the State Committee
-
కొలిక్కి వచ్చిన జిల్లా అధ్యక్షుల ఎంపిక!
రాష్ట్ర కమిటీ, పొలిట్‌బ్యూరో కూర్పుపై టీఆర్ఎస్ కసరత్తు సాక్షి, హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు, కమిటీల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వరసగా బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు ఇదే అంశంపై కసరత్తు చేశారని పార్టీ వర్గాల సమాచారం. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతోనూ అవసరమైన సందర్భాల్లో సీఎం మాట్లాడి జిల్లా అధ్యక్షుల పేర్లకు తుదిరూపు ఇచ్చారని తెలిసింది. కాగా, రాష్ట్ర కమిటీ, పార్టీ పొలిట్‌బ్యూరో కూర్పుపై ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. 31 జిల్లాల అధ్యక్షుల జాబితాను ఒకేసారి ప్రకటించాలని కూడా నిర్ణయించారని సమాచారం. గతంలో జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో కనీసం ఏడెనిమిది మందికి తిరిగి అవకాశం దక్కనుంది. ఐడీసీ చైర్మన్‌గా నామినేటెడ్ పదవి దక్కించుకున్న కరీంనగర్ జిల్లా(పాత) అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, ఫారెస్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితుడైన నల్లగొండ జిల్లా (పాత) అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించనున్నారు. మిగిలిన ఎనిమిది జిల్లాల్లో పాతవారినే కొనసాగిస్తారని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షుని ఖరారు కొంత జటిలంగా మారినా, ప్రస్తుత అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు పేరు ఖరారైనట్లేనని చెబుతున్నారు. అనుబంధ సంఘాల కమిటీలపై స్పష్టత.. అనుబంధ సంఘాల రాష్ట్ర కమిటీలు, జిల్లా అనుంబంధ సంఘాల కమిటీలపైనా ఒక స్పష్టత వ చ్చిందని తెలుస్తోంది. అయితే, ముందుగా పార్టీ జిల్లా అధ్యక్షుల వరకు ప్రకటి ంచి, మిగిలిన కమిటీలను తర్వాత ప్రకటించే వీలుందని సమాచారం. మరోవైపు పార్టీ రాష్ట్ర కమిటీ, పొలిట్‌బ్యూరో, రాష్ట్ర స్థాయి అనుబంధ సంఘాల కమిటీలను మరో విడతలో ప్రకటించే వీలు లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా, పార్టీ సంస్థాగత కమిటీల వివరాలను శనివారం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు పార్టీ జిల్లా కమిటీల ఏర్పాటు నేపథ్యంలో ఆయా జిల్లాలకు చెందిన నేతల్లో అత్యధికులు హైదరాబాద్‌లోనే మకాం వేశారు. -
కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు
వైఎస్ఆర్సీపీ నేతలు కడప కార్పొరేషన్: కష్టపడిన కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పక గుర్తిస్తుందని, అందుకు ప్రత్యక్ష ఉదాహరణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఎదిగిన ఎంపీ సురేషే అని ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్బీ అంజద్‌బాషా, మేయర్ కె.సురేష్‌బాబు అన్నారు. రాష్ట్ర కమిటీలో ఎంపీ సురేష్‌కు స్థానం లభించిన సందర్భంగా శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతర ం పార్టీ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు, మేయర్ మాట్లాడుతూ ఎంపీ సురేష్ మంచి వాక్చాతుర్యం కలిగిన వాడని, పార్టీ ఆధ్వర్యంలో చేసిన ఆందోళన కార్యక్రమాలు, దీక్షలలో ఆయన నిర్వహించిన పాత్ర మరువలేనిదన్నారు. కష్టపడిన వ్యక్తులను పార్టీ ఎన్నటికీ మరిచిపోదన్నారు. అందుకే ఎంపీ సురేష్‌ను పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలందరూ ప్రతిపాదించారని గుర్తు చేశారు. అనంతరం ఎంపీ సురేష్ మాట్లాడుతూ తనకు పదవులు రావడానికి కారణమైన వైఎస్ జగన్మోహన్రెడ్డికి, ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షునికి కృత జ్ఞతలు తెలిపారు. రెట్టించిన ఉత్సాహంతో పని చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బి.అరీఫుల్లా, అనుబంధ విభాగాల అధ్యక్షులు పులి సునీల్‌కుమార్, నిత్యానందరెడ్డి, వేణుగోపాల్‌నాయక్, కరిముల్లా, చల్లా రాజశేఖర్, ఎస్ఎండీ షఫీ, ఎం. వెంకటేష్, కార్పొరేటర్లు సాయిచరణ్, బండిప్రసాద్, కో ఆప్షన్ సభ్యుడు నాగమల్లారెడ్డి, నాయకులు నాగిరెడ్డి ప్రసాద్‌రెడ్డి, బాలస్వామిరెడ్డి, జి.క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.