sri kanaka mahalakshmi ammavari temple
-
శ్రీ కనక మహాలక్ష్మీకి ప్రత్యేక అభిషేకం.. పూజలు
-
వైభవంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు
-
మార్చి 1 నుంచి శ్రీ కనక మహాలక్ష్మి జాతర
చీపురుపల్లి, రూరల్: మార్చి–1 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 22వ జాతర మహాత్సవాలను సమష్టి కృషితో విజయవంతం చేస్తామని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం జరిగిన ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆలయ కమిటీ ఏర్పాటులో నిర్లక్ష్యం చేసిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కమిటీని నియమించిందన్నారు. ఈ ఏడాది జరగనున్న 22వ జాతర మహోత్సవాలను ఆలయ కమిటీ విజయవంతంగా పూర్తి చేయటానికి కృషి చేస్తుందని తెలిపారు. అమ్మవారి అర్చనలో అడ్డూరి వంశానికి మొదట నుంచి ప్రాధాన్యం ఉందని, ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతుందన్నారు. ఈ కారణంగా అడ్డూరి వంశానికి చెందిన వారికి ఆలయ కమిటీలో స్థానం కల్పించామన్నారు. కార్యక్రమంలో ఎంపీ సతీమణి బెల్లాన శ్రీదేవి, ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, పతివాడ రాజారావు, ఇప్పిలి తిరుమల, ఆలయ కమిటీ చైర్మన్ ఇప్పిలి గోవింద, సూరు వెంకటకుమార్‌స్వామి పాల్గొన్నారు. ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు సమక్షంలో ఆలయ కార్యనిర్వహణాధికారి జి.శ్రీనివాసరావు ఈ సందర్భంగా సభ్యులతో ప్రమాణం చేయించారు. ఆలయ కమిటీ సభ్యులుగా ఇప్పిలి సూర్యప్రకాశ్‌రావు (గోవింద్), సూరు వెంకటకుమార్‌స్వామి, కంది శ్రీరాములు, రేగిడి అప్పలనాయుడు, గంట్యాడ వెంకటలక్ష్మి, అడ్డూరి లక్ష్మి, వంకల లత, బుంగ శారద, అడ్డాల వెంకట పద్మావతి ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులంతా కలసి ఇప్పిలి సూర్యప్రకాశ్‌ను చైర్మన్‌గా, సూరు వెంకటకుమార్‌స్వామిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. -
సిరుల తల్లికి మార్గశిర మాసోత్సవాలు
ఉత్తరాంధ్ర జిల్లా వాసులకు సత్యంగల తల్లిగా.. కోరిన వరాలిచ్చే కల్పవల్లిగా, ఆంధ్రజనావళికి అమ్మగా భాసిల్లుతోంది విశాఖపట్నం నగరం ఓడరేవు ప్రాంతంలో బురుజుపేటలో వెలసిన శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారు. తనని సేవించడానికి వర్ణ, వర్గ వివక్షతలేవి ఉండకూడదని అమ్మవారు తనకు గుడి కట్టవద్దని భక్తులకు ఆదేశం ఇవ్వడంతో ఆ తలంపును విరమించుకున్నారు. పూజలు చేసుకోవడానికి వచ్చిన భక్తులు ఎవరికి వారే అమ్మవారికి పసుపు, కుంకుమలతో పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టి దేవికి నివేదించి సేవించుకొనే సంప్రదాయం ఈ ఆలయ ప్రత్యేకత. శ్రీకనక మహాలక్ష్మీ విగ్రహం ఇతర దేవాలయాల వలే గాక గోపురం లేని బహిరంగ మండపంలో ప్రతిష్ఠింపబడింది. భక్తులు తమకు పుట్టిన పసికందును కూడా అమ్మవారి ఒడిలో ఉంచి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతుంటారు. అమ్మవారికి ప్రీతికరమైన గురువారం తెల్లవారింది మొదలు రాత్రి వరకు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలతో పూజించి, నారికేళం సమర్పించడానికి వచ్చే భక్తులకు అంతుండదు. అమ్మవారి ఆలయం 24 గంటలు తెరిచే ఉంటుంది. ఎప్పుడైనా దర్శించుకోవచ్చు. రాష్ట్రంలో 10 దేవాలయాల్లో ఒకటి రాష్ట్రంలోని పది ప్రధాన దేవాలయాల్లో కనకమహాలక్ష్మి దేవాలయం ఒకటి. మార్గశిర మాసోత్సవాల్లో నెలరోజులు నిత్యకల్యాణం, పచ్చతోరణంగా అమ్మవారి సన్నిధి కనబడుతోంది. మార్గశిర మాసోత్సవాలు.. శ్రీకనకమహాలక్ష్మీ అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు నవంబర్ 27 నుంచి డిసెంబర్ 26 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మార్గశిర మాసోత్సవాల్లో వచ్చే గురువారాల్లో లక్షలాది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ నెల 28, డిసెంబరు 5, 12, 19, 26 తేదీల్లో వచ్చే గురువారాల్లో ప్రత్యేకపూజలు, పంచామృతాభిషేకాలు, విశేషపూజలు నిర్వహిస్తుంటారు. డిసెంబర్ 15న వేదసభ, 21న రథోత్సవం, 22న అర్చక సదస్సు, 26న సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. 19న మహాన్నదానం జరపనున్నారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో మాదిరిగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఉచిత భోజన వసతి కల్పిస్తున్నారు. మార్గశిర మాసం చివరి గురువారం మరింత పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టనున్నారు. - చిటికిరెడ్డి వెంకటరమణ, సాక్షి, విశాఖ దక్షిణ మార్గశిర గురువారాల్లో జరిగే విశిష్ట కార్యక్రమాలు ►బుధవారం రాత్రి(తెల్లవారితే గురువారం) ►12.05 నుంచి 1.30 గంటల వరకు విశేష పంచామృతాభిషేక సేవ, సహస్ర నామార్చన పూజ, స్వర్ణాభరణ అలంకరణ ►1.30 నుంచి ఉదయం 11.30 గంటల వరకు సర్వదర్శనం ►11.30 నుంచి 12 గంటల వరకు మహానివేదన(రాజభోగం) ►మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వదర్శనం ►సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు అమ్మవారికి విశేష పంచామృతాభిషేక సేవ, సహస్ర నామార్చన , స్వర్ణాభరణ అలంకరణ ►రాత్రి 7 గంటల నుంచి సర్వదర్శనం, సాంస్కృతిక కార్యక్రమాలు ►ఉదయం 5 నుంచి 6 గంటల వరకు పంచామృతాభిషేకం, అమ్మవారికి సహస్ర నామార్చన ►ఉదయం 6 నుంచి 11 గంటల వరకు సర్వదర్శనం ►11.30 నుంచి మ«ధ్యాహ్నం 12.30 గంటల వరకుపంచామృతాభిషేకం, అష్టోత్తర నామార్చన ►12.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సర్వదర్శనం ►సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు విశేష పంచామృతాభిషేకం ►రాత్రి 7 నుంచి వేకువజాము 4.30 గంటల వరకు సర్వదర్శనం ►మండపంలో జరుగు వైదిక కార్యక్రమాలు.. (గురువారం మినహా..) ►ఉదయం 8 నుంచి 10 గంటల వరకు పంచామృతాభిషేకం, శ్రీచక్ర నవావర్ణార్చన ►ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మార్గశిర మాస విశేష కుంకుమార్చన ►ఉదయం 8 నుంచి 11 గంటల వరకు మార్గశిర మాస శ్రీలక్ష్మీ పూజ, వేదపారాయణ, మహావిద్యా పారాయణ, సప్తశతీ పారాయణ ►ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు అష్టోత్తర కుంకుమార్చన -
కనకమ్మకు నీరాజనం
వైభవంగా తొలి గురువారం పూజలు లక్షకు పైబడి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు డాబాగార్డెన్స్ : ఉత్తరాంధ్రుల కల్పవల్లి, భక్తుల కొంగు బంగారం శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో తొలి గురువారం పూజలను వైభవంగా నిర్వహించారు. మార్గశిర మాసోత్సవాలలో అమ్మవారి దర్శన భాగ్యం కోసం భక్తులు తపిస్తారు. అందునా గురువారం దర్శించుకునేందుకు జన సంద్రమై పోటెత్తుతారు. తొలి గురువారం లక్షమందికి పైగా భక్తులు కనకమ్మను దర్శించినట్టు అంచనా. బుధవారం అర్ధరాత్రి నుంచే భక్తుల తాకిడి మొదలైంది. క్యూలైన్లు టౌన్కొత్తరోడ్డును తాకాయి. దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టింది. ఈ దఫా సామాన్య భక్తులకే ప్రాధాన్యత కల్పించారు. వీఐపీ పాసులకు భారీగా కోత పెట్టడంతో భక్తులకు ఇబ్బంది కలగలేదు. పాసుకు రూ.100 ధర నిర్ణయించారు. అవీ కూడా రెండు వేలు మాత్రమే జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ ఆదేశాల మేరకు ఇక్కడి నిబంధనలను కఠినతరం చేశారు. అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు భక్తుల తాకిడి సాధారణంగా కనిపించినా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రద్దీ అధికంగా ఉంది. సాయంత్రం కూడా భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తొలి పూజను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ నిర్వహించగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఉదయం 10 గంటల ప్రాంతంలో అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సాయంత్రం ఆలయ ప్రాంగణంలో హరికథా గానం భక్తులను అలరించింది. తెల్లవారుజామున, సాయంత్రం అమ్మవారికి విశేష పంచామృతాభిషేకాలు, సహస్రనామార్చనలు జరిపారు. స్వర్ణాభరణాలతో అలంకరించారు. ఆలయ మండపంలో శ్రీచక్రనవార్చన, శ్రీలక్ష్మీ హోమాలు, ప్రత్యేక కుంకుమ పూజలు జరిపారు. 24 గంటలూ ఆలయం తెరిచే ఉంచారు. తోపులాటలు జరగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పా టు చేశారు. పోలీస్ బందోబస్తు పటిష్టం చేశారు. అగ్నిమాపక వాహనాన్ని ఆలయం సమీపంలోనే అందుబాటులో ఉంచారు. మొబైల్ టాయ్‌లెట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ నీటి సౌకర్యం లేకపోవడంతో కొంతమంది ఇబ్బందిపడ్డారు. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. కురుపాం మార్కెట్, పాతపోస్టాఫీస్‌కు వెళ్లే వారి కోసం టౌన్ కొత్తరోడ్డు వద్దనే ట్రాఫిక్‌ను మళ్లించారు. ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి (ఘోషా ఆస్పత్రి) వద్ద స్టాపర్లను ఏర్పాటు చేసి ఎటువంటి వాహనాలను అనుమతించలేదు.