చెట్లపొదల్లో మృతశిశువు
- హిమాయత్‌నగర్‌లో వెలుగుచూసిన ఘటన
మొయినాబాద్ రూరల్: నెలలు నిండని పసికందు మృతదేహం చెట్లపొదల్లో కనిపించిన సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, ఎస్‌ఐ సంజీవ్, ఏఎస్‌ఐ అంతిరెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. మండల పరిధిలోని హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ మహిళ కూలి పనులు చేసుకుంటు జీవనం కొనసాగిస్తోంది. ఐదునెలల గర్భవతిగా ఉన్న ఆమె మంగళవారం రాత్రి ఓ ఆర్‌ఎంపీ వైద్యురాలి దగ్గద అబార్షన్ చేయించుకుంది.శిశువును హిమయతనరగ్ గ్రామ సమీపంలో ఉన్న చెట్లపొదల్లో పడేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ ఉపసర్పంచ్ షాబాద్ శ్యామ్‌రావు, గ్రామానికి చెందిన మరి కొంత మందితో సంఘటన స్థలా న్ని సందర్శించారు. అప్పుడే స్థానిక పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో ఘటన స్థలానికి ఎస్‌ఐ, ఏఎస్‌ఐ వచ్చా రు. శిశువు మృతదేహానికి పంచనామా నిర్వహించారు.అనంతరం శిశువు మృతదేహం లభించిన చోట సెలైన్‌బాటిళ్లను పరిశీలించిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారించగా అసలు విషయం బయట పడింది.అదే గ్రామానికి చెందిన ఓ మ హిళ అబార్షన్ చేయించుకున్నట్లు తెలి సింది.దీంతో ఆమెకు సహకరించిన ఆర్‌ఎంపీ డాక్టర్ ఎవరనే విషయం తెలుసుకునేందుకు విచారణ చేపట్టినట్లు పోలీ సులు తెలిపారు.అబార్షన్ చేసిన ఆర్‌ఎం పీపై తప్పకుండా కేసు నమోదు చేయ డం జరుగుతుందని వారు తెలిపారు.
పుట్టగొడుగుల్లా నకిలీ డాక్టర్లు
గ్రామీణ ప్రాంత నిరుపేదలను ఆస రాగా చేసుకొని మండలంలో ఆర్‌ఎంపీ డాక్టర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా రు. సామాన్య ప్రజలకు జ్వరం వచ్చినా ఏమందు ఇవ్వాలో తెలియని వారు డాక్టర్లుగా చలామణిఅవుతున్నారు. ప్రభుత్వం ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.