తిరుపతిలో స్పైస్ జెట్ విమానానికి తప్పిన ప్రమాదం
తిరుపతి: హైదరాబాద్ నుంచి బయలుదేరి తిరుపతి చేరుకున్న స్పైస్ జెట్ విమానం తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. విమానాశ్రయంలో రన్ వే దాటి అరకిలోమీటరు ముందుకు వెళ్లింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణీకులు ఈ ఊహించని పరిణామానికి ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణీకులను బస్సులో విమానాశ్రయానికి తరలించారు. విమానంలో 60 మంది ప్రయాణీకులున్నారు.