అదే తిప్పుతుంది... తిరుగుతుందీ... | Self stirring Mug | Sakshi
Sakshi News home page

అదే తిప్పుతుంది... తిరుగుతుందీ...

Published Sat, Jun 25 2016 10:49 PM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

అదే తిప్పుతుంది... తిరుగుతుందీ...

అదే తిప్పుతుంది... తిరుగుతుందీ...

కాఫీ తాగాలన్నా.. బూస్ట్ తాగాలన్నా.. కనీసం ఉత్త పాలు తాగాలన్నా.. స్టిర్రింగ్.. అదేనండీ.. చెంచాతో తిప్పే పని తప్పదు మనకు. కాఫీ అయినా.. బూస్ట్ అయినా.. వాటి ఫ్లేవర్లే కాక పంచదార కూడా కరగడానికి చెంచాకు పని చెబుతుంటాం... అదో పెద్ద పనిగా భావించే వాళ్లు కూడా లేకపోరు. అలాంటి వారి కోసమే వచ్చేసింది.. ‘సెల్ఫ్ స్టిర్రింగ్ మగ్’.. చిత్రంగా ఉంది కదూ.. అవునండీ.. ఇందులో పాలు, బూస్ట్ పౌడర్ లేదా కాఫీ పౌడర్, పంచదార వేసి మగ్‌కు ఉన్న బటన్ నొక్కండి చాలు.

దానంతటదే.. రయ్‌మని తిరుగుతుంది. కలర్, ఫ్లేవర్ వచ్చిందని తెలిసినప్పుడు ఆ బటన్ ఆఫ్ చేస్తే సరి. ఈ స్టిర్రింగ్ మగ్‌తో మీకు.. అలాగే చెంచాకు పని తప్పినట్టే. పిల్లలకు ఇందులో పాలు, పంచదార వేసి ఇచ్చేయండి.. మిగతా పనంతా మగ్గే చూసుకుంటుంది. అంతేకాదు పిల్లలు భలే సరదా పడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement