిగా దుమ్ములేపే సాంగ్స్ రాసి పాడి ఇరగదీసేందుకే వారు తిరిగి కలిసినట్లు అక్కడి వార్తా సంస్థలు చెప్తున్నాయి. డీప్ ప్లే స్టూడియోలో స్పైసీ గర్ల్స్ గేరి హార్నర్, మెల్ బీ, ఎమ్మా బంటన్ కొత్తకొత్త పరికరాలతో పనిచేస్తూ దాదాపు పదహారేళ్ల తర్వాత తమ తొలిపాటను రాసి పాడి రికార్డు చేసినట్లు సమాచారం. ఈ సాంగ్ దుమ్మురేపేలా ఉందంట.

అయితే, ఇదే బ్యాండ్ కు చెందిన మెల్ సీ, విక్టోరియా బెకాం మాత్రం హాజరుకానట్లు తెలిసింది. స్పైసీ గర్ల్స్ బ్యాండ్ నిర్మాత ఎలియట్ కెన్నడీ కూడా తన ట్విట్టర్ ఖాతాలో దీనిపై స్పందించారు. 'ఇప్పుడు ఆ రోజు చరిత్రలో ఒక రోజుగా మిగిలిపోతుంది. మంచి స్నేహానికి 20 ఏళ్లు దూరంగా ఉండే పరిస్థితి ఎవరికీ ఏర్పడకూడదు. హిట్ సాంగ్' అంటూ ఆయన పోస్ట్ చేశారు. మెల్ బీ కూడా ఇన్ స్టాగ్రమ్ ద్వారా తాము తిరిగి కలిశామని చెప్పింది. 'నేను ఇప్పుడు చెప్తాను.. ఓహ్ లాలా' అంటూ ఆ అమ్మడు పోస్ట్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement