Srinivas Kumar
-
నకిలీ ‘ఫేస్బుక్’తో పారాహుషార్!
సాక్షి, హైదరాబాద్: మారుతున్న సమాజంతో పాటు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న ప్రజలకు తగ్గట్టుగానే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫేస్బుక్.. ట్విట్టర్... ఇలా వివిధ సామాజిక ఖాతాల్లో చురుగ్గా ఉంటూ ముఖ్యంగా ప్రజలు, అభిమానులకు దగ్గరగా ఉంటున్న వీఐపీలు, సెలబ్రిటీల పేర్లను వాడేస్తున్నారు. వారి ఖాతాల్లోని ఫొటోలు, వారు వాడే భాషను అనుకరిస్తూ ఏకంగా వారి పేరుకు దగ్గరగానే నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టిస్తున్నారు. ఇలా వీరు ఆ నకిలీ ఖాతా ద్వారా వారి అభిమానులు, కార్యకర్తలకు ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు. అబ్బా నిజంగా అంతా పెద్దోళ్ల దగ్గరి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడంతో మరేమీ ఆలోచించకుండానే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇదే సైబర్ నేరగాళ్లకు వరమవుతోంది. ఆ తర్వాత వారితో వ్యక్తిగత చాటింగ్ చేస్తూ దగ్గరవుతున్నారు. అనంతరం ఫలానా స్నేహితుడి కుమార్తె వేరే రాష్ట్రంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, మీ అభిమాన గాయకినైనా ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తుండటంతో మీ సహకారం కావాలంటూ... ఇలా వివిధ కారణాలతో వారిని నమ్మిస్తున్నారు. ఇది నిజమని నమ్మిన వారు మరో ఆలోచన చేకుండా వారు చెప్పినట్టుగానే నగదును ఫోన్ పే, గూగుల్ పేల ద్వారా పంపిస్తున్నారు. ఆ తర్వాత అటువైపు నుంచి సరైన సమాధానం లేకపోవడం, వారి పోకడలపై అనుమానం రావడంతో మోసపోయామని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు పెరిగాయని, స్వీయ అప్రమత్తతోనే మోసం బారిన పడకుండా ఉంటామని పోలీసులు సూచిస్తున్నారు. తెలుగు ప్లేబ్యాక్ సింగర్ పేరుతో... అనంతపురం ప్రియాంకనగర్‌కు చెందిన చైతన్య అలియాస్ చైతూ ప్రముఖ తెలుగు ప్లేబ్యాక్ సింగర్ పేరు ఉపయోగించి నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించాడు. ఆమె ఫాలోవర్లను పెద్ద సంఖ్యలో తనవైపునకు తిప్పుకున్నాడు. ఇది నిజమని నమ్మినవారు మోసగాడి వలలో పడి భారీ మొత్తంలో డబ్బులు చెల్లించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ గాయని అతడు 2020 ఫిబ్రవరిలో అనంతపురం జిల్లా సనపలో తన పేరు మీద ఓ ఈవెంట్‌ను కూడా చేశాడని, తన అభిమానుల నుంచి డబ్బులు కొల్లగొట్టాడని ఫిర్యాదు చేశారు. అలాగే నకిలీ ఫేస్బుక్ ఖాతాలతో తన బంధువుల, అభిమానులను ట్రాప్ చేసి మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్ డాటా సహకారంతో నిందితుడు చైతన్యను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి చర్లపల్లి జైలుకు తరలించారు. ఎంపీ సంతోష్‌కుమార్ జోగినిపల్లి పేరుతో... ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలుడు ఎంపీ సంతోష్ కుమార్ జోగినిపల్లి పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించి హైదరాబాద్‌లో ఉంటున్న బాధితుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఇది నిజమని భావించి యాక్సెప్ట్ చేసిన బాధితుడితో నిజంగా జో గినిపల్లి సంతోష్ అనుకునేలా చాటింగ్ చేశాడు. చివరకు బాధితుడి నమ్మాడని తెలిశాక మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న తన స్నేహితుడి కుమార్తెకు డబ్బులు అవసరమంటూ రెండు గూగుల్ పే నంబర్ల పంపాడు. ఇది నిజమని బాధితుడు రూ. లక్షను సదరు నంబర్లకు బదిలీ చేశాడు. తీరా ఇది మోసమని తెలిసి ఈ నెల 25న సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఉత్తరప్రదేశ్‌లో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. జాగ్రత్తలు ఇలా... వీవీఐపీ, వీఐపీ, సినీ ప్రముఖుల పేర్లతో ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వస్తే నమ్మవద్దు. సరిగా తనిఖీ చేసుకున్నాకే వారి సైన్ అనుకరించి ముందుకెళ్లాలి. డబ్బులు అవరమని చాట్ చేస్తే మాత్రం సదరు వ్యక్తికి ఫోన్ కాల్ చేసి నిజమా, కాదా అన్నది నిర్ధారించుకోవాలి. పిల్లలు, వృద్ధులకు వైద్య చికిత్సలకు డబ్బులు అవసరం ఉన్నాయని గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు అడిగితే ట్రాన్స్ఫర్ చేయవద్దు. వీవీఐపీ, వీఐపీ, సినిమా తారలు, సెలబ్రిటీలు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా డబ్బులు అడగరు. – వై.శ్రీనివాస్‌కుమార్, ఏసీపీ, సైబర్‌క్రైమ్ -
ముగ్గురు నైజీరియన్ల ఘరానా మోసం!
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలు కొల్లగొడుతున్న ఓ ముగ్గురు నైజీరియన్లతో పాటు నాగాలాండ్ మహిళను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. నైజీరియన్లు దియోంగ్యూ మహమ్మద్, ముసా హలిమాట్, ఎన్‌డౌర్ అలియోనితో పాటు నాగాలాండ్‌కు చెందిన హలిటో జిమోమీని న్యూఢిల్లీ నుంచి ట్రాన్సిట్ వారంట్‌పై శనివారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. కేసు వివరాలను క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్‌లతో కలసి సీపీ సజ్జనార్ వెల్లడించారు. నేరగాళ్ల పాత్రలిలా.. న్వోసు డొనాల్డ్ ప్రాస్పర్ అలియాస్ దియోంగ్యూ మహమ్మద్ అలియాస్ హీదర్ విలియమ్స్‌గా చలామణి అవుతున్నాడు. నైజీరియాకు చెందిన న్వోసు డొనాల్డ్ ప్రాస్పర్ పేరును దియోంగ్యూ మహమ్మద్‌గా మార్చుకొని సింగపూర్ పాస్‌పోర్టుపై 2018 మార్చిలో టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చాడు. విదేశాల్లో ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న వారి జాబితాను సేకరించి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మెయిల్స్ పంపేవాడు. ముసా హలిమాట్ అలియాస్ మిస్ హీదర్ విలియమ్స్ దియోంగ్యూ ప్రియురాలు. మెడికల్ వీసాపై 2016లో భారత్‌కు వచ్చింది. ఉద్యోగార్థులతో మాట్లాడుతూ వారిని ముగ్గులోకి లాగడం ఈమె పని. ఎన్‌డౌర్ అలి యోని అలిమాస్ బెనిడిక్ట్ ఎనబులిలి అలియాస్ మిస్టర్ రాబర్ట్ సెనగల్ పాస్‌పోర్టుపై 2018 సెప్టెంబర్‌లో టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చాడు. వివిధ కంపెనీల నకిలీ ఈ–మెయిల్ ఐడీలు సృష్టించడంలో దిట్ట. నాగాలాండ్‌కు చెందిన హలిటో జిమోమి అలియాస్ అకిత కుమారి 2019లో నైజీరియాకు చెందిన ఫ్రాన్సిస్ అగాహోన్ను పెళ్లాడింది. అకిత కుమారి పేరుతో మాట్లాడుతూ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చేస్తుంది. పెటోసైల్ ఉఘా, శామ్సన్ విలియమ్‌లు కూడా దియోంగ్యూకు సహకరించేవారు. గుట్టు రట్టయిందిలా.. కూకట్‌పల్లికి చెందిన వి.రాజన్‌బాబు భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ విభాగంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. గత మూడేళ్లుగా ఒడిశాలోని పట్నాయక్ స్టీల్స్‌లో సీఈవోగా పనిచేస్తున్నారు. అక్కడ ఏడాదికి రూ.45 లక్షలు జీతం తీసుకుంటున్నారు. ఎక్కువ జీతం వచ్చే జాబ్ కోసం రాజన్ చేస్తున్న ప్రయత్నాలను నైజీరియన్ బ్యాచ్ గుర్తించింది. లాస్‌ఏంజెలిస్‌లోని కాలిఫోర్నియా రొగల్ హోటల్ అండ్ అపార్ట్మెంట్స్ సీఈవో అంటూ హీదర్ విలియమ్స్ రాజన్‌కు ఫోన్ చేశాడు. ఏడాదికి కోటిన్నర ఇస్తామని చెప్పారు. బోస్టన్ నుంచి ఢిల్లీలోని బ్రిటిష్ కాన్సులేట్‌కు వస్తున్నానని రాజన్‌ను నమ్మించారు. హీదర్ విలియమ్స్ 12 నెలల అడ్వాన్స్ శాలరీ 1.75 లక్షల డాలర్ల డీడీతో వచ్చిందని, ఇది విడుదల చేయాలంటే రూ.55 వేలు చెల్లించాలని అకిత కుమారి మాట్లాడింది. మళ్లీ ఫోన్ చేసి రూ.2.55 లక్షలు చెల్లించాలని అడగడంతో మళ్లీ అంత మొత్తాన్ని జమ చేశారు. ఆ వెంటనే హీదర్ విలియమ్స్ ఫోన్ చేసి మరో రూ.10 లక్షలు ఇవ్వాలంటూ అడగడంతో మళ్లీ ఖాతాలో వేశాడు. ఇలా పలు దఫాలుగా రూ.47 లక్షలు బ్యాంకు ఖాతాల్లో జమ చేశాడు. వారం అయినా నిందితుల నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని తెలుసుకొని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆగస్టు 29న ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు కేసు ఛేదించారు. నిందితుల నుంచి 21 సెల్ఫోన్లు, నాలుగు పాస్‌పోర్టులు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, డెబిట్‌కార్డులు, విదేశీ సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించడంలో కీలకపాత్ర పోషిం చిన ఇన్స్పెక్టర్లు కె.శ్రీనివాస్, సీహెచ్ రామయ్య, ఎస్ఐలు విజయ్ వర్ధన్, రాజేంద్రను సీపీ సజ్జనార్ సత్కరించారు. -
ప్రభుత్వ ఐటీఐ అధికారిపై ఏసీబీ దాడులు
సాక్షి, అమరావతి/విజయవాడ : ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయంటూ అందిన ఫిర్యాదు మేరకు విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జిల్లా స్థాయి శిక్షణా సంస్థ అధికారిగా పనిచేస్తున్న కోనేరు శ్రీనివాసకుమార్ ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం దాడులు చేశారు. ఉదయం ఐదు గంటల నుంచి విజయవాడ నగరంతో పాటు ఆటోనగర్, పెనమలూరు పరిసర ప్రాంతాల్లో శ్రీనివాసకుమార్ కుటుంబ సభ్యులు, బంధువులు స్నేహితులకు సంబంధించి ఆరు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.50 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. పెద్దఎత్తున బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ మీడియాకు విడుదల చేశారు. -
ఐటీఐ ఆఫీసర్ ఇంటిపై ఏసీబీ దాడులు
-
టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ
జనగామ టౌన్ : ఎంపీపీ అభ్యర్థి ఎన్నిక సందర్భంగా శుక్రవారం జనగామ మండల ప్రజాపరిషత్ కార్యాలయం(ఎంపీడీఓ) వద్ద టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు మేరకు జనగామ ఎంపీపీ అభ్యర్థిని ఎన్నుకోవడానికి మండల ప్రజాపరి షత్ స్పెషల్ ఆఫీసర్, ఎన్నికల అధికారి శ్రీనివాస్‌కుమార్ శుక్రవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పట్టణంలో 144 సెక్షన్ విధించి డీఎస్పీ కూర సురేందర్ నేతృత్వంలో సీఐ నరసింహారావు, ఎస్సై కరుణాకర్ బందోబస్తు నిర్వహించారు. ఒకవైపు ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుండగానే.. కార్యాలయం గేటు వద్ద వెహికిల్ పార్కింగ్ చేసే విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అది ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. పరిస్థితి అదుపుతప్పేట్టు ఉండడంతో లాఠీచార్జ్ చేశారు. దీంతో కొందరు ఎదురుగా ఉన్న కోర్టు భవన సముదాయంలోనికి పరుగులు తీసారు. వారిని అదుపులోనికి తీసుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఈ క్రమంలో పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉందని, అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు కొంత శాంతించారు. ఇందిలా ఉండగా అధికార టీఆర్ఎస్ పార్టీ వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించగా, కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ టీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పించుకున్నారు.