state level bankers
-
సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన 215వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) సమావేశం సోమవారం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవెన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్ అరుణ్‌కుమార్, సెర్ప్ సీఈవో, పి.రాజాబాబు, ఎస్ఎల్బీసీ, ఏపీ, కన్వీనర్ వి బ్రహ్మానందరెడ్డి, నాబార్డు సీజీఎం, సుధీర్ కుమార్ జన్నావర్‌తో పాటు వివిధ బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎండీ, సీఈఓ రాజ్ కిరణ్ రాయ్, ఆర్బీఐ జీఎం యశోధా భాయి పాల్గొన్నారు. వార్షిక రుణ ప్రణాళికను సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. మొత్తం 2.83 లక్షల కోట్లతో రుణ ప్రణాళికను రూపొందించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, వ్యవసాయరంగానికి రూ.1.48,500 కోట్లు ఇవ్వాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు. వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టామన్నారు. రుణాల పంపిణీలో నిర్దేశించుకున్న లక్ష్యాలకన్నా అధికంగానే చేపట్టామని.. కొన్ని అంశాల్లో బ్యాంకుల సమర్థత పెరగాల్సి ఉందని సీఎం తెలిపారు. ‘‘నాడు-నేడు కింద స్కూళ్లు, ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. విలేజ్ క్లినిక్స్, టీచింగ్ ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. 6 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకొస్తున్నాం. ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక టీచింగ్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నాం. ఎంఎస్ఎంఈల కోసం రీస్టార్ట్, నవోదయ కార్యక్రమాలు చేపట్టాం. కోవిడ్ సమయంలో వాటికి చేయూతనిచ్చి నడిపించాల్సిన అవసరం ఉంది. తొలి విడతలో 15 లక్షలకుపైగా ఇళ్లను నిర్మిస్తున్నాం. 17 వేలకుపైగా కొత్త కాలనీలను నిర్మిస్తున్నాం. కాలనీల్లో తాగునీరు, డ్రైనేజ్, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. వీటి కోసం సుమారు రూ.34వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మహిళా సాధికారిత కోసం అనేక చర్యలు తీసుకున్నాం. ఆసరా, చేయూత ద్వారా మహిళలను ఆదుకుంటున్నాం. అమ్మఒడి కింద నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తున్నాం. ఈ పథకాలు మహిళా సాధికారితలో కీలకపాత్ర పోషిస్తున్నాయని’’ సీఎం వైఎస్ జగన్ వివరించారు. చదవండి: గ్రామ సర్పంచ్‌లతో మంత్రి పెద్దిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ సాక్షి ఎఫెక్ట్: పల్లా ఆక్రమణలకు చెక్ -
బ్యాంకర్లకు ధన్యవాదాలు : ఈటెల
సాక్షి, హైదరాబాద్ : రైతు బంధు పథకంలో బ్యాంకర్లు గొప్ప సహకారం అందించారని, వారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రైతు బంధు పథకంతో బ్యాంకులలో డబ్బుల కొరత కొంతమేర తగ్గిందన్నారు. దేశంలో రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. గురువారం తాజ్ డెక్కన్‌లో జరిగిన ‘19వ త్రైమాసిక రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశం’లో ఈటెల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2018-19 వార్షిక క్రెడిట్ ప్లాన్‌ను మంత్రి ఆవిష్కరించారు. రైతు బంధు పథకం కోసం కేంద్రం నుంచి 5 వేల కోట్ల రూపాయలను కోరగా.. 3 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని ఈటెల ఈ సందర్భంగా తెలిపారు. కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రమైన తెలంగాణను, అనేక అద్భుతాలు సాధించి నెంబర్ వన్‌లో నిలపడానికి బ్యాంకర్ల పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. తెలంగాణ ప్రస్తుతం ఒక రోల్ మోడల్‌గా ఉందన్నారు. దేశానికి గుజరాత్ రోల్ మోడల్ అని అప్పట్లో చదువుకునే వాళ్లమని, కానీ ఇప్పుడు తెలంగాణ రోల్ మోడల్‌గా చదువుకుంటున్నాం అని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ ముందు ఉందని కాగ్ కూడా క్రెడిట్ ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, దానికి బ్యాంకర్లు అందించిన సహకారం మరవలేదని కొనియాడారు. మిషన్ భగీరథకు బ్యాంకర్లు రూ.25 వేల కోట్లు మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌కు 25 వేల కోట్ల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించారన్నారు. మిషన్ భగీరథకు బ్యాంకర్లు ఇచ్చిన సహకారం ఇప్పటికీ మరవలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి అయితే మరింత సాగు విస్తీర్ణంలోకి వస్తుందని కూడా తెలిపారు. గతంలో ‘రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అనేవారని, కానీ ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ అనే స్థాయికి ఎదిగామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంక్‌ల సంఖ్య పెంచాలని ఈటెల బ్యాంకర్లను కోరారు. బ్యాంక్‌లలో ఉద్యోగుల సంఖ్య పెంచి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు రుణాల ఇచ్చి వారిని ఆర్థికంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వం, బ్యాంకులపైనే ఉందన్నారు. చిన్న చిన్న పరిశ్రమలకు బ్యాంక్ డిపాజిట్ లేకుండా రుణాలు ఇవ్వాలని కోరారు. కుటుంబ పెద్ద చనిపోతే ప్రభుత్వమే ఆదుకునేలా రైతు బీమా పథకం పెట్టామని చెప్పారు. బ్యాంకర్లు ప్రభుత్వంలో భాగమని, తెలంగాణ రాష్ట్రానికి బ్యాంకర్ల సహకారం ఎప్పటికీ ఉండాలన్నారు. ప్రభుత్వం నుంచి బ్యాంక్‌లకు సహాయ సహకారాలు అందుతాయని తెలిపారు. -
రైతు రుణమాఫీ పత్రాల జారీ వేగవంతం
సాక్షి, హైదరాబాద్: రైతులకు ఇచ్చే రుణమాఫీ పత్రాల జారీని వేగవంతం చేయాలని మంగళవారమిక్కడ జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్ణయించింది. ఈ ప్రక్రియ ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పూర్తవగా మరికొన్ని జిల్లాల్లో కొనసాగుతోంది. ఈ నెల 16 నుంచి 23 వరకు రుణమాఫీ వారోత్సవాలు నిర్వహించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. రైతులకు ఇచ్చే రుణమాఫీ పత్రంలో మొత్తం రుణం, మాఫీ రుణం, మిగిలిన రుణానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని పేర్కొంటున్నారు. దీంతో మిగిలిన రుణం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్న భరోసా రైతులకు కలుగనుంది. రెన్యువల్ చేసుకోవాల్సిన రైతులు 8.50 లక్షలు: మొదటి విడతలో ప్రభుత్వం రుణమాఫీ కింద రూ. 4,250 కోట్లు విడుదల చేసి ఈ నిధులను రైతుల ఖాతాల్లో సర్దుబాటు చేసింది. బకాయిలను రెన్యువల్ చేసుకోవాలని విజ్ఞప్తి చేయగా ఇప్పటివరకు 27.50 లక్షల మంది రైతులు రెన్యువల్ చేసుకున్నారు. మరో 8.50 లక్షల మంది ఇంకా చేసుకోవల్సి ఉంది. ఇప్పటివరకు రూ. 3,750 కోట్ల మేర రైతు ఖాతాల రెన్యువల్ పూర్తయింది. మిగిలిన రూ. 500 కోట్ల రుణాల మాఫీ ఖాతాల రెన్యువల్‌కు ఈ నెల ఐదో తేదీ వరకు గడువు ఇచ్చారు. కాగా, రుణమాఫీపై ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ సమావేశం చైర్మన్ నాగిరెడ్డి అధ్యక్షతన బుధవారం జరగనుంది.