Stirring
-
కండక్టర్, డ్రైవర్ మధ్య వాగ్వాదం
భిక్కనూరు, నిజామాబాద్ : ‘ప్రయాణికుల సేవయే మా కర్తవ్యం’ అని చెప్పే ఆర్టీసీ యాజమాన్యం సిబ్బంది ఆవేశం, నిర్లక్ష్యంతో ప్రయాణికులకు సేవలు చేయడం మాని ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు గతంలో కొక్కొల్లోలు. భిక్కనూరు మండలం బస్వాపూర్ వద్ద కండక్టర్ డ్రైవర్ వాగ్వాదానికి దిగారు. దీంతో కండక్టర్ బస్సు నుంచి దిగిపోయాడు. ఫలితంగా అరగంట పాటు బస్సు రోడ్డు పక్క న నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. కామారెడ్డి డిపోకు చెందిన బస్సు (ఏపీ 26జడ్ 0049) మెదక్ జిల్లా రామాయంపేట నుంచి గురువారం రాత్రి 6–30 గంటలకు కామారెడ్డి కి ప్రయాణికులతో బయలు దేరింది. బస్సు లో ప్రయాణికులు భారీగా ఉంది. దీంతో కం డక్టర్ బస్సును నిలిపివేస్తే టిక్కెట్లు ఇస్తానని డ్రైవర్‌కు చెప్పాడు. ఉక్క పోస్తుంది బస్సును మెల్లిగా నడుపుతా అంటూ బస్సును మెల్లిగా నడిపించాడు. ఈ క్రమంలో బస్సు భిక్కనూ రు మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని జైకా హోటల్ సమీపంలోకి 6.40 గంటలకు చేరుకుంది. డ్రైవర్, కండక్టర్ ఇద్దరూ ఈ విషయమై తిరిగి గొడవ పడ్డారు. దీంతో డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. కండక్టర్ వెంటనే టిక్కెట్ల మిషన్ క్యాష్ బ్యాగ్ తీసుకుని బస్సు దిగి కొద్దిదూరం వెళ్లి కామారెడ్డి వైపు వెళ్లె వాహనాలను ఆపేందుకు యత్నించాడు. వెంటనే డ్రైవర్ కూడా బస్సు దిగి కండక్టర్‌తో తిరిగి వాగ్వాదానికి దిగాడు. ఇరువురు మరోసారి గొడవ పడ్డారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. పలువురు ప్రయాణికులు డ్రైవర్ కండక్టర్లను సముదాయించారు. కండక్టర్ డైవర్లు బస్సు ఎక్కారు. కండక్టర్ డ్రైవర్ల వాగ్వాదాంతో అరగంటపాటు ప్రయాణికులు రోడ్డుపై నిలుచోవాల్సి వచ్చింది. -
అదే తిప్పుతుంది... తిరుగుతుందీ...
కాఫీ తాగాలన్నా.. బూస్ట్ తాగాలన్నా.. కనీసం ఉత్త పాలు తాగాలన్నా.. స్టిర్రింగ్.. అదేనండీ.. చెంచాతో తిప్పే పని తప్పదు మనకు. కాఫీ అయినా.. బూస్ట్ అయినా.. వాటి ఫ్లేవర్లే కాక పంచదార కూడా కరగడానికి చెంచాకు పని చెబుతుంటాం... అదో పెద్ద పనిగా భావించే వాళ్లు కూడా లేకపోరు. అలాంటి వారి కోసమే వచ్చేసింది.. ‘సెల్ఫ్ స్టిర్రింగ్ మగ్’.. చిత్రంగా ఉంది కదూ.. అవునండీ.. ఇందులో పాలు, బూస్ట్ పౌడర్ లేదా కాఫీ పౌడర్, పంచదార వేసి మగ్కు ఉన్న బటన్ నొక్కండి చాలు. దానంతటదే.. రయ్‌మని తిరుగుతుంది. కలర్, ఫ్లేవర్ వచ్చిందని తెలిసినప్పుడు ఆ బటన్ ఆఫ్ చేస్తే సరి. ఈ స్టిర్రింగ్ మగ్‌తో మీకు.. అలాగే చెంచాకు పని తప్పినట్టే. పిల్లలకు ఇందులో పాలు, పంచదార వేసి ఇచ్చేయండి.. మిగతా పనంతా మగ్గే చూసుకుంటుంది. అంతేకాదు పిల్లలు భలే సరదా పడతారు.