Still-born
-
అయ్యో..పాపం పసికందు..!
సాక్షి, గజపతినగరం రూరల్: ఏ తల్లి కన్నదో ఆ బిడ్డను. నవమాసాలు మోసి... ప్రసవవేదన అనుభవించి... చివరకు జన్మనిచ్చింది. కానీ ఆ బిడ్డ వారికి బరువైందో... మృతశిశువును కన్నదో... పుట్టిన బిడ్డ ఊపిరాగిందో... లేక ఏ ప్రబుద్ధుడి మోసానికి బలై అన్యాయంగా తల్లిగా మారిందో... కానీ ఓ మగబిడ్డను నిర్దాక్షిణ్యంగా రోడ్డు పక్కన కాలువలో పడేశారు. నీటిలో తేలియాడితూ పసికందు మృతదేహం మంగళవారం ఉదయం వెలుగు చూసింది. గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారి వద్ద చిన్న పాటిగా ఉన్న లోతట్టు ప్రాంతంలోని నీటిలో తేలియాడుతున్న ఆ పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి మధుపాడ వీఆర్ఓ దాసరి అప్పలరాజుకు సమాచారం అందించారు. ఆయన గజపతినగరం పోలీస్ స్టేషన్‌కు తెలియజేయడంతో సీఐ విద్యాసాగర్, ఎస్ఐ సన్యాసినాయుడు అక్కడకు చేరుకొని మృతశిశువును పరిశీలించారు. అనంతరం ఆ మృతశిశువును శవపంచనామాకోసం తరలించారు. అయితే ఆ బిడ్డ మృతి చెంది మూడు లేదా నాలుగు రోజులు అయి ఉండవచ్చని ప్రాథమికంగా ఆస్పత్రిలో పరిశీలించిన గజపతినగరం సూపరింటెండెంట్ డాక్టర్ అరుణా దేవి తెలిపారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు తెలిపారు. -
వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద గర్భస్థ మృత శిశువు
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద గర్భస్థ మృతశిశువు లభ్యమైంది. బుధవారం ఉదయం కుక్కల గుంపు కార్యాలయం గేటుకు సమీపంలో అరుస్తూ ఉండగా అటుగా వెళ్లిన వారు గమనించి అది మృతశిశువుగా గుర్తించారు. వెంటనే కుక్కలను తరిమివేసి.. విషయాన్ని పోలీసులకు చెప్పారు. నెలలు నిండకుండానే జన్మించిందో లేక అబార్షన్ చేశారో తెలియదు గానీ అవయవాలు పూర్తిగా ఏర్పడకుండా ఉన్న గర్భస్థ మృతశిశువు అక్కడ పడి ఉంది. ఉదయం ఓ మహిళ కార్యాలయం గేటు వద్ద కాసేపు కూర్చుని వెళ్లిందని, ఆమె వెళ్తూ అట్ట డబ్బాలో దేన్నో వదిలేసి వెళ్లిందని పోలీసులకు కొందరు చెప్పినట్లు సమాచారం. అనంతరం పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు కలిసి మృతదేహాన్ని ఖననం చేయించారు. భ్రూణహత్యలు నిరోధిస్తామని, స్కానింగ్ సెంటర్లపై ఆకస్మిక దాడులు చేస్తామని నిరంతరం చెప్పే వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం వద్దే మృతశిశువును వదిలేయడం కలకలం సృష్టించింది. -
చెట్లపొదల్లో మృతశిశువు
- హిమాయత్‌నగర్‌లో వెలుగుచూసిన ఘటన మొయినాబాద్ రూరల్: నెలలు నిండని పసికందు మృతదేహం చెట్లపొదల్లో కనిపించిన సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, ఎస్ఐ సంజీవ్, ఏఎస్ఐ అంతిరెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. మండల పరిధిలోని హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ మహిళ కూలి పనులు చేసుకుంటు జీవనం కొనసాగిస్తోంది. ఐదునెలల గర్భవతిగా ఉన్న ఆమె మంగళవారం రాత్రి ఓ ఆర్ఎంపీ వైద్యురాలి దగ్గద అబార్షన్ చేయించుకుంది.శిశువును హిమయతనరగ్ గ్రామ సమీపంలో ఉన్న చెట్లపొదల్లో పడేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ ఉపసర్పంచ్ షాబాద్ శ్యామ్‌రావు, గ్రామానికి చెందిన మరి కొంత మందితో సంఘటన స్థలా న్ని సందర్శించారు. అప్పుడే స్థానిక పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో ఘటన స్థలానికి ఎస్ఐ, ఏఎస్ఐ వచ్చా రు. శిశువు మృతదేహానికి పంచనామా నిర్వహించారు.అనంతరం శిశువు మృతదేహం లభించిన చోట సెలైన్బాటిళ్లను పరిశీలించిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారించగా అసలు విషయం బయట పడింది.అదే గ్రామానికి చెందిన ఓ మ హిళ అబార్షన్ చేయించుకున్నట్లు తెలి సింది.దీంతో ఆమెకు సహకరించిన ఆర్ఎంపీ డాక్టర్ ఎవరనే విషయం తెలుసుకునేందుకు విచారణ చేపట్టినట్లు పోలీ సులు తెలిపారు.అబార్షన్ చేసిన ఆర్ఎం పీపై తప్పకుండా కేసు నమోదు చేయ డం జరుగుతుందని వారు తెలిపారు. పుట్టగొడుగుల్లా నకిలీ డాక్టర్లు గ్రామీణ ప్రాంత నిరుపేదలను ఆస రాగా చేసుకొని మండలంలో ఆర్ఎంపీ డాక్టర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా రు. సామాన్య ప్రజలకు జ్వరం వచ్చినా ఏమందు ఇవ్వాలో తెలియని వారు డాక్టర్లుగా చలామణిఅవుతున్నారు. ప్రభుత్వం ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.