యువతకు త్రివిధ దళాల్లో అవకాశాలు
వైవీయూ :
దేశానికి సేవలందించేందుకు త్రివిధ దళాల్లో యువతకు అపార అవకాశాలు ఉన్నాయని స్టెప్ సీఈఓ మమత అన్నారు. బుధవారం నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో ‘ఎయిర్‌ఫోర్స్–అవగాహన సదస్సు’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ భవిష్యత్తుతో పాటు దేశరక్షణ కూడా యువత చేతుల్లోనే ఉందన్నారు. యువత అంతా తమ శక్తి సామర్థ్యాల మేరకు కృషిచేస్తే దేశం ఉన్నతస్థానంలో నిలుస్తుందన్నారు. ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ దిలీప్‌కుమార్ చౌదరి మాట్లాడుతూ ఎయిర్‌ఫోర్స్ విభాగంలో యువతకు ఉన్న అవకాశాలను వివరించారు. కార్యక్రమంలో కళాశాల ఎన్సీసీ అధికారులు డా. ఆర్.నీలయ్య, టి. హజరతయ్య, వ్యాయామ విద్య అధ్యాపకుడు నరసింహారావు, సిబ్బంది పాల్గొన్నారు.