రాష్ట్ర స్థాయి పురస్కారానికి లావణ్య ఎంపిక
హాలియా : వర్థమాన కవయిత్రిలకు గురజాడ ఫౌండేషన్ అమెరికా సంస్థ ఇవ్వనున్న రాష్ట్ర స్థాయి తెలుగు కవితా పురస్కారం–2016 పురస్కారాలకు హాలియాకు చెందిన కాట్రాజు లావణ్యసైదీశ్వర్ ఎంపికయ్యారు. ఈనెల 18న హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరగనున్న కార్యక్రమంలో ఆమెకు ఈ పురస్కారం అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ నేటి సమాజంలో నెలకొన్న సమస్యలపై తమ కవితల ద్వారా అక్షర రూపంలో స్పందించడం అలవాటన్నారు. ఇట్టి పురస్కారాలు పలువురు కవులు, రచయితలు, సాహితీ వేత్తల సమక్షంలో అందించనున్నట్లు పేర్కొన్నారు.