సాక్షి, హైదరాబాద్: రైతులకు ఇచ్చే రుణమాఫీ పత్రాల జారీని వేగవంతం చేయాలని మంగళవారమిక్కడ జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్ణయించింది. ఈ ప్రక్రియ ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పూర్తవగా మరికొన్ని జిల్లాల్లో కొనసాగుతోంది. ఈ నెల 16 నుంచి 23 వరకు రుణమాఫీ వారోత్సవాలు నిర్వహించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. రైతులకు ఇచ్చే రుణమాఫీ పత్రంలో మొత్తం రుణం, మాఫీ రుణం, మిగిలిన రుణానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని పేర్కొంటున్నారు. దీంతో మిగిలిన రుణం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్న భరోసా రైతులకు కలుగనుంది.
రెన్యువల్ చేసుకోవాల్సిన రైతులు 8.50 లక్షలు: మొదటి విడతలో ప్రభుత్వం రుణమాఫీ కింద రూ. 4,250 కోట్లు విడుదల చేసి ఈ నిధులను రైతుల ఖాతాల్లో సర్దుబాటు చేసింది. బకాయిలను రెన్యువల్ చేసుకోవాలని విజ్ఞప్తి చేయగా ఇప్పటివరకు 27.50 లక్షల మంది రైతులు రెన్యువల్ చేసుకున్నారు. మరో 8.50 లక్షల మంది ఇంకా చేసుకోవల్సి ఉంది. ఇప్పటివరకు రూ. 3,750 కోట్ల మేర రైతు ఖాతాల రెన్యువల్ పూర్తయింది. మిగిలిన రూ. 500 కోట్ల రుణాల మాఫీ ఖాతాల రెన్యువల్‌కు ఈ నెల ఐదో తేదీ వరకు గడువు ఇచ్చారు. కాగా, రుణమాఫీపై ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ సమావేశం చైర్మన్ నాగిరెడ్డి అధ్యక్షతన బుధవారం జరగనుంది.
రైతు రుణమాఫీ పత్రాల జారీ వేగవంతం
Published Wed, Feb 4 2015 4:24 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement