Steve OKeefe
-
ఒకీఫ్‌పై ఏడాది నిషేధం
మత్తులో మాట తూలడమే కారణం సిడ్నీ: భారత్‌తో టెస్టు సిరీస్‌లో చెలరేగి ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ స్పిన్నర్ స్టీవ్ ఒకీఫ్ వ్యక్తిగత ప్రవర్తనతో ఇబ్బందుల్లో పడ్డాడు. మద్యం మత్తులో తీవ్ర అభ్యంతరక వ్యాఖ్యలు చేయడంతో అతనిపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చర్య తీసుకుంది. ఏడాది పాటు దేశవాళీ వన్డే టోర్నీల్లో పాల్గొనకుండా నిషేధించడంతో పాటు 20 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 9 లక్షల 66 వేలు) జరిమానా విధించింది. ఇటీవల ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్టీవ్ వా మెడల్ ప్రదానోత్సవం తర్వాత జరిగిన పార్టీలో ఒకీఫ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘న్యూసౌత్‌వేల్స్ అధికారిక కార్యక్రమంలో నేను చాలా ఎక్కువగా తాగి తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశాను. నా తప్పును అంగీకరించి క్షమాపణ కోరుతున్నాను. నాపై విధించిన శిక్షను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. మున్ముందు ఈ విషయంలో ప్రత్యేక కౌన్సిలింగ్ కూడా తీసుకోబోతున్నాను’ అని ఒకీఫ్ వివరణ ఇచ్చాడు. 32 ఏళ్ల ఒకీఫ్ భారత్‌లో జరిగిన నాలుగు టెస్టుల్లో 19 వికెట్లు పడగొట్టాడు. -
ఆసీస్ స్పిన్నర్ల ప్రదర్శన అద్భుతం: గంగూలీ
కోల్‌కతా: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆస్ట్రేలియా స్పిన్నర్లు నాథన్ లయన్, స్టీవ్ ఒకీఫ్లపై ప్రశంసలు కురిపించారు. ఓ క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్‌ను ఇద్దరు ఆసీస్ స్పిన్పర్లు శాసించడం గతంలో ఎప్పుడు చూడలేదని అన్నారు. తొలి టెస్టులో ఒకీఫ్ (6/35, 5/35), రెండో టెస్టులో లయన్ (8/50) భారత వెన్నువిరిచిన సంగతి తెలిసిందే. దీనిపై గంగూలీ స్పందిస్తూ ఈ ఇద్దరు స్పిన్నర్లు భారత పిచ్‌లపై అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని కితాబిచ్చారు.