Sri Lanka court
-
రాజపక్స అధికారం చెల్లదు
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రధానిగా నియమించిన మహిందా రాజపక్స అధికారం చెలాయించడం కుదరదని శ్రీలంక కోర్టు సోమవారం తేల్చిచెప్పింది. రాజపక్స కేబినెట్ మంత్రులూ విధులు నిర్వర్తించరాదంది. మైత్రిపాల వివాదాస్పద నిర్ణయాన్ని సవాలు చేస్తూ 122 మంది పార్లమెంట్ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఈ తీర్పునిచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 12, 13న చేపడతామని తెలిపింది. అనర్హులు ప్రధాని, మంత్రులుగా ఉంటే భర్తీ చేయలేనంత నష్టం వాటిల్లుతుందని ఈ సందర్భంగా కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాజపక్స ప్రధాని పదవి చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ పదవీచ్యుత ప్రధాని విక్రమసింఘేకు చెందిన యునైటెడ్ నేషనల్ పార్టీ, జనతా విముక్తి పేరమునా(జేవీపీ), తమిళ్ నేషనల్ అలియన్జ్ పార్టీలు గత నెలలో కోర్టును ఆశ్రయించాయి. రాజ్యాంగానికి లోబడి చట్టబద్ధంగా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని విక్రమసింఘె చెప్పారు. అక్టోబర్ 26న రణిల్ విక్రమ్‌సింఘేను తొలగించిన సిరిసేన ఆ పదవిని మహిందా రాజపక్సకు కట్టబెట్టడంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం మొదలైన సంగతి తెలిసిందే. కోర్టు ఉత్తర్వుల్ని మంగళవారం సుప్రీంకోర్టులో సవాలు చేస్తానని రాజపక్స ప్రకటించారు. కేబినెట్‌ను సస్పెండ్ చేయడం సరికాదని, రాజ్యాంగపర విషయాల్లో జోక్యం చేసుకునే అధికారం సుప్రీంకోర్టుకే ఉందని పేర్కొన్నారు. ముగింపు దిశగా సంక్షోభం సంక్షోభం నుంచి గౌరవప్రదంగా బయటపడాలని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌ను రద్దుచేస్తూ సిరిసేన తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. మంగళవారం నుంచి ఈ కేసు తుది విచారణకు రానుంది. కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తుందని భావిస్తున్న సిరిసేన అంతకు ముందే పార్లమెంట్ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని యోచిస్తున్నారని ఆయన పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. -
శ్రీలంక టు ఢిల్లీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీలంక నుంచి తమిళనాడు చేరుకోవాల్సిన ఐదుగురు జాలర్ల ప్రయాణంలో ఆకస్మిక మార్పు చోటుచేసుకుంది. ఉరి విముక్తికి విశేష కృషి చేసిన ప్రధాని నరేంద్రమోదీకి నేరుగా కృతజ్ఞతలు తెలియజేసేందుకు గురువారం రాత్రి వారంతా ఢిల్లీకి చేరుకున్నారు. హెరాయిన్ అక్రమ రవాణా కేసులో శ్రీలంక కోర్టు తమిళ జాలర్లకు ఉరి శిక్ష విధించింది. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో చర్చిం చారు. మోదీ దౌత్యం ఫలించగా ఐదుగురు జాలర్ల ఉరిశిక్ష రద్దయి శ్రీలంక జైలు నుంచి బుధవారం విడుదలయ్యూ రు. ఈనెల 19న శ్రీలంక జైలు నుంచి విముక్తి పొందిన జాలర్లను అదే రోజు సాయంత్రం 4 గంటలకు అక్కడి భారత రాయబార కార్యాలయానికి చేర్చారు. అక్కడి నుంచి తమిళనాడులోని తమ కుటుంబాల వారితో టెలిఫోన్ ద్వారా మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. కొన్నేళ్ల తరువాత తమ వారి గొంతు వినపడడంతో ఇరువైపులవారు ఆనందభాష్పాల్లో మునిగితేలారు. గురువారం సాయంత్రానికల్లా ఇంట్లో ఉంటామని వారు తమవారికి చెప్పుకున్నారు. ఐదుగురి జాలర్ల స్వస్థలమైన రామనాధపురం తంగచ్చి మండపానికి చెందిన వందలాది కుటుంబాలు, జాలర్ల సంఘాలు గురువారం ఉదయాన్నే తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాయి. జాలర్లకు ఘన స్వాగత ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నాయి. నిర్ణీత షెడ్యూలు ప్రకారం ఐదుగురు జాలర్లను గురువారం ఉదయం విమానం ద్వారా తమిళనాడులోని తిరుచ్చిరాపల్లికి చేర్చాలని శ్రీలంక భావించింది. అయితే ఉదయం విమానంలో సీట్లు ఖాళీ లేకపోవడంతో మధ్యాహ్నం 2.30 గంటల విమానంలో పంపేలా మార్పుచేశారు. జాలర్ల విడుదలకు కృషి చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలపాలని జాలర్ల సంఘాలు, కుటుంబాల వారు భావించడంతో వారి ప్రయాణం ఢిల్లీకి మారింది. దీంతో తిరుచ్చి విమానాశ్రయంలోని జాలర్ల కుటుంబాల వారు నిరాశతో వెనుదిరిగిపోయారు. ప్రధాని మోదీని కలుసుకున్న తరువాత శుక్రవారం సాయంత్రంలోగా ఐదుగురు జాలర్లు తమ ఇంటికి చేరుకుంటారని తెలుస్తోంది. మోదీపై ప్రశంసల జల్లు తమిళనాడు జాలర్లను ఉరిశిక్ష నుంచి కాపాడిన ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంశలు జల్లుకురిసింది. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, డీఎంకే అధినేత కరుణానిధి, పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్, వీసీకే అధ్యక్షులు తిరుమావళవన్ తదితరులు ఇది పూర్తిగా మోదీ ఘనతగా అభివర్ణించారు. తమవారికి ప్రధాని మోదీ పూర్ణాయుష్షుతోపాటూ కొత్త జీవితాన్ని ప్రసాదించారని ఆ జాలర్ల కుటుంబాల వారు పేర్కొన్నారు. -
ప్రధాని దృష్టికి తీసుకెళ్తా..
న్యూఢిల్లీ: ఇటీవల శ్రీలంక కోర్టు భారతీయ మత్స్యకారులకు విధించిన మరణ శిక్ష విషయమై ప్రధాని నరేంద్రమోదీని కలిసి సంప్రదించి, వారికి న్యాయం జరిగి విధంగా కృషి చేస్తానని కేంద్ర రోడ్డు రవాణా, నౌకాయాన మంత్రిత్వ శాఖ మాత్యులు నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులో మాట్లాడారు. మత్య్యకారులు తమ సంప్రదాయాలను తనకు వివరించారని, ఈ కేసును ప్రధాని, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకె ళ్తానని చెప్పారు. 2011లో ఈ ఐదుగురు మత్స్యకారులు తమిళనాడు నుంచి మాధకద్రవ్యాలను తరలిస్తుండగా పట్టుకొన్నామని శ్రీలంక నావికాదళం కేసు నమోదు చేసింది. ఈ మేరకు కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేసిందని చెప్పారు. వీరికి శ్రీలంక కోర్టు మరణ శిక్ష విధిస్తూ గతనెల తీర్పు ఇచ్చిందన్నారు. విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఈ విషయాన్ని వెల్లడించారని చెప్పారు. ఈ తీర్పు విషయాన్ని కొలంబోలోని భారత హైకమిషన్ న్యాయవాది ద్వారా హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఐదుగురు మత్స్యకారులకు కిందికోర్టు విధించిన మరణ శిక్షను సమీక్షించాలని కోరిందని అన్నారు. అధికార, న్యాయపరంగా మత్స్యకారులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఇటీవల శ్రీలంకలో భారత రాయబారి వైకే సిన్హా ఇటీవల జైలును సందర్శించి, మత్స్యకారుల విడుదల చేయించి, స్వదేశానికి తిరిగి పంపించేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారని’ గడ్కరీ చెప్పారు. -
తమిళజాలర్లకు ఉరిశిక్ష విధించిన శ్రీలంక కోర్టు