కన్యకాంబకు ‘కోటి’ అలంకారం
వైఎస్ఆర్ జిల్లా కేంద్రం కడప నగరంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని కోటి రూపాయల విలువజేసే రూ. 5, 10, 20, 50, 100, 500, 1000 నోట్లతో అలంకరించారు. కొత్త కరెన్సీ నోట్ల కట్టలు అక్కడే విప్పి చెన్నైకి చెందిన కళాకారులు చిన్న సైజు నుంచి అతి భారీ సైజు గజ మాలలను తయారు చేసి అమ్మవారి ప్రాంగణంలో అలంకరించారు. అమ్మవారిని కొలువుదీర్చిన వేదికను, అమ్మవారికి అలంకరించిన దండలను కూడా కరెన్సీ నోట్లతోనే తయారు చేయడం విశేషం.
- కడప కల్చరల్