Stern action
-
అల్లరిమూకలపై కఠిన చర్యలు
కాన్పూర్/వారణాసి/రన్సాయ్/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కశ్మీరీలపై దాడులు చేస్తున్న అల్లరిమూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ రాష్ట్రాలను ఆదేశించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచే వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. లక్నోలో ఇటీవల కశ్మీరీ వ్యాపారులపై కొందరు దుండగులు దాడిచేసిన నేపథ్యంలో ప్రధాని స్పందించారు. కశ్మీరీ సోదరులపై లక్నోలో దాడిచేసిన మూర్ఖులపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన మోదీ, లక్నో ఉత్తర–దక్షిణ కారిడార్ మెట్రో సేవలను ప్రారంభించారు. సహాయ నిరాకరణ చేశారు.. కాశీవిశ్వనాథ్ ఆలయం అప్రోచ్ రోడ్డు–సుందరీకరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం మోదీ మాట్లాడుతూ..‘యూపీలో సమాజ్‌వాదీ ప్రభుత్వం కారణంగా మొదటి మూడేళ్లు వారణాసిలో సహాయ నిరాకరణ ఎదురైంది. అందువల్లే వారణాసి సుందరీకరణ ప్రాజెక్టు ఆలస్యమైంది. కానీ మీరు(ప్రజలు) యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాక ప్రాజెక్టుల నిర్మాణం వేగం పుంజుకుంది. ఈ విషయంలో గత ప్రభుత్వాలు సహకారమందించి ఉంటే ఇప్పుడు శంకుస్థాపన కాకుండా ప్రాజెక్టును ప్రారంభించి ఉండేవాళ్లం. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా బాబాను (కాశీ విశ్వనాథుడ్ని) పట్టించుకోలేదు. అందరూ మౌనంగా ఉండిపోయారు. అందుకే ‘నువ్వు(మోదీ) ఎక్కువగా మాట్లాడుతావు. ఇప్పుడు ఇక్కడికి(వారణాసి)కి వచ్చి ఏదైనా చేయ్’ అని ఆ పరమశివుడు నిర్ణయించి ఉంటాడు. కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టులో భాగస్వామి కావడాన్ని నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా’ అని తెలిపారు. -
గుర్తింపులేని పాఠశాలల మూసివేత!
♦ జూన్ ప్రారంభం నుంచి కఠిన చర్యలు ♦ ఆలోగా గుర్తింపు తీసుకోవాలని విద్యాశాఖ సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుర్తింపు లేని పాఠశాలల మూసివేతకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. జూన్ ప్రారంభం నాటికి గుర్తింపులేని పాఠశాలల జాబితా రూపొందించి, వాటిని మూసివేయాలని డీఈవోలకు, క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గుర్తింపులేని స్కూళ్లన్నీ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాలతో సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2016-17 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో గుర్తింపులేని పాఠశాలలు కొనసాగడానికి వీల్లేని విధంగా ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈనెలాఖరు వరకు దరఖాస్తులు రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త పాఠశాలలు ప్రారంభించేందుకు, అదనపు తరగతులు, అదనపు సెక్షన్లకు అనుమతుల కోసం ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ స్పష్టం చేసింది. గతంలోనే దరఖాస్తుల గడువు ముగిసినా.. ఈ నెలాఖరు వరకు గడువును పొడిగించి, ఆన్లైన్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇదే చివరి అవకాశమని, గుర్తింపు తీసుకోకుంటే స్కూళ్లను మూసివేస్తామని స్పష్టం చేసింది. కాగా, డీఈవోలు అందించిన సమాచారం ప్రకారం... రాష్ట్రంలో గుర్తింపు లేకపోయినా 152 పాఠశాలలు కొనసాగుతున్నట్లు విద్యాశాఖ లెక్కలు వేసింది. అయితే ఈ సంఖ్య విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రీప్రైమరీకి గుర్తింపు తప్పనిసరి రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలల్లో కొనసాగుతున్న ప్రీప్రైమరీ విభాగాలకు గుర్తింపు తప్పనిసరిగా తీసుకోవాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. స్కూళ్లలోనే కాకుండా ప్లే స్కూళ్లు, ఇతర పేర్లతో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు కొనసాగిస్తున్న సంస్థలు కూడా తప్పనిసరిగా గుర్తింపు తీసుకోవాలని... లేదంటే వాటిని మూసేస్తామని తెలిపింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే 1,500 వరకు ప్రీప్రైమరీ విద్యా సంస్థలు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని కొనసాగిస్తుండగా... ఇతర జిల్లాల్లో మరో వెయ్యి వరకు ఉన్నట్లు అంచనా. అయితే ఇందులో ఇప్పటివరకు 18 సంస్థలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. -
సేవా పన్ను ఎగవేస్తే కఠిన చర్యలు పి. చిదంబరం
చెన్నై: సేవా పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం హెచ్చరించారు. ఆర్థిక నేరాలకు పాల్పడే వారి గురించి ప్రభుత్వం దగ్గర అన్ని వివరాలు ఉన్నాయని ఆయన చెప్పారు. సేవా పన్ను ఎగవేత ఆరోపణలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా పది మంది అరెస్టయ్యారని చిదంబరం తెలిపారు. సర్వీస్ ట్యాక్స్ ఎగవేత ఎక్కువగా ఉండే కన్సల్టెన్సీ, ఐటీ, రియల్ ఎస్టేట్ వంటి రంగాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారిస్తోందని ఆయన చెప్పారు. కొన్ని నగరాల్లో ఇది తీవ్ర స్థాయిలో ఉండటాన్ని తాను గమనించినట్లు చిదంబరం చెప్పారు. ఉదాహరణకు చెన్నైలో కాంట్రాక్టు సర్వీసులు, అడ్వర్టైజ్మెంట్, ఐటీ, కన్సల్టెన్సీ తదితర రంగాల్లో ఇలాంటి ధోరణి కనిపించిందన్నారు. స్వచ్ఛందంగా సేవా పన్ను చెల్లించడాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన వీసీఈఎస్ పథకంపై పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా చిదంబరం ఈ విషయాలు చెప్పారు. రూ. 50 లక్షలకు మించి ఎగవేసిన వారిపై మాత్రం అరెస్టు అస్త్రం ప్రయోగిస్తున్నామని, ఇది చిన్న మొత్తం కాదని ఆయన తెలిపారు. తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారి గురించి తమ దగ్గర వివరాలు లేవనుకోరాదని, తమ దగ్గర పుంఖానుపుంఖాలుగా సమాచారం ఉందని చెప్పారు. అయితే, శాఖాపరమైన పరిమితుల వల్లే అందరిపై తక్షణ చర్యలు సాధ్యపడటం లేదు తప్ప అంతిమంగా నేరాలకు పాల్పడిన వారికి శిక్షలు తప్పవని చిదంబరం హెచ్చరించారు.