సునీల్ నరైన్‌కు లైన్ క్లియర్
ఐపీఎల్-8లో ఆడేందుకు కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ సునీల్ నరైన్‌కు మార్గం సుగమమైంది. గతవారం చెన్నైలో ఈ విండీస్ స్పిన్నర్ తన సందేహాస్పద బౌలింగ్ శైలికి సంబంధించిన పరీక్షకు హాజరయ్యాడు. నరైన్ తాజా బౌలింగ్ శైలిని పరిశీలించిన వెంకట్రాఘవన్, జవగళ్ శ్రీనాథ్, జయప్రకాశ్‌లతో కూడిన బీసీసీఐ రివ్యూ కమిటీ అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది.