breaking news
State Home Minister KJ George
-
‘కిస్’పై పోలీసులదే తుది నిర్ణయం
సాక్షి, బెంగళూరు : వివాదాస్పదమైన కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమానికి అనుమతి ఇచ్చే విషయం బెంగళూరు పోలీస్ కమిషనర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుదని రాష్ట్ర హోంశాఖ మంత్రి కేజే జార్జ్ స్పష్టం చేశారు. మైసూరులో ఆదివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ... కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకూడదంటూ రాష్ట్ర మహిళా కమిషన్ తనకు రాసిన లేఖ అందిందన్నారు. అయితే ఈ విషయంపై తాను ఎటువంటి నిర్ణయం తీసుకోలేనన్నారు. స్థానిక పోలీసులతో చర్చించి కమిషనర్ తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. -
సర్కార్ విఫలం
రాష్ర్టంలో శాంతిభద్రతలు కరువు హోం శాఖ మంత్రి రాజీనామా చేయాలి ప్రహ్లాద్ జోషి ధ్వజం బెంగళూరు : రాష్ట్రంలో శాంతి, భద్రతలను కాపాడడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి విమర్శించారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారమిక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న నేరాలు అందరినీ భయాందోళనల్లోకి నెట్టేస్తున్నాయని మండిపడ్డారు. ఇక చెరుకు రైతుల సమస్యను పరిష్కరించడంపై సైతం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ స్థితిగతులపై చర్చించడంతో పాటు సభ్యత్వ నమోదును పెంచడంపై చర్చించేందుకు గాను బుధవారం 13 రాష్ట్రాల బీజేపీ శాఖల అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు ఇతర పదాధికారులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర్ రావు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు.