‘రవాణా’ బంద్ ఉపసంహరణ
సాక్షి, ముంబై: ‘రోడ్డు భద్రత బిల్లు-2014’కు వ్యతిరేకంగా గురువారం చేపట్టిన బంద్‌ను రాష్ట్ర రవాణా వ్యవస్థ యూనియన్లు ఉపసంహరించుకున్నాయి.రవాణ శాఖ మంత్రి దివాకర్ రావుతో జరిగిన చర్చల అనంతరం బంద్ ఉపసంహరించుకున్నట్లు యూనియన్లు ప్రకటించాయి. గురువారం ఉదయం రావుతేతో యూనియన్లు జరిపిన చర్చల్లో మంత్రి సానుకూలంగా స్పందించారు.
పార్లమెంటులో కొత్త బిల్లుకు అనుమతి లభించగానే కొత్త మోటర్ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. కాగా, పుణేలో (చర్చలకు ముందు) ఆర్టీసీ సిబ్బంది నల్ల రిబ్బన్లు కట్టుకుని విధులు నిర్వహించారు. బంద్ కారణంగా లోకల్ రైళ్లలో రద్దీ పెరిగింది. ఉదయం కార్యాలయాలకు చేరుకునే ఉద్యోగులు బస్టాపుల్లో వేచి ఉండాల్సి వచ్చింది. మరోవైపు ముంబైలో బంద్ ప్రభావం అంతగా కనబడలేదు.