నవంబర్‌కల్లా గాలిగోపురం నిర్మాణం
– శ్రీకాళహస్తిలో దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తికి తలమానికంగా ఉన్న గాలిగోపురం నిర్మాణాలు నవంబర్‌కల్లా పూర్తయ్యేలా చూడాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జేఎస్వీ ప్రసాద్ సూచించారు. గురువారం రాత్రి ఆయన శ్రీకాళహస్తి దేవస్థానంతోపాటు గాలిగోపుర నిర్మాణాలను పరిశీలించారు. ఆయనతోపాటు జిల్లా స్పెషల్ కలెక్టర్ హివూంసుశుక్లా,ఆలయ చైర్మన్ పోతుగుంట గురవయ్యనాయుడు,సభ్యులు కాసరం రమేష్,పీఎం చంద్ర,ఆలయ ఈవో భ్రవురాంబ, ఈఈ వెంకటనారాయణ ఉన్నారు. గాలిగోపురం పనులను ఆయన నిశితంగా పరిశీలించారు. నిర్మాణపనులు వేగవంతం చేయాలని సూచించారు. గాలిగోపురానికి ప్రహరీగోడ ఏర్పాటు చేయాలని, అద్భుతమైన లైటింగ్ ఏర్పాటు చేస్తే యాత్రికులకు ఆకర్షణగా ఉంటుందని తెలిపారు. తర్వాత శ్రీకాళహస్తి దేవస్థానంలో పలు గోపురాలను పరిశీలించారు. వాటి మరవ్ముతుల విషయాలపై చర్చించారు. దేవస్థానంలో నూతన కట్టడాలు చేయరాదని సూచించారు. మరవ్ముతుల్లోను కళాసంపదకు భంగం వాటిల్లికుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. 2017 ఫిబ్రవరిలో నిర్వహించనున్న మహాకుంభాభిషేకానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. తర్వాత స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయాధికారులు సత్కరించి,స్వామి,అవ్మువార్ల జ్ఞాపికను,తీర్థప్రసాదాలను అందజేశారు.