stabbed by criminals
-
అమానుషం.. కత్తులతో పొడిచి చంపుతుంటే వేడుక చూశారు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరం నడిబొడ్డున దారుణ ఘటన వెలుగు చూసింది. శనివారం సాయంత్రం సుందర్ నగరి ప్రాంతంలో ఓ యువకుడిని ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సాయంత్రం 7.40 గంటల సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కత్తి పోట్లతో తీవ్ర రక్తస్రావమై మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ దారుణానికి పాల్పడుతున్న సమయంలో ఆ పక్కనే పలువురు వ్యక్తులు ఉన్నా.. చీమకుట్టినట్లు కూడా స్పందించకపోవటం గమనార్హం. బాధితుడు సుందర్ నగరికి చెందిన మనీశ్‌గా గుర్తించారు. పాత పగలతోనే యువకుడిని హత్య చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించారు. ముగ్గురు రాక్షసులు కత్తులతో దారుణంగా పొడుస్తున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ముందు బాధితుడితో పాటు నిందితులు మాట్లాడుతూ వచ్చారు. ఆ కొద్ది సేపటికే అతడిపై దాడి చేసేందుకు యత్నించగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ, ముగ్గురు ఉండటంతో వారి నుంచి తప్పించుకోలేకపోయాడు. పథకం ప్రకారం కత్తులతో వచ్చిన దుండగులు.. విచక్షణారహితంగా ఇష్టం వచ్చినట్లు పొడిచారు. కింద పడిపోయిన తర్వాత కూడా.. వెనక్కి తిరిగి వచ్చి మరీ పొడుస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ పక్కనే కొంత మంది కూర్చుని ఉన్నారు. ఒక వ్యాక్తిని దారుణంగా హత్య చేస్తున్నా.. వారిలో కొంచెం కూడా చలనం కలగలేదు. అలాగే.. చూస్తూ ఉండిపోయారు. ఈ పరిస్థితిని చూసిన పలువురు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మనిషన్నవాడు కనుమరుగవుతున్నాడని వాపోతున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు అలామ్, బిలాల్, ఫైజాన్‌లు సుందర్ నగరికి చెందినవారిగా గుర్తించామని, అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. A youth named Manish was stabbed to death in Sunder Nagri area of Delhi, 3 accused (Aalam, Bilal and Faizan) arrested by Delhi Police. pic.twitter.com/b6OS7v1s0k — Nikhil Choudhary (@NikhilCh_) October 1, 2022 ఇదీ చదవండి: ఫుట్‌బాల్ మైదానంలో తొక్కిసలాట.. 127 మంది దుర్మరణం -
నేను రాజుని.. ఇంటి బయటకు పిలిచి ఆగి ఉన్న కార్ల మధ్యలో దారుణం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఓ వ్యక్తి 28ఏళ్ల మహిళపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడ్డ బాధితురాలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం. పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సెక్టార్ -11 ప్రాంతానికి చెందిన నరేష్ అలియాస్ రాజు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.అయితే ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం రాజు ఇంటి పక్కనే ఉన్న బాధితురాల్ని ఒక్కసారి బయటకు రావాలని కోరాడు. అందుకు బాధితురాలు ఎవరు అని ప్రశ్నించగా.. ఆ నేను రాజుని అంటూ నిందితుడు బదులిచ్చాడు. దీంతో ఓ.!రాజు నువ్వా అంటూ బయటకు వచ్చిన బాధితురాల్ని ఆగి ఉన్న కార్ల మధ్య కార్నర్ చేసి కత్తితో పలుమార్లు దాడి చేశాడు. ఆ సమయంలో స్థానికులు చోద్యం చూస్తున్నట్లు చూస్తున్నారే తప్పా నిలువరించే ప్రయత్నం చేయలేదు. పలుమార్లు బాధితురాల్ని కసితీరా పొడిచిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం స్థానికులు బాధితురాల్ని అత్యవసర చికిత్స కోసం సఫ్దర్ గంజ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు నిందితుడిపి అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది. చదవండి : ఏంటి సార్ ! మా నాన్నకి అంత్యక్రియలు చేయడం కూడా తప్పేనా -
శృంగారానికి నిరాకరించిందని.. పొడిచి చంపేశారు!
గుజరాత్లో దారుణం జరిగింది. తమతో శృంగారానికి నిరాకరించిందన్న కారణంతో.. బాగా తాగి ఉన్న కొంతమంది గూండాలు 22 ఏళ్ల యువతిని కత్తితో పొడిచి చంపేశారు. ఈ దాడిలో ఆమె స్నేహితుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నారన్‌పురా రైల్వే క్రాసింగ్ సమీపంలో జరిగింది. గాయపడిన యువకుడు, మృతురాలి తల్లిదండ్రులు ఏమైనా చెబితే దాన్నిబట్టి కేసు దర్యాప్తు ముందడుగు వేస్తుందని పోలీసులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని రాయగఢ్ ప్రాంతానికి చెందిన బీర్బల్ ప్రసాద్ (26) అనే యువకుడికి అహ్మదాబాద్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో కొంతకాలం క్రితం నిశ్చితార్థం జరిగింది. అయితే కొన్నాళ్ల తర్వాత పెళ్లికూతురి తండ్రి.. ఆ సంబంధం వద్దనుకుని నిశ్చితార్థం రద్దుచేసుకున్నారు. అయితే.. ఆ తర్వాత కూడా ఆమె బీర్బల్తో స్నేహం కొనసాగిస్తోంది. అతడు అప్పుడప్పుడు అహ్మదాబాద్ వచ్చి వెళ్తుండేవాడు. అలాగే వచ్చి రాత్రి కాసేపు మాట్లాడుకున్న తర్వాత.. తిరిగి 10.30 ప్రాంతంలో వెళ్తుండగా ఆమె పీజీ అకామడేషన్ తలుపులు వేసి ఉన్నాయి. దాంతో మరికాసేపు వాళ్లు మాట్లాడుకుంటూ గడిపారు. అదే సమయంలో తాగిఉన్న నలుగురు అక్కడకు వచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. తమతో శృంగారానికి రమ్మని పిలవగా, ఆమె నిరాకరించింది, స్నేహితుడు కూడా వాళ్లను అడ్డుకున్నాడు. వెంటనే వాళ్లు ఆమెను, అతడిని కత్తితో పొడిచారు. ఆమెను పలుమార్లు పొడవడంతో తీవ్రంగా గాయపడింది. బీర్బల్ పోలీసులకు ఫోన్ చేయగా, వారు ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది.